పాలక్ ఖిచ్డి

google ads

పాలక్ కిచిడి

Author Vismai Food
Cuisine Indian
palak kichidi
“పాలకూర కిచిడి” చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆరోగ్యకరమైన కిచిడి. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో ఉంటుంది ఈ కిచిడి.
ఈ కిచిడి పసిపిల్లల నుండి పెద్ద వారు అందరూ తినొచ్చు. ఇంకా బ్యాచిలర్స్ కి, ఆఫీస్లకి వెళ్ళే వారికి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్.సహజంగా లంచ్ బాక్స్ రెసిపీస్ అని గరం మసాలాలు, అల్లం వెల్లూలి ముద్దలు వేసి చేస్తుంటారు, ఆ రైస్ ఐటమ్స్ ఓ రోజు తినేందుకు సరదాగా ఉంటుంది, కానీ రోజూ అంత మసాలాలు తినడం అస్సలు మంచిది కాదు.
అందులోను మన వాతావరణానికి అస్సలు మంచిది కాదు, విపరీతమైన వేడి చేస్తుంది.ఇలాంటి సింపుల్ హేల్తీ రెసిపీస్ అయితే పొట్టకి హాయిగా ఉంటుంది.
ఈ కిచిడి నేను పాలకూర తో చేశా, మీరు కావాలంటే తోటకూర, చుక్కకూర లేదా కలగూరగా అన్నీ ఆకుకూరలు కలిపి కూడా చేసుకోవచ్చు. పిల్లలకైతే మిర్చి తగ్గిస్తే సరిపోతుంది.ఇంకా నేను దీనికి బాసుమతి బియ్యం వాడను మీరు మాములు సోనా మసూరి బియ్యం కూడా వాడుకోవచ్చు.
ఇంకా బియ్యానికి బదులు కొర్రలు, సామలు, గోధుమ రవ్వ ఇలా దేనితో అయినా చేసుకోవచ్చు. అసలు కిచిడి అంటే సోన మసూరి బియ్యం తోనే చేయాలి, ఏదో ఫ్లేవర్ కోసం నేను బాస్మతి బియ్యం వాడను.దీనికి ఏదైనా రైతా, అప్పడాలుంటే చాలా బాగుంటుంది.

Tips

ఈ కిచిడి లో అన్నం పొడి పొడిగా మెతుకు మెతుకు తెలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది
కిచిడి కాస్త జారుగా ఉండగానే దిమ్పుకోవడం వల్ల చల్లారాక గట్టి పడదు, ఒక వేళ గట్టి పడితే ఇంకొన్ని వేడి నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద ఉడికిస్తే సరిపోతుంది

Ingredients

 • 1 cup బాసుమతి బియ్యం (గంట నానబెట్టినది)
 • ½ cup పెసరపప్పు (గంట నానబెట్టినది)
 • 3 కట్టలు పాలకూర (కేవలం ఆకులని పేస్టు చేసుకోవాలి)
 • 1 రెబ్బ కరివేపాకు
 • 2 tbsp పచ్చి మిర్చి
 • 1 tbsp ఉల్లిపాయ తరుగు
 • 2 ఎండు మిర్చి
 • 3 వెల్లూలి (సన్నని తరుగు)
 • 1 tbsp జీలకర్ర
 • 1 tbsp నూనె
 • 2 tbsp నెయ్యి
 • tbsp పసుపు
 • ఇంగువ- చిటికెడు
 • ఉప్పు
 • 1.½ cup నీళ్ళు-
 • 1/2-3/4 కిచిడి లోకి వేడి నీళ్ళు

Instructions

 • కుక్కర్ లో బియ్యం, పెసరపప్పు, పసుపు, నీళ్ళు పోసి హై ఫ్లేం మీద ఓ విసిల్ రానిచ్చి దిమ్పేయండి
 • ఇదే సోన మసూరి బియ్యానికి అయితే 2.1/4 కప్స్ నీళ్ళు పోసి హై ఫ్లేం మీద ఓ విసిల్ రానివ్వాలి
 • పాన్ లో నూనె, నెయ్యి వేడి చేసి అందులో ఇంగువా, ఎండు మిర్చి, వెల్లూలి, జీలకర్ర, పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి వెల్లూలి ఎర్రబడేదాక వేపుకోండి
 • ఆ తరువాత ఉల్లిపాయ సన్నని తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాక ఫ్రై చేసుకోండి
 • ఉల్లిపాయలు మెత్తబడ్డాక పాలకూర ఆకుల పేస్టు, ఉప్పు వేసి పాలకూర లోని నీరు ఇగిరిపోయి పచ్చి వాసనా పోయే దాక ఫ్రై చేసుకోండి
 • ఆ తరువాత పొడిపొడిగా వండుకున్న పెసరపప్పు అన్నం వేసి పేస్టు మెతుకు విరగకుండా పట్టించండి
 • పట్టించాక, వేడి నీళ్ళు 1/2-3/4 దాకా పోసి కిచిడి నీటిని పీల్చి కాస్త చిక్కబడేదాక ఉడికించి దిమ్పెసుకోండి
 • ఆఖరున నచ్చితే 1 tsp నెయ్యి కూడా వేసుకోవచ్చు
 • ఇది చల్లని రైతా, అప్పడాలతో చాలా రుచిగా ఉంటుంది

Video

పాలక్ కిచిడి

Course Main Course
Cuisine Indian
Author Vismai Food

Ingredients

 • 1 cup బాసుమతి బియ్యం గంట నానబెట్టినది
 • ½ cup పెసరపప్పు గంట నానబెట్టినది
 • 3 కట్టలు పాలకూర కేవలం ఆకులని పేస్టు చేసుకోవాలి
 • 1 రెబ్బ కరివేపాకు
 • 2 tbsp పచ్చి మిర్చి
 • 1 tbsp ఉల్లిపాయ తరుగు
 • 2 ఎండు మిర్చి
 • 3 వెల్లూలి సన్నని తరుగు
 • 1 tbsp జీలకర్ర
 • 1 tbsp నూనె
 • 2 tbsp నెయ్యి
 • tbsp పసుపు
 • ఇంగువ- చిటికెడు
 • ఉప్పు
 • 1.½ cup నీళ్ళు-
 • 1/2-3/4 కిచిడి లోకి వేడి నీళ్ళు

Instructions

 • కుక్కర్ లో బియ్యం, పెసరపప్పు, పసుపు, నీళ్ళు పోసి హై ఫ్లేం మీద ఓ విసిల్ రానిచ్చి దిమ్పేయండి
 • ఇదే సోన మసూరి బియ్యానికి అయితే 2.1/4 కప్స్ నీళ్ళు పోసి హై ఫ్లేం మీద ఓ విసిల్ రానివ్వాలి
 • పాన్ లో నూనె, నెయ్యి వేడి చేసి అందులో ఇంగువా, ఎండు మిర్చి, వెల్లూలి, జీలకర్ర, పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి వెల్లూలి ఎర్రబడేదాక వేపుకోండి
 • ఆ తరువాత ఉల్లిపాయ సన్నని తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాక ఫ్రై చేసుకోండి
 • ఉల్లిపాయలు మెత్తబడ్డాక పాలకూర ఆకుల పేస్టు, ఉప్పు వేసి పాలకూర లోని నీరు ఇగిరిపోయి పచ్చి వాసనా పోయే దాక ఫ్రై చేసుకోండి
 • ఆ తరువాత పొడిపొడిగా వండుకున్న పెసరపప్పు అన్నం వేసి పేస్టు మెతుకు విరగకుండా పట్టించండి
 • పట్టించాక, వేడి నీళ్ళు 1/2-3/4 దాకా పోసి కిచిడి నీటిని పీల్చి కాస్త చిక్కబడేదాక ఉడికించి దిమ్పెసుకోండి
 • ఆఖరున నచ్చితే 1 tsp నెయ్యి కూడా వేసుకోవచ్చు
 • ఇది చల్లని రైతా, అప్పడాలతో చాలా రుచిగా ఉంటుంది

Tips

ఈ కిచిడి లో అన్నం పొడి పొడిగా మెతుకు మెతుకు తెలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది
కిచిడి కాస్త జారుగా ఉండగానే దిమ్పుకోవడం వల్ల చల్లారాక గట్టి పడదు, ఒక వేళ గట్టి పడితే ఇంకొన్ని వేడి నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద ఉడికిస్తే సరిపోతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top