ఆలూ సమోసా అంటే అందరికీ ఇష్టమే! మాంచి ఈవెనింగ్ స్నాక్. సమోసా పర్ఫెక్ట్ గా చేయాలేగాని దానితోనే కడుపు నిమ్పేసుకోవచ్చు అంత బావుంటాయీ. పిల్లలు కూడా చాల ఇష్టంగా తింటారు. కొన్ని పద్ధతులు, టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ ఆలూ సమోసా రెడీ. ఎప్పుడు చేసినా మీరు ఇదే కోలతలు పాటిస్తూ చేయండి పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది.

కావలసినవి:

 • మైదా- 1 కప్
 • నెయ్యి/ డాల్డా- 1/4 కప్
 • సాల్ట్
 • వాము- 1/4 చెంచా

ఆలూ ఫిల్లింగ్ కోసం:

 • నూనె- 3tbsps
 • జీల కర్ర- 1 tsp
 • నలిపిన ధనియాలు – 1 tsp
 • పచ్చిమిర్చి- 1
 • ఉల్లిపాయ తరుగు- 2 tsps
 • అల్లం వెల్లులి పేస్టు- 1 tsp
 • జీడిపప్పు- 7-8
 • ధనియాలపొడి- 1/2 చెంచా
 • చాట్ మసాలా- 1/2 చెంచా
 • కారం- 1/2 tsp
 • వేయించిన జీలకర్ర పొడి- 1/2 tsp
 • పసుపు- 1/4 tsp
 • గరం మసాలా- 1/2 tsp
 • ఉడికిన్చుకున్న బంగాళా దుంపలు- 200 gms
 • నిమ్మ రసం- 1/2 చెక్క
 • కొత్తిమీర తరుగు- 2 tsps
 • నూనె సమోసాలు వేయించడానికి సరిపడా

విధానం:

 1. ముందుగా మైదా పిండి లో కరిగించిన నెయ్యి, ఉప్పు , వాము వేసి బాగా కలుపుకుని బ్రెడ్ పొడి లా చేసుకోండి.
 2. ఆ తరువాత చాలా కొద్దిగా నీళ్ళు పోసుకుని పిండి ఎంత గట్టిగా వత్తుకోగలిగితే అంత గట్టిగా బాగా 4-5 నిమిషాల పాటు వత్తుకోండి.
 3. తరువాత పెద్ద నిమ్మకాయంత సైజు బాల్స్ గా చేసుకుని తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు నానబెట్టుకోండి.

ఆలూ స్టఫ్ఫింగ్ కోసం:

 1. 3 చెంచాల నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి 2-3 నిమిషాలు వేపుకోండి.
 2. తరువాత అల్లం వెల్లూలి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి.
 3. తరువాత జీడిపప్పు వేసి 2-3 నిమిషాలు వేయించుకోండి.
 4. ఇప్పుడు ఉప్పు, పసుపు, చాట్ మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేయించుకోండి.
 5. ఇప్పుడు మెత్తగా ఉదికిన్చుకుని పూర్తిగా చాల్లర్చుకుని చిదుముకున్న ఆలూ ముక్కలు మాత్రమే వేసి మసాలా బాగా పట్టించండి.
 6. దింపే ముందు నిమ్మ రసం, కొత్తిమీర చల్లుకుని దింపెసుకోండి. పూర్తిగా చల్లార్చుకోండి.

సమోసాల కోసం:

Directions

0/0 steps made
 1. ముందుగా పిండి ముద్దని కాస్త మందంగా పొడవుగా వత్తుకోండి, తరువాత మధ్యకు కట్ చేసుకోండి.
 2. ఇప్పుడు కట్ చేసుకున్న పిండి షీట్ ని అర చేతిలోకి తీస్కుని ఓ పక్క నుండి మధ్యకి మడిచి రెండవ అంచుతో కలిపి అంచుని సీల్ చేయండి, మిగిలిన షీట్ ని నెమ్మదిగా వత్తితే అంటుకుంటుంది. ఇది ఓ కోన్ లా తయారవుతుంది.
 3. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఆలూ మిక్స్ ని స్టఫ్ చేసి మిగిలిన అంచులని నీళ్ళతో తడి చేసి ఓ మడత వేసి సీల్ చేయండి.
 4. ఇప్పుడు ఆలూ స్టఫ్ఫ్ ని చేత్తో కాస్త సర్దండి అంటే సమోసా ప్లేట్ లో పెడితే కూర్చోవాలి అలా అడ్జస్ట్ చేయండి.
 5. ఇలా తయారు చేసుకున్న సమోసలని గాలికి 15 నిమిషాలు వదిలేయండి. దీని వల్ల లోపల చెమ్మ ఏదైనా ఉంటె పీల్చేస్తుంది.
 6. ఇప్పుడు సమోసాలు మునిగేల నూనె పోసుకుని నూనె బాగా వేడెక్కాక వెంటనే మంట ఆపేసి సమోసాలు 2-3 వేసి అలా వదిలేయండి. 30 సెకన్ల తరువాత అవి పైకి తేల్తాయీ, అప్పుడు మంట లో-ఫ్లేం లో పెట్టి 12-15 నిమిషాల పాటు క్రిస్పిగా అయ్యేదాకా వేపుకోండి. ఇవి లైట్ గోల్డన్ కలర్లోకి రాగానే తీసెయ్యండి. మిగిలిన మంచి కలర్ చల్లరేలోగా వస్తాయి.
 7. అంతే పర్ఫెక్ట్ పంజాబీ సమోసా రెడీ. మీకు ఏ మాత్రం డౌట్ ఉన్న పైనున్న వీడియో చుడండి.

టిప్స్:

 • స్వీట్ షాప్స్ లో అయితే నెయ్యికి బదులు డాల్డానే వాడతారు దాని వల్లే బాగా గుల్లగా వస్తాయి. మీకు నచ్చితే అది కూడా వాడుకోవచ్చు.
 • పిండి ని ఎంత తక్కువ నీళ్ళు పోసి ఎంత గట్టిగా వత్తుకుంటే అంత బాగా క్రిస్పీ గా వస్తాయి సమోసాలు.
 • ఆలూ ని మెత్తగా ఉడుకించి చెక్కు తీసి 15 నిఇమిషాలు పొడి గుడ్డ మీద వేసి గాలికి ఆరనిస్తే అప్పుడు ఆలూ లోని చెమ్మంత పోతుంది. సమోసాలు మెత్తబడవు త్వరగా.
 • వేపడానికి ముందు సమోసాలు 15 నిమిషాలు గాలికి ఆరనివ్వాలి అప్పుడు చెమ్మంత ఆరిపోతుంది.
 • సమోసాలు 2-3 అంత కంటే వేయకండి బాండీ లో. ఎక్కువైనా వేగడానికి టైం పడుతుంది.
 • సమోసాలు ఎంత సేపైనా లో ఫ్లేం మీద వేపితేనే క్రిస్పీగా వేగుతాయీ.