పాకం పూరీలు

google ads

పాకం పూరీలు

Author Vismai Food
Prep Time 10 minutes
Cuisine Andhra
PAAKAM-PURI
పాకం పూరీలు ఇవి ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం…ఇవి చేయడం ఎంతో సులభం. ఇవి కనీసం 10 రోజుల పైన నిలవుంటాయ్. మా యింట్లో స్వీట్ తినాలనిపించినా, లేదా పూరీలు చేసే రోజు మరి కొంచెం పిండి ఎక్కువ కలిపి కూడా ఇవి చేస్తుంటాం.
పూరీలు మిగిలినిపోయిన మరో పద్ధతిలో ఇవి చేస్తుంటాం. పాలు దగ్గరగా కాచి ఈ పాకం పూరీలు వేసి కూడా తింటుంటాం. మొత్తానికి చాల ఎక్కువగా చేస్తూనే ఉంటాం. ఇవి చాలా బాగుంటాయ్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయ్.
ఇవి ఆంధ్రా అంతటా ఉన్నా, గోదావరి జిలాల్లో ఎక్కువగా చేయడం నేను చూసాను.ఇవి మామూలు పూరిలా లాగే చేస్తారు కాని చిన్న మర్పులున్నాయ్ అంతే. అసలు వంట చేయడం ఇప్పుడే మొదలెట్టిన వాళ్ళు కూడా ఈజీ గా చేసేయొచ్చు ఈ రెసిపీ.

Tips

మైదా కి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు
పూరిలని పల్చగా వత్తుకుంటే క్రిస్పీ గా వస్తాయ్, అల కావాలనుకుంటే ఇదే విధంగా చేసుకోవచ్చు. అవీ కూడా బాగుంటాయ్
ఈ పూరిలను ఇదే కొలతలతో బెల్లం పాకం తో కూడా చేసుకోవచ్చు, అవీ చాలా బాగుంటాయ్
పాకం ముదురుదైతే పూరీలు కనీస 10 రోజులు నిలవుంటాయ్
ఇవి మిగిలినిపోయిన పూరిలతో చేసుకోదలిస్తే పాకం లో వేసి పూరిలను ఓ నిమిషం మరగనిచ్చి దిమ్పెసుకోండి, అప్పుడు పూరీలు పాకాన్ని పీలుస్తాయ్

Ingredients

 • 250 gms మైదా/ గోధుమ పిండి
 • ¼ tbsp ఉప్పు
 • 3 tbsp నెయ్యి

పాకానికి:

 • 500 gms పంచదార
 • 1 tbsp యలకల పొడి-
 • 150 ml నీళ్ళు

Instructions

 • ముందుగా పిండి లో ఉప్పు నెయ్యి వేసి బాగా కలుపుకొండి. ఆ తరువాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి మెత్తగా వత్తుకోండి
 • బాగా వత్తుకున్నాక 30 నిమిషాలు తడి గుడ్డ కప్పి పక్కనుంచుకోండి
 • ఇప్పుడు పాకం కోసం పంచదార లో నీళ్ళు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోండి
 • ఓ తీగ పాకం రాగానే యాలకల పొడి వేసి కలుపుకుని పక్కనుంచుకోండి
 • ఇప్పుడు పిండి ని నిమ్మకాయంత బాల్స్ గా చేసుకుని పల్చగా గుండ్రంగా వత్తుకోండి
 • ఆ తరువాత పూరి పైన నెయ్యి రాసి మధ్యకి మడిచి, మళ్ళీ మధ్యకి మరో మడత వేయండి
 • ఇప్పుడు కాస్త మందంగా వత్తుకోండి, పల్చగా వత్తుకున్నా ఈ రెసిపీ బాగుంటుంది, కాని అవి క్రిస్పీ గా వస్తాయ్.
 • మందంగా వత్తుకుంటే పూరీలు పొంగి జ్యుసీ గా ఉంటాయ్
 • ఇప్పుడు వేడి వేడి నూనె లో వేసి పూరీలు పొంగనిచ్చి, వెంటనే వేడి పాకం లో వేసి 30 సెకన్లు ఉంచి తీసెయ్యండి
 • వేడి వేడిగా జ్యుసీగా చాలా బాగుంటాయ్. చల్లారాక కూడా పూరిల పైన పంచదార పాకం ఏర్పడి అవీ రుచిగా ఉంటాయ్
 • ఇవి డబ్బాలో దాచుకుంటే కనీసం వారం పాటు నిలవుంటాయ్

Video

పాకం పూరీలు

Course Dessert, sweets
Cuisine Andhra
Prep Time 10 minutes
Cook Time 20 minutes
Total Time 30 minutes
Servings 4 people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top