“దోసకాయ కాల్చిన పచ్చడి” ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన వంటకం. ఎంత బాగుంటుందో ఈ పచ్చడి. వేడి వేడి అన్నం లో నెయ్యేసుకుని తింటే! దోసకాయ పచ్చడి లోనే ఎన్నో రకాలు చేస్తారు, కొన్ని కాయకూరలు కలుపుతూ. ఇది కాల్చిన దోసకాయ పచ్చడి. ఘుమఘుమలాడిపోతూ భలేగా ఉంటుంది. ఇది ఇడ్లి అట్టు, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది.

కావలసినవి:

 • ఓ పెద్ద దోసకాయ
 • పచ్చిమిర్చి-10-12
 • కొత్తిమీర- పిడికెడు
 • ఆవాలు- 1 tsp
 • చింతపండు- గోలీ సైజు
 • సాల్ట్
 • మెంతులు- 1 tsp
 • పొట్టు మినపప్పు- 1 tsp
 • జీలకర్ర- 1 tsp
 • నూనె- 2 tsps

విధానం:

Directions

0/0 steps made
 1. దోసకాయకి నూనె పట్టించి పొయ్యి మీద స్టాండ్ పెట్టి అన్నీ వైపులా నల్లగా కాలేట్లు కాల్చుకోండి మీడియం-ఫ్లేం మీద.
 2. ఇది సరిగ్గా కాలడానికి 15 నిమషాల టైం పడుతుంది
 3. ఇది బాగా కాలాక దింపి పైన చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి.
 4. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో మెంతులు, ఆవాలు వేసి ఆవాలు చిటపటమనిపించండి. మెంతులు మాంచి సువాసన రావాలి.
 5. ఇప్పుడు పొట్టు మినపప్పు, జీలకర్ర వేసి కాస్త వేపుకుని స్టవ్ ఆపేసి చింతపండు, పచ్చిమిర్చి వేసి కలిపి తాలిమ్పుని చలారనివ్వండి.
 6. తాలింపు చల్లారాక దోసకాయ ముక్కలు, కొత్తిమీర, సాల్ట్, తాలింపు వేసి మెత్తని పేస్టు చేసుకోండి.
 7. ఇది వేడివేడి అన్నం లో నెయ్యి తో చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్:

 • దోసకాయ ముక్కలు కోసే ముందు చేదు తప్పక చూస్కోండి.
 • పొట్టు మినపప్పు మాంచి ఫ్లేవర్ ఇస్తుంది పచ్చడికి. లేనట్లైతే మామూలు మినపప్పు వాడుకోవచ్చు
 • పచ్చిమిర్చి వేపకండి. అలా పచ్చిగా ఉంటేనే ఈ పచ్చడికి రుచి. ఏదో కాస్త మగ్గాలని స్టవ్ ఆపేసి తాలింపు లో ఉంచాము