పులిబొంగరాలు ఇవి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో చాలా ఫేమస్. ఇవి మీరు నెల్లూరు లో ఏ అంగడి దగ్గరికి వెళ్ళినా ఇవి దొరుకుతాయ్. దీనిలోకి ఎర్రకారం పర్ఫెక్ట్ కాంబినేషన్. సాయంత్రాలు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇవి తింటుంటే ఆ మజానే వేరు.

కావలసినవి:

 • పులిసిన అట్ల పిండి- 2 కప్స్
 • ఉల్లిపాయ తరుగు- ఓ మీడియం సైజు ఉల్లిపాయది
 • కరివేపాకు- 1 రెబ్బ
 • పచ్చిమిర్చి -2 తరుగు
 • జీలకర్ర- 1 tsp
 • ఉప్పు

విధానం:

Directions

0/0 steps made
 1. పులిసిన అట్ల పిండి కాస్త గట్టిగా ఉండాలి అలాంటి పిండి లో మిగిలిన సామంతా వేసి బాగా కలుపుకోండి
 2. ఇప్పుడు వేడి వేడి నూనె లో పునుకుల మాదిరి వేసుకుని మీడియం ఫ్లేం మీద ఎర్రగా క్రిస్పీగా వేపుకోండి.

టిప్స్:

 • దీనికి పిండి పులిస్తేనే రుచి, ఇడ్లి పిండి దీనికి పనికిరాదు.
 • పిండి ఇడ్లి పిండి అంత గట్టిగా ఉండాలి
 • బండ్ల మీద వారు ½ కప్ మైదా కూడా కలుపుతారు, నచ్చితే కలుపుకోండి.