పాల తాలికలు ఇవి తెలుగువారి ప్రేత్యేకమైన పిండి వంట! ఇది వినాయక చవితికి ఇంకా కొత్త పెళ్ళికూతురికి సారే తో పాటు ఇచ్చి పంపే ఆచారం కూడా ఉంది కొన్ని ప్రాంతాల్లో! ఇవి చేయడం చాలా సులభం. వీటి రుచి చాలా గొప్పగా ఉంటుంది! ఏదైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!

కావలసినవి:

  • తడి బియ్యం పిండి- 1 కప్
  • బెల్లం- 1 కప్
  • సగ్గుబియ్యం- 2 tbsps
  • పాలు- ½ లీటర్
  • నీళ్ళు- 250ml
  • యలకలపొడి- 1 tsp
  • నెయ్యి- ౩ tsps
  • జీడిపప్పు- ౩ tbsps
  • ఎండుకొబ్బరి పలుకులు- 2 tbsps
  • కిస్మిస్స్- 2 tsps

విధానం:

Directions

0/0 steps made
  1. 2 tbsps బెల్లం లో కొంచెం నీళ్ళు పోసి బెల్లం కరగనివ్వండి, బెల్లం కరిగాక అప్పుడు తడి బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి బాగా కలుపుకోండి.
    (తడి బియ్యం పిండి ఎలా చేయాలో కింద టిప్స్ లో ఉంది గమనించగలరు)
  2. పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకుని సాఫ్ట్ గా కలుపుకోండి.
  3. ఇప్పుడు బెల్లంలో కాసిని నీళ్ళుపోసి ఓ పొంగు రాగానే దించి చల్లార్చుకోండి
  4. ఇప్పుడు తడి బియ్యం పిండి ముద్దని గోలి సైజు ఉండలు చేసి దాన్ని పొడవుగా కాస్త మందంగా మురుకుల సైజు లో చేసుకోండి.
  5. ఈ పిండి ని 2 tbsps పక్కనుంచుకోండి
  6. ఇప్పుడు పాలు నీళ్ళు కలిపి మరిగించండి ఓ పొంగు రాగే 30 నిమిషాలు నానా బెట్టిన సగ్గుబియ్యం వేసి సగం పైన ఉడకనివ్వండి.
  7. సగ్గుబియ్యం సగం పైన ఉడికాక తయారుగా ఉంచుకున్న తాలికలు పాలల్లో వేసి 5 నిమిషాలు వదిలేయండి
  8. 5 నిమిషాల తరువాత నిదానంగా కలుపుకుని మూత పెట్టి 12-15 నిమిషాల పాటు ఉడకనివ్వండి
  9. 12 నిమిషాల తరువాత తాలికని స్పూన్ తో కట్ చేసి చూస్తే ఉడికి పాలని పీల్చుకున్నది లేనిది తెలుస్తుంది
  10. ఉడికాక పక్కనున్చుకున్న పిండి లో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకుని తాలికల్లో కలిపి మరో 5-6 నిమిషాలు లో-ఫ్లేం మీద మూత పెట్టి ఉడకనివ్వండి
  11. 5-6 నిమిషాలకి చిక్కబడుతుంది, అప్పుడు స్టవ్ ఆపేసి యాలకలపొడి , చల్లారిన బెల్లం పాకం పోసి నిదానంగా కలుపుకోండి
  12. ఇప్పుడు నెయ్యి వేడి చేసి అందులో ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్స్ వేసి ఎర్ర వేపి తాలికల్లో కలిపేసుకోండి.
  13. తాలికలు వేడి మీద కాస్త పచ్చిగా అనిపించొచ్చు, కానీ చల్లారక పాలని బాగా పీలుస్తాయ్!

టిప్స్:

  • తడి బియాం పిండి వాడితేనే తాలికలు మృదువుగా ఉంటాయ్! పాలని బాగా పీలుస్తాయ్!
  • తడి బియ్యం పిండి కోసం బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు వడకట్టి 30 నిమిషాలు నీడన ఆరబెట్టి తరువాత జల్లించుకోండి, రవ్వగా ఉన్న దాన్ని మళ్ళీ జల్లించుకుని మెత్తని పిండి గా చేసుకోండి. పట్టుకుంటే పిండి ముద్ద కట్టాలి దాన్నే తడి పిండి అంటారు. దీన్ని మీరు ఓ ఎయిర్-టైట్ డబ్బా పెట్టి డీప్-ఫ్రీజర్ లో నెల వరకు నిలవ చేసుకోవచ్చు!
  • తాలికలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోండి
  • బెల్లం పాకం వేడి మీద పోస్తే పాలు విరుగుతాయ్. అందుకే స్టవ్ ఆపేసి చల్లని పాకం పోస్తేనే పాలు విరగవ్
  • పిండి లో కాసిని నీళ్ళు పోసి కలిపి పాలల్లో పోస్తేనే తాలికలు చిక్కబడతాయ్, పిండి పోసాక మరీ ఎక్కువ సేపు ఉడికిన్చకండి, అలా చేస్తే చల్లారేపాటికి గట్టిగా ముద్దలా అయిపోతే తాలికలు!