ముద్దపప్పు ఇది ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం. పసిపాప కి గోరుముద్దలతో మొదలవుతుంది ఈ ముద్ద పప్పు. ఇక ఆ తరువాత ఆవకాయ తో కలిపి తినడం మొదలెట్టాక మరిచిపోతారా ఆ రుచిని. అలాంటి ముద్దపప్పు కూడా చేయాలే కాని ఎంతో కమ్మగా తిన్నకొద్ది తినాలనిపించేలా చేయొచ్చు. ఈ తీరు లో పప్పు చేస్తే సహజంగా నిదానంగా అరిగి వతఃమ్ చేసే గుణమా మున్న పప్పు త్వరగా అరిగి మేలు చేస్తుంది. ఇది మీరు ఆవకాయ తోనే కాదు పులుసులతో, దప్పళంతో ఇలా దేనితో నంజుకు తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

కావలసినవి:

 • కందిపప్పు- ½ కప్
 • పసుపు- ¼ చెంచా
 • నీళ్ళు- 2 కప్స్
 • ఉప్పు
 • నెయ్యి- 2 tsps
 • జీలకర్ర- ½ tsp
 • ఇంగువ- రెండు చిటికెళ్ళు

విధానం:

Directions

0/0 steps made
 1. కందిపప్పు ని సన్నటి సెగ మీద మాంచి సువాసనోచ్చేదాక వేపుకోవాలి. మాచి సువాసన రాగానే దింపి కడిగి కుక్క ర్లో వేసుకోండి
 2. కందిపప్పు లో పసుపు, నీళ్ళు పోసి కేవలం మీడియం ఫ్లేం మీద 7-8 విసిల్స్ రానివ్వండి
 3. పప్పు ఉడికాక అందులో ఉప్పు వేసి మెత్తగా వెన్నలా ఎనుపుకోండి, మిక్సీ కూడా వేసుకోవచ్చు
 4. ఇప్పుడ నెయ్యి కరిగించి అందులో ఇంగువా జీలకర్ర వేపి పప్పు కలిపేసుకోండి.

టిప్స్:

 • పప్పు ని లో-ఫ్లేం మీద వేపితేనే మాంచి సువాసనోస్తుంది.
 • పప్పు వేపడం వల్ల ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేం మీద ఉదికిస్తేనే మెత్తగా ఉడుకుతుంది