దొండకాయ మెంతి కారం ఇది చేసిన రోజున కచ్చితంగా తృప్తిగా భోజనం చేస్తారు! రోజు చేసుకునే దొండకాయ కూరనే ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం తో చాలా రుచిగా ఉంటుంది.

కావలసినవి:

 • దొండకాయ చీలికలు- ½ కిలో
 • వేరు సెనగపప్పు- 3 tbsps
 • నువ్వులు- 2 tsps
 • సెనగపప్పు- 2 tsps
 • మినపప్పు- 1 tsp
 • ఎండు మిర్చి- 6-7
 • జీలకర్ర- 1 tsp
 • మెంతులు- 1 tsp
 • ధనియాలు- 2 tsps
 • చింతపండు- గోలి సైజు
 • ఉప్పు
 • పసుపు- ½ tsp
 • ఓ రెబ్బ కరివేపాకు
 • నూనె

విధానం:

Directions

0/0 steps made
 1. మూకుడులో ముందు పల్లీలు మెంతులు వేసి లో-ఫ్లేం మీద మెంతులు మాంచి సువాసనోచ్చేదాక వేపుకోండి.
 2. ఇప్పుడు నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, సెనగపప్పు,జీలకర్ర వేసి నువ్వులు చిటపటమనేదాకా రోస్ట్ చేసుకోండి.
 3. ఇప్పుడు ఈ పప్పులని చల్లర్చుకుని మిక్సీ లో వేసుకోండి, ఇందులోనే చింతపండు కూడా వేసి మెత్తని పొడి చేసుకోండి.
 4. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటమనిపించి లేత దొండకాయ చీలికలు, ఉప్పు, పసుపు వేసి హై ఫ్లేం మీద 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి.
 5. 4 నిమిషాల తరువాత మూత పెట్టి మధ్య మధ్య లో కలుపుతూ కూరని బాగా వేపుకోండి.
 6. ముఉకలోని నీరంతా ఇగిరిపోయి క్రిస్ప్ అయ్యాక అప్పుడు పొడి వేసి బాగా కలిపి మరో 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి.
 7. దింపే ముందు కరివేపాకు చల్లుకుని దిమ్పెసుకోండి.
 8. /li>

టిప్స్:

 • లేత దొండకాయలైతే చాలా రుచిగా ఉంటుంది కూర.
 • పప్పులని లో ఫ్లేం మీద మాత్రమే ఫ్రై చేసుకోండి.
 • ఇదే పొడి తో మీరు వంకాయ, బంగాళాదుంప ఫ్రై కూడా చేసుకోవచ్చు.