తోటకూర పొడి కూర| తోటకూర వేపుడు

google ads

తోటకూర పొడి కూర| తోటకూర వేపుడు

Author Vismai Food
THOTAKURA PODI KURA
కమ్మని కూరతో తృప్తిగా భోజనం చేయాలనుకుంటే నా స్టైల్ తోటకూర వేపుడు ట్రై చేయండి, చాలా నచ్చేస్తుంది. ఇది అన్నం, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.సాధారణంగా నన్ను అందరూ రోజూ చేసుకుని తినే కూరలు పోస్ట్ చేయండి అని అడుగుతుంటారు.
నాకు నిజంగా పోస్ట్ చేయలనున్నా అందరికి తెలిసినవే కదా అని ఊరుకుంటా.ఇంకా నా రెసిపీ ప్రేత్యేకంగా ఉంటె చెప్పాలనుకుంటా, అందుకే ఎక్కువగా అలాంటి కూరలు నేను పోస్ట్ చేయలేదు.
ఈ పొడి కూర అందరికి తెలిసినదే అయినా నా రెసిపీ ప్రేత్యేకం. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఆకుకూరలు తినలేము, వొద్దు అనుకునే వారు కూడా ఇలా చేసి పెడితే తప్పక ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మా ఇంటి రెసిపీ. చాలా ఎక్కువాగా చేస్తుంది మా అమ్మ.
THOTAKURA PODI KURA

Tips

కమ్మని పొడి కూరకి కొన్ని టిప్స్:
పొడి కూర లో వేసే పొడికి వేపే పల్లీలు లో- ఫ్లేం మీద వేపితే కమ్మని రుచి పొడికి
ఆకుకూర నేను తోటకూర వాడను, మీరు మరింకేదైనా ఆకుకూర వాడుకోవచ్చు. లేదా కలకూరగా అన్నీ కలిపి వాడుకోవచ్చు
నేను 7 చిన్న తోట కూర కట్టలు వాడను. ఆకుకూరతో పాటు కాడలు కూడా తరిగి వేసుకుంటే రుచిగా ఉంటాయి. తప్పక వాడండి
చేసుకున్న పొడి మీరు వాడే మిరపకాయాలని బట్టి ఘాటు, కారం ఉంటుంది. కాబట్టి కొద్దిగా తగ్గించి పొడి వేసి రుచి చూసి మిగిలిన పొడి వేసుకోండి
తోటకూర లో వెల్లూలి రుచి చాలా బాగుంటుంది. నచ్చని వారు వదిలేయండి
ఆకు పొడి పొడిగా రావాలంటే ఆకు మగ్గాక మూత తీసి కలుపుతూ వేపుకోవాలి చెమ్మ పోయేదాకా
పొడి వేసాక హై-ఫ్లేం మీద కలుపుతూ వేపుకుంటే పొడి పొడిగా వస్తుంది
ఇవి కూడా ట్రై చేయండి

Ingredients

పొడి కోసం:

 • 1/4 cup వేరు సెనగపప్పు
 • 3 tsps వేపిన సెనగపప్పు (పుట్నాల పప్పు)
 • 8-10 ఎండుమిర్చి
 • 1 tsp జీలకర్ర

వేపుడు కోసం:

 • 1/4 tbsp నూనె
 • 1 cup ఆవాలు
 • 1 cup మినపప్పు
 • 4 దంచిన వెల్లూలి
 • 1/4 tsp పసుపు
 • 1 tsp ఉప్పు
 • 1 రెబ్బ కరివేపాకు
 • 1 ఉల్లిపాయ తరుగు
 • 2 పచ్చిమిర్చి తరుగు
 • 7 చిన్న కట్టల తోటకూర

Instructions

 • వేరుసెనగపప్పుని సన్నని సెగమీద కలుపుతూ వేపుకుని తీసి చల్లార్చండి
 • అదే మూకుడు లో ఎండుమిర్చి జీలకర్ర వేసి వేపి తీసుకోవాలి
 • వేపుకున్న పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, పుట్నాల పప్పు వేసి మెత్తని పొడి చేసుకోండి
 • మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, పసుపు, కరివేపాకు, వెల్లూలి వేసి వేపుకోవాలి
 • తరువాత ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాక మూత పెట్టి మగ్గించుకోవాలి
 • ఉల్లిపాయలు మగ్గాక తరిగిన తోటకూర ఉప్పు వేసి అడుగునుండి కలుపుతూ ఆకు మెత్తబడి పసరు వాసన పోయేదాకా మూతపెట్టి మగ్గించుకోవాలి
 • ఆకు మగ్గాక మూత తీసి చెమ్మ పోయి పొడి పొడిగా అయ్యేదాకా కలుపుతూ మోతపెట్టకుండా వేపుకోవాలి.
 • ఆకు పొడి పొడిగా అయ్యాక పల్లీలు, పుట్నాల పొడి వేసి హై ఫ్లేం మీద కలుపుతూ ఉంటె 2-3 నిమిషాలకి పొడిపొడిగా అవుతుంది అప్పుడు దిమ్పెసుకోండి.

Video

తోటకూర పొడి కూర| తోటకూర వేపుడు

ఈ పొడి కూర అందరికి తెలిసినదే అయినా నా రెసిపీ ప్రేత్యేకం. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఆకుకూరలు తినలేము, వొద్దు అనుకునే వారు కూడా ఇలా చేసి పెడితే తప్పక ఇష్టంగా తింటారు.
Course Main Course
Author Vismai Food

Ingredients

పొడి కోసం:

 • 1/4 cup వేరు సెనగపప్పు
 • 3 tsps వేపిన సెనగపప్పు పుట్నాల పప్పు
 • 8-10 ఎండుమిర్చి
 • 1 tsp జీలకర్ర

వేపుడు కోసం:

 • 1/4 tbsp నూనె
 • 1 cup ఆవాలు
 • 1 cup మినపప్పు
 • 4 దంచిన వెల్లూలి
 • 1/4 tsp పసుపు
 • 1 tsp ఉప్పు
 • 1 రెబ్బ కరివేపాకు
 • 1 ఉల్లిపాయ తరుగు
 • 2 పచ్చిమిర్చి తరుగు
 • 7 చిన్న కట్టల తోటకూర

Instructions

 • వేరుసెనగపప్పుని సన్నని సెగమీద కలుపుతూ వేపుకుని తీసి చల్లార్చండి
 • అదే మూకుడు లో ఎండుమిర్చి జీలకర్ర వేసి వేపి తీసుకోవాలి
 • వేపుకున్న పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, పుట్నాల పప్పు వేసి మెత్తని పొడి చేసుకోండి
 • మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, పసుపు, కరివేపాకు, వెల్లూలి వేసి వేపుకోవాలి
 • తరువాత ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాక మూత పెట్టి మగ్గించుకోవాలి
 • ఉల్లిపాయలు మగ్గాక తరిగిన తోటకూర ఉప్పు వేసి అడుగునుండి కలుపుతూ ఆకు మెత్తబడి పసరు వాసన పోయేదాకా మూతపెట్టి మగ్గించుకోవాలి
 • ఆకు మగ్గాక మూత తీసి చెమ్మ పోయి పొడి పొడిగా అయ్యేదాకా కలుపుతూ మోతపెట్టకుండా వేపుకోవాలి.
 • ఆకు పొడి పొడిగా అయ్యాక పల్లీలు, పుట్నాల పొడి వేసి హై ఫ్లేం మీద కలుపుతూ ఉంటె 2-3 నిమిషాలకి పొడిపొడిగా అవుతుంది అప్పుడు దిమ్పెసుకోండి.

Tips

కమ్మని పొడి కూరకి కొన్ని టిప్స్:
పొడి కూర లో వేసే పొడికి వేపే పల్లీలు లో- ఫ్లేం మీద వేపితే కమ్మని రుచి పొడికి
ఆకుకూర నేను తోటకూర వాడను, మీరు మరింకేదైనా ఆకుకూర వాడుకోవచ్చు. లేదా కలకూరగా అన్నీ కలిపి వాడుకోవచ్చు
నేను 7 చిన్న తోట కూర కట్టలు వాడను. ఆకుకూరతో పాటు కాడలు కూడా తరిగి వేసుకుంటే రుచిగా ఉంటాయి. తప్పక వాడండి
చేసుకున్న పొడి మీరు వాడే మిరపకాయాలని బట్టి ఘాటు, కారం ఉంటుంది. కాబట్టి కొద్దిగా తగ్గించి పొడి వేసి రుచి చూసి మిగిలిన పొడి వేసుకోండి
తోటకూర లో వెల్లూలి రుచి చాలా బాగుంటుంది. నచ్చని వారు వదిలేయండి
ఆకు పొడి పొడిగా రావాలంటే ఆకు మగ్గాక మూత తీసి కలుపుతూ వేపుకోవాలి చెమ్మ పోయేదాకా
పొడి వేసాక హై-ఫ్లేం మీద కలుపుతూ వేపుకుంటే పొడి పొడిగా వస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top