తెలంగాణా స్టైల్ మసాలా గుడ్డు పులుసు
చిక్కని గ్రేవీ తో, పుల్లగా కారంగా ఉంటె ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ ఇష్టమే! అలాంటి చిక్కని మసాలా గుడ్డు పులుసు బేచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. కమ్మగా ఉండటాన పిల్లలు కూడా ఇష్టం గా తింటారు.ఈ పులుసు అన్నం, చపాతీ, పూరి,అట్టు ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది.ఈ పులుసు లో వేసే నువ్వులు, వేరుసెనగపప్పు, కొబ్బరి కమ్మని చిక్కని గ్రేవీ ఇస్తుంది. ఇలాంటి రెసిపీనే ఎగ్ మసాలా కుర్మా పేరుతో పోస్ట్ చేశా, అది ఎక్కువ మసాలాలతో ఉంటుంది. నచ్చితే అది కూడా ట్రై చేయండి. అందులో గుడ్లని వేపరు. ఇవే కాదండి ఇంకా మీరు గుడ్డు మసాలా పులుసు, ఎగ్ సలాడ్ ఇవి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయ్.
Tips
దింపే ముందు పులుపు కి తగినట్లుగా ఉప్పు కారాలు సరి చేసి దిమ్పెసుకోండి
గ్రేవీ చలారుతున్న కొద్ది చిక్కబడుతుంది అందుకే కాస్త జరుగా చేసుకుంటే చల్లారే పాటికి చిక్కదనం సరిపోతుంది.
చల్లారాక ఇంకా చిక్కగా ఉంటె కాసిని వేడి కలుపుకోండి.
Ingredients
పులుసు కోసం:
- 5 ఉడికించిన గుడ్లు
- ⅓ cup నూనె (80 ml)
- ½ లీటర్ నీళ్ళు
- 2 tbsp కొత్తిమీర తరుగు
గ్రేవీ కోసం:
- ¼ cup వేరుసెనగపప్పు
- ¼ cup నువ్వులు
- ¼ cup ఎండు కొబ్బరి పొడి
- 2 tbsp ధనియాలు
- 1 tbsp జీలకర్ర
- ¼ tbsp మెంతులు
- 2 ఉల్లిపాయ తరుగు పెద్దవి (150 gms)
- 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
- ¼ tbsp పసుపు
- 1 tbsp కారం
- ఉప్పు
- 300 ml చింతపండు పులుసు (60 గ్రాముల చింతపండు నుండి తీసినది)
Instructions
- మూకుడులో వేరుసేనగపప్పు, మెంతులు వేసి ఎర్రగా లో- ఫ్లేం మీదే వేపుకోవాలి.
- పప్పు బాగా వేగాక ధనియాలు, జీలకర్ర, వేసి ఓ నిమిషం వేపుకోవాలి, ఆ తరువాత నువ్వులు వేసి చిటచిటలాడించాలి.
- ఆఖరున కొబ్బరి పొడి వేసి 30 సెకన్లు వేపి మెత్తని పొడి చేసుకోవాలి
- మూకుడులో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి. (ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే గ్రేవీ కి చిక్కని రుచి) వేగిన ఉల్లిపాయల్ని మెత్తగా చేసుకున్నపొడి లో వేసుకోవాలి.
- అదే మిక్సీ జార్ లో పొడి తో పాటు అల్లం వెల్లూలి ముద్దా, కారం, ఉప్పు, చింతపండు పులుసు, పసుపు అన్నీ వేసి మెత్తని వెన్నలాంటి పేస్టు చేసుకోవాలి
- ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకున్న నూనె లో గుడ్లకి గాట్లు పెట్టి గరిట బోర్లించి తిప్పుతూ హై ఫ్లేం మీద ఎర్రగా వేపి తీసుకోవాలి. (హై ఫ్లేం మీద కలుపుతూ వేపితే గుడ్లు పగలవ్, లేదంటే పగిలి నూనె చిందుతుంది)
- గుడ్లు వేగాక పక్కకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
- నూనె పైకి తేలాక 1/2 లీటర్ నీళ్ళు పోసి హై ఫ్లేం మీద మూత పెట్టి బాగా ఉడుకురానివ్వాలి.
- గ్రేవీ ఉడుకుపట్టాక గుడ్లు వేసి మంట తగ్గించి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి, మధ్య మధ్య లో అడుగు నుండి కలుపుకోవాలి.
- దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లుకోండి.
తెలంగాణా స్టైల్ మసాలా గుడ్డు పులుసు
Ingredients
పులుసు కోసం:
- 5 ఉడికించిన గుడ్లు
- ⅓ cup నూనె 80 ml
- ½ లీటర్ నీళ్ళు
- 2 tbsp కొత్తిమీర తరుగు
గ్రేవీ కోసం:
- ¼ cup వేరుసెనగపప్పు
- ¼ cup నువ్వులు
- ¼ cup ఎండు కొబ్బరి పొడి
- 2 tbsp ధనియాలు
- 1 tbsp జీలకర్ర
- ¼ tbsp మెంతులు
- 2 ఉల్లిపాయ తరుగు పెద్దవి 150 gms
- 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
- ¼ tbsp పసుపు
- 1 tbsp కారం
- ఉప్పు
- 300 ml చింతపండు పులుసు 60 గ్రాముల చింతపండు నుండి తీసినది