దాల్ మఖ్నీ…ఇది వరల్డ్ ఫేమస్ పంజాబీ రెసిపీ. ఫారినర్స్కి ఎంతో ఇష్టమైన రెసిపీ. ఇది చాల రిచ్ గా క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్ డేస్ లో చేసి చుడండి పర్ఫెక్ట్ రెస్టారంట్ టెస్ట్ వస్తుంది. ఈ రెసిపీ పర్ఫెక్ట్ కొలతలతో టిప్స్ తో ఉంచాను.

కావలసినవి:

 • మినుములు- 3/4 కప్
 • రజ్మా- ¼ కప్
 • పచ్చి సెనగపప్పు- ¼ కప్
 • టమాటో పేస్టు- 300 gms
 • అల్లం –వెల్లూలి పేస్టు- 2 tbsps
 • కాశ్మీరీ చిల్లి పౌడర్- 3 tbsps
 • సాల్ట్
 • కసురీ మేథీ- 1 tsp
 • ఫ్రెష్ క్రీం- 1 tbsp
 • బటర్- ¼ కప్
 • నెయ్యి- 1/౩ కప్
 • నల్ల యాలక- 1
 • యలకలు- 4
 • బిరియానీ ఆకు- 1
 • దాల్చిన చెక్క- 1 ఇంచ్
 • నీళ్ళు- 1.5 లీటర్స్

విధానం:

Directions

0/0 steps made
 1. మినుములు, రాజ్మా, సెనగపప్పు ని కలిపి బాగా కడిగి రాత్రంతా నానబెట్టండి, లేదా కనీసం 12 గంటలు నానాలి.
 2. రాత్రంతా నానినా పప్పులని కుక్కర్ లో వేసి అందులో అల్లం వెల్లులి పేస్టు, దాల్చిన చెక్క, నల్ల యాలక, యలకలు, 2 tbsps కాశ్మీరీ కారం, ఉప్పు వేసి 750 ml నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద 5 విసిల్స్ రానివ్వండి.
 3. విసిల్స్ 5-6 అని కాకుండా పప్పు మెత్తగా ఉడకాలి వెన్నలా.
 4. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న పాన్ లో బటర్ నెయ్యి వేసి కరిగించి అల్లం వెల్లులి పేస్టు 1- tsp వేసి బాగా ఫ్రై చేసుకోండి.
 5. ఇప్పుడు కారం వేసి బాగా ఫ్రై చేసి సాల్ట్ వేసి కలిపి టమాటో పేస్టు వేసి బాగా కలిపి తోమతోల్లోంచి నీరు ఇగిరిపోయి ముద్దగా అవ్వాలి అందాకా ఫ్రై చేసుకోండి.
 6. ఉడికిన్చుకున్న పప్పు వేసి బాగా కలిపి 3 నిమిషాలు కుక్ చేసుకోండి
 7. ఇప్పుడు 750 ml నీళ్ళు పోసి బాగా కలిపి, నలిపిన కసురీ మేతి వేసి బాగా కలిపి లో- ఫ్లేం మీద 30 నిమిషాలు ఉడికించుకోవాలి
 8. కూర ఉడుకుపట్టాక పైన నురగ వస్తుంది దాన్ని తీసేయండి
 9. 30 నిమిషాల తరువాత 2 tbsps నెయ్యి వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికిన్చుకుని దిమ్పెసుకోండి
 10. సర్వ్ చేసే ముందు 1 tbsp ఫ్రెష్ క్రీం వేసి సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • పప్పులు ఎంత బాగా నాని ఎంత నిదానంగా ఉడికితే అంత రుచి ఈ కూర కి
 • ఈ కాశ్మీరీ కారం వాడాలి ఎందుకంటె ఈ కారం మాంచి కలర్ ఫ్లేవర్ ఇస్తుంది, కరం తక్కువగా ఉంటుంది, దొరకనట్లైతే మాములు కారమే వాడుకోండి. కాని, తగ్గించి వాడుకోండి.
 • రేస్తారంత్స్ లో టమాటో ప్యురీ వాడతారు దానికి టమాటోలని ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి ఆ గుజ్జుని వాడతారు. మీకు నచ్చితే అలా వాడుకోవచ్చు, లేదా టమాటోలని పేస్టు చేసి కూడా వాడుకోవచ్చు. కాని ఉడికించిన టొమాటోల పేస్టు వాడితేనే ఎక్కువ రుచి.
 • దీని ఎంత నెయ్యి బటర్ ఉంటె అంత రుచి.