దాల్ పూరి. ఇది రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. ఇవి మాములుగా మనం తినే పూరీల కంటే చాలా రుచిగా ఉంటాయ్. ఇవి పిల్లల లంచ్ బాక్సులకి కూడా చాలా బాగా సరిపోతాయ్!

కావలసినవి:

సెనగపప్పు మసాలా కోసం:

 • సెనగపప్పు- ¼ కప్
 • కొత్తిమీర- 2 చెంచాలు
 • నిమ్మరసం- 1 tbsp
 • ఉప్పు
 • కారం- ½ చెంచా
 • పసుపు- ¼ చెంచా
 • గరం మసాలా- ½ tsp
 • ధనియాల పొడి- ½ tsp
 • వేయించిన జీలకర్ర పొడి- ½ tsp
 • నీళ్ళు- 1.5 కప్

పూరీల కోసం:

 • గోధుమ పిండి- 1 కప్
 • ఉప్పు- ½ tsp
 • నూనె- 2 tsps
 • నీళ్ళు తగినన్ని
 • నూనె – పూరీలని వేపడానికి

విధానం:

Directions

0/0 steps made
 1. అరగంట పైన నానబెట్టిన సెనగపప్పు కుక్కర్ లో వేసి అందులో పసుపు, ఓ చిటికెడు కారం వేసి తగినన్ని నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద 4 విసిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి.
 2. సెనగపప్పు పట్టుకుంటే ఎక్కడా పలుకులేకుండా కుక్ అయ్యాక మిగిలిన నీళ్ళు ఒంపేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేం మీద సెనగపప్పు లోని నీరు ఇగిరిపోయేదాక ఎనుపుకోండి
 3. ఇప్పుడు ఇందులో మసాలా కోసం ఉంచిన మిగిలిన సామానంతా వేసి మిశ్రమం బాగా పొడి పొడి గా అయ్యేదాకా కుక్ చేసుకోండి. దింపే ముందు కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి దిమ్పెసుకోండి
 4. ఇప్పుడు గోధుమపిండిలో ఉప్పు కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకుని అందులో కాసిని నీళ్ళు పోసి పిండి బాగా ఎక్కువ సేపు వత్తుకోండి. పిండి సాఫ్ట్ గా ఉండి తీరాలి. తరువాత తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు వదిలేయండి
 5. ఇప్పుడు పిండి ని చిన్న చిన్న బాల్స్ గా చేసుకొండి. తరువాత ఒక్కో బాల్ ని కాస్త పల్చా వత్తుకుని అందులో 1 tbsps సెనగపిండి మిశ్రమం పెట్టి అంచులని మడుస్తూ ఎక్కడా పగుళ్ళు లేకుండా సీల్ చేయండి
 6. తరువాత పీట మీద కాస్త నూనె రాసి స్టఫ్ఫ్ చేసుకున్న పిండి ముద్దలని ఉంచి నిదానంగా ముందు చేత్తో కాస్త స్ప్రెడ్ చేసుకోండి.
 7. ఆ తరువాత అప్పడాల కర్ర తో ఎక్కడా పగుళ్ళు రాకుండా నిదానంగా పూరీలు లా వత్తుకోండి
 8. ఇప్పుడు వేడి వేడి నూనె లో పూరీలు వేసి హై ఫ్లేం మీద ఎర్రగా వేపి తీసుకోండి
 9. ఇవి మామూలు పూరీల్లా పొంగవు. ఇవి మామూలు పూరి కూరలు, బంగాళా దుంపల కూరలతో కాకుండా, పెరుగు, ఆవకాయ తో చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్:

 • సెనగపిండి లో నీరు లేకుండా చూసుకోవాలి.
 • పిండి స్టఫ్ఫ్ చేసాక లేదా పూరీలు వత్తుకునేప్పుడు ఎక్కడా పగుళ్ళు రాకూడదు. పగుల్లోచ్చి పిండి బయటకి వస్తే నూనె లో వేయగానే స్తఫ్ఫింగ్ అంతా బయటకి వచ్చేస్తుంది.
 • నూనె బాగా వేడిగా లేకపోతే పూరీలు నూనె బాగా పీల్చేస్తాయ్