“పప్పుచారు” ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన వంటకం. సరిగ్గా పెట్టలేగాని గ్లాసులతో తాగేయోచ్చు. చాలా సింపుల్ రెసిపీ. సాంబార్ కి మల్లె ఎక్కువెక్కువ సంబారాలు ఇందులో ఉండవు. వేసేవి నాలుగైదు పదార్దాలే కాని రుచి చాలా బాగుంటుంది.

పప్పుచారు ప్రతీ ఇంట్లో చేసేదే, ప్రతే ఒక్కరికి నచ్చేదే! కానీ కాచే తీరు, పదార్ధాలు వేసే కొలతలోనే ఉంది రుచంతా. ఇది పూర్తిగా మా స్టైల్ పప్పు చారు. మేము ఇందులో ములక్కాడ ముక్కలు, ధనియాల పొడి కూడా వేస్తాము. దీని వల్ల పప్పుచారుకి రుచి సువాసన.

ఆఖరున బెల్లం వేస్తే ఫ్లేవర్స్ అన్నీ బాలన్స్ అవుతాయ్. నచ్చని వారు వదిలేయోచ్చు. ఇంకా పప్పుని పప్పు గుత్తితో ఎనిపే కంటే మిస్కీ లో మెత్తగా చేసి వేస్తే చిక్కని పప్పుచారు వస్తుంది.

సాధారణంగా పులుసులకి కొలతలేకుండా నీళ్ళు పోసి మరిగించోచ్చు. కానీ ఈ కొలతకి మాత్రం కచ్చితంగా 300ml కి మించి నీరు పోయకండి. అప్పుడే చిక్కని రుచి కరమైన పప్పుచారుని ఎంజాయ్ చేస్తారు. లేదంటే జారుగా అంత రుచిగా ఉండదు.

ఈ పప్పుచారు నేను రాచిప్ప లో కాస్తున్నా. రచిప్పలో కాచిన పప్పుచారుకి మామూలు గిన్నెలో కాచిన పప్పుచారు రుచికి ఎక్కడా పొంతనే ఉండదు. రాచిప్పలో పులుసులు ఎంత మరిగితే అంత రుచి! వండిన పదార్ధాలు కనీసం 4-5 గంటలు వెచ్చగా ఉంటాయి. పదార్ధాలు త్వరగా చెడిపోవు.

రాచిప్పలు లేని వారు మామూలు పాత్రల్లోనే చేసుకోవచ్చు.

ఇవి కూడా ట్రై చేయండి:

ప్రసాదం పులిహోర
బంగాళాదుంప పిడుపు/ఆలూ ఫ్రై
గోంగూర పనీర్
యఖ్ని పులావు
చికెన్ 65

కావలసినవి:

 • కందిపప్పు- 1/2 కప్
 • నీళ్ళు- 2 కప్స్
 • పసుపు- 1/2 tsp

పప్పుచారు కి:

 • నూనె- 2 tbsps
 • ఆవాలు- 1 tsp
 • జీలకర్ర- 1 tsp
 • సెనగపప్పు- 1 tsp
 • ఇంగువా -చిటికెడు
 • ఎండుమిర్చి- 2
 • పచ్చిమిర్చి-3
 • ఉల్లిపాయ చీలికలు- 1 కప్
 • కరివేపాకు- 1 రెబ్బ
 • పీచు తీసిన మునక్కాడ ముక్కలు- 6-7
 • 2 టమాటో ముక్కలు
 • కొత్తిమీర- పిడికెడు
 • నీళ్ళు- 300 ml
 • బెల్లం పొడి- 1 tbsp
 • ఉప్పు
 • కారం- 1 tsp
 • ధనియాల పొడి- 1 tsp
 • 50 గ్రాముల నుండి తీసిన 100ml చింతపండు పులుసు

విధానం:

Directions

0/0 steps made
 1. 2 గంటలు కడిగి నానబెట్టిన కందిపప్పుని కుక్కర్ లో వేసి  2 కప్స్ నీళ్ళు, పసుపు వేసి మీడియం ఫ్లేం మీద 3 విసిల్స్ రానివ్వండి
 2. ఆవిరి పోయాక పప్పు మిక్సీలో వేసి మెత్తని పేస్టు చేసుకోండి
 3. రాచ్చిప్పలో/అడుగుమందంగా ఉన్న పాత్రలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, సెనగపప్పు వేసి వేపుకోవాలి
 4. ఉల్లిపాయ, మునక్కాడ, పచ్చిమిర్చి చీలికలు వేసి మూతపెట్టి ఉల్లిపాయలు, మునక్కాడ ముక్కలు మెత్తబడేదాక మీడియం ఫ్లేం మీద మూత పెట్టి మగ్గనివ్వండి
 5. ముక్కలు మగ్గాక టమాటో ముక్కలు ఉప్పు, కారం, ధనియాల పొడి చేర్చి టమాటో ముక్కలు కూడా మెత్తబడనివ్వాలి మూతపెట్టి
 6. ఆ తరువాత 100ml చింతపండు పులుసు పోసి మరో 3 నిమిషాలు మరగనివ్వండి
 7. పులుసు మరిగాక మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పు, 300ml నీళ్ళు  పోసి బాగా కలిపి సన్నని సెగ మీద 10-12 నిమిషాలు మరగనివ్వండి
 8. పప్పుచారు మరుగుతున్నప్పుడు కొత్తిమీర తరుగు, బెల్లం తరుగు మరో 5 నిమిషాలు ఉడికించి దిమ్పెసుకోండి

టిప్స్:

 • ఈ పప్పు చారు అప్పడాలు, వడియాలు, ఆమ్లెట్, చికెన్ ఫ్రై తో చాలా రుచిగా ఉంటుంది