“పనీర్ పాప్ కార్న్” తక్కువ టైం లో అయిపోయే బెస్ట్ స్నాక్! తిన్న కొద్దీ తింటూనే ఉంటారు. బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా అందరికి నచ్చేలా ఉంటాయ్.

ఏదైనా స్పెషల్ రోజుల్లో, పార్టీస్ కి తక్కువ టైం లో చేసుకునే బెస్ట్ స్టార్టర్! ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది ఈ రెసిపీ.

ఈ రెసిపీ kfc స్టైల్ చికెన్ పాప్ కార్న్ ని చూసి కొద్ది మార్పులతో మా స్టైల్ లో చేసిన పాప్ కార్న్.

ఈ పాప్ కార్న్ వేపే విషయం లో చాలా మంది  నూనెలో వేయగానే కోటింగ్ ఊడిపోతుంది అని కంప్లైంట్ చేస్తుంటారు. అదంతా కూడా పిండి జారైతే జరిగే పొరపాటు. అందుకే పిండి మరీ చిక్కగా మరీ లూస్ కాకుండా చూసుకోండి.

పిండి పైన కోటింగ్ కి నేను బ్రెడ్ పొడి వాడను. సహజంగా నేను బ్రెడ్ పొడి వాడడానికి ఇష్టపడను. ఇంట్లో మనం పాత బ్రెడ్ ని పొడి చేసి వాడుకున్న పాప కార్న్ కి రెడీ మేడ్ గా దొరికే Panko బ్రెడ్ పొడి కి చాలా తేడా ఉంటుంది. రుచి లోను రూపం లోను. కుదిరితే Panko వాడడానికే చుడండి.   లేదంటే పాత మిల్క్ బ్రెడ్ ని ఎండలో 3 గంటలు ఉంచితే చెమ్మ ఆరిపోయి అట్ట ముక్కలా అవుతుంది, దాని పొడి చేసి వాడుకోండి.

అలాగే ఇందులో నేను చిల్లి ఫ్లేక్స్ వాడను ఇవి రెడీ మేడ్ గా దొరుకుతాయ్, ఒకవేళ లేనట్లైతే 2 ఎండు మిర్చి పొయ్యి మీద 15 సెకన్లు కాల్చి  కచ్చాపచ్చా గా  దంచినది వాడుకోవచ్చు.

ఇంకా ఇందులో నేను మిక్స్డ్ హెర్బ్స్ వాడను, ఇవి ఇటాలియన్ హెర్బ్స్. సహజంగా ఇవి మనకి పిజ్జా తో పాటు ఇస్తారు. చాలా సులభంగా ఆన్లైన్ లో దొరికేస్తాయ్!

బ్రెడ్ పొడి పట్టించాక 10 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచితే ఒకవేళ పిండి జారై కోటింగ్ సరిగా పట్టుకోకపోయినా ఫ్రిజ్ లో ఉంచితే కచ్చితంగా పట్టుకుంటుంది.

వేడెక్కిన నూనె లో మీడియం ఫ్లేం మీద కరకరలాడేట్టు బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి టమాటో సాస్, మయోనైస్ తో చాలా బాగుంటాయ్.

ఇవి కూడా ట్రై చేయండి:

పాలక్ పనీర్
పనీర్ బటర్ మసాలా
పనీర్ తయారి విధానం
కాజు పులావు
హైదరాబాదీ వెజ్ ధం బిరియాని
గోంగూర పులావ్
రసమలై
కొబ్బరి పాయసం

కావలసినవి:

 • పనీర్- 250 gms
 • నూనె వేపుకోడానికి
 • కోటింగ్ కోసం:

  • మైదా- 1/4 కప్
  • ఉప్పు- రుచికి సరిపడా
  • చిల్లి ఫ్లేక్స్- 1 tsp
  • మిక్స్డ్ హెర్బ్స్- 1 tsp
  • తగినన్ని నీళ్ళు
  • బ్రెడ్ పొడి- 1 కప్

విధానం:

Directions

0/0 steps made
 1. కోటింగ్ కోసం ఉంచుకున్న పదార్ధాలన్నీ వేసి పిండిని కాస్త జారుగా కలుపుకోవాలి
 2. పనీర్ ముక్కలు వేసి కోటింగ్ బాగా పట్టించాలి
 3. తరువాత ఒక్కో పనీర్ ముక్క తీసి బ్రెడ్ పొడి లో బాగా రోల్ చేయండి. బ్రెడ్ పొడి లో ఒకటికి రెండు సార్లు రోల్ చేసి బాగా  పట్టించండి
 4. ఇలా అన్నీ కోట్ చేసుకున్నకా 10 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచండి
 5. 10 నిమిషాల తరువాత వేడి వేడి నూనె లో మంట పూర్తిగా తగ్గించి పనీర్ ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా వేపుకుని తీసుకోండి

టిప్స్:

 • హై ఫ్లేం మీద వేపితే పనీర్ త్వరగా నల్లగా అయిపోతాయ్.