ఈ మామిడికాయ మిరపకాయ తొక్కు పచ్చడి కారాన్ని ఇష్టపడే వారు చాలా ఎంజాయ్ చేస్తారు. వేడి వేడి నెయ్యన్నం, చపాతీ, అట్టు ఇడ్లీ వీటిల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడి కనీసం వారం పాటు నిలవుంటుంది. ఎక్కువ పదార్ధాలు కూడా అవసరం కూడా లేదు. అన్నీ ప్రతీ ఇంట్లో ఉండేవే. ఓ సారి పచ్చడి చేసి ఫ్రిజ్ లో ఉంచేస్తే వారం పైన నిలవుంటుంది. ఎప్పుడంటే అప్పుడు పచ్చడి రెడి.

ఈ పచ్చడి లో నేను వెల్లూలి వాడలేదు, నచ్చితే వేసుకోవచ్చు. అలాగే ఆఖరున జీలకర్ర, కరివేపాకు, వెల్లూలి తాలింపు పెట్టుకోవచ్చు.

ఇవి కూడా ట్రై చేయండి:

బీరకాయ తొక్కు పచ్చడి
పచ్చిమామిడి కాయ పచ్చడి
అరటి దూట పెరుగు పచ్చడి
మునక్కాయ పచ్చడి
దోసావకాయ
పుదీనా కారం పొడి

కావలసినవి:

 • పుల్లని పచ్చి మామిడికాయ- పెద్దది(లేదా రెండు టెన్నిస్ బంతుల సైజు ఉన్నది)
 • ఎండు మిర్చి- 12-15
 • మెంతులు- 1 tsp
 • ఆవాలు- 1 tbsp
 • ఇంగువ – చిటికెడు
 • పసుపు- చిటికెడు
 • ఉప్పు- 1.1/4 tsps
 • నూనె- 1.5 tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి ఎర్రగా వేపుకుని ఆవాలు వేసుకోండి.
 2. ఆవాలు చిటపటమన్నాక ఎండుమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేపుకోవాలి.
 3. వేపుకున్న వీటిని మిక్సీ లో వేసుకోండి.
 4. అదే మిక్సీ జార్ లో ఇంగువా, పసుపు, ఉప్పు వేసి నీళ్ళు వేయకుండా మెత్తని పొడి చేయండి.
 5. చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకున్న మామిడి ముక్కలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి.
 6. నచ్చితే మరో 2 tsps నూనె వేడి చేసి వెల్లూలి, జీలకర్ర, కరివేపాకు తాలింపు పెట్టుకోండి.

టిప్స్:

 • మామిడికాయ పులుపుని బట్టి మిరపకాయలు, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి.