పాల పూరీలు…ఇది వందల ఏళ్ళ నాటి వంటకం. ఇప్పటి తరం వారు ఆ స్వీట్స్ ఈ బేకింగ్ ఐటమ్స్ అని ఆరాటపడుతున్నారు కాని, ఓ సారి ఈ పాల పూరీల రుచి తెలిస్తే మళ్ళీ అవి గుర్తుకూడా రావు. చాలా ఆరోగ్యం అంతకు మించి ఎంతో రుచి. ఈ వంటకాన్ని దాదాపుగా చాలా మంది మర్చిపోయారు, ఇంకా వెనుకటి వంటకాలు చేస్తున్న కొందరికి తెలుసు. ఛానల్ లోని కామెంట్స్ ద్వార నాకు ఇది ఇంకా రాయలసీమ ప్రాంతం లో చేస్తున్నారు అని తెలుసుకున్నాను. ఏది ఏమైనా గొప్ప రెసిపీ ఇది.
ఈ రెసిపీని నాకు అంతరించి పోయిన రుచులు అనే పుస్తకం రాస్తున్న డా. జీ.వీ. పూర్ణ చందు గారు అందించారు.

కావలసినవి:

పూరీల కోసం:

 • గోధుమపిండి- 1 కప్
 • సాల్ట్- చిటికెడు
 • నెయ్యి- 2 tbsps
 • నీళ్ళు తగినన్ని

పాల కోసం:

  • చిక్కటి పాలు- 1 లీటర్
  • గసగసాలు- 2 tsps
  • బియ్యం పిండి- 2 tsps
  • జీడిపప్పు- 1/3 కప్
  • పచ్చికొబ్బరి తురుము- ½ కప్
  • పంచదార- 3/4 కప్
  • యాలకలపొడి- 1 tsp
  • నూనె వేయించడానికి సరిపడా

  విధానం:

  Directions

  0/0 steps made
  1. పూరీల కోసం గోధుమ పిండి, సాల్ట్, నెయ్యి వేసి ముందు బాగా కలుపుకుని కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మెత్తగా తడుపుకోవాలి. తరువాత దీన్నీ తడిగుడ్డ కప్పి 30 నిమిషాలు వదిలేయండి.
  2. మిక్సీ జార్ లో గసగసాలు, బియ్యం పిండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి, తరువాత జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకోండి, ఆ తరువాత పచ్చి కొబ్బరి వేసి కొద్దిగా పాలు పోసుకుని మెత్తని పేస్టు చేసుకోండి, ఎక్కడా పలుకుగా ఉండకూడదు. వెన్నలా ఉండాలి.
  3. ఇప్పుడు కచ్చితంగా అడుగు మందంగా ఉన్న వెడల్పాటి గిన్నె లో చిక్కటి పాలు పోసి ఓ పొంగు రానిచ్చి తరువాత మెత్తగా రుబ్బుకున్న కొబ్బరి పేస్టు వేసి కలుపుకుంటూ చిక్కబడేదాక ఉడికించుకోవాలి.
  4. పాలు కాస్త చిక్కబడే గానే పంచదార, యలకలపొడి వేసి పంచదార కరిగి ఇంకాస్త చిక్కబడే దాక ఉంచుకుని దిమ్పెసుకోండి..
  5. పూరీల కోసం పిండిని నిమ్మకాయంత బాల్స్ గా చేసుకుని పల్చగా వత్తుకుని ఫోర్క్ లేదా కత్తి తో వత్తుకున్న పిండి మీద అక్కడక్కడ పొడవండి. దీని వాల్ల పూరీలు పొంగవు.
  6. ఇప్పుడు వేడి వేడి నూనె లో హై-ఫ్లేం మీద రెండు వైపులా ఎర్రగా క్రిస్పీ గా వేయించుకొండి.
  7. వేడిగా తీసిన పూరిలను పాలలో 30 సెకన్ల నుండి 1 నిమిషం పాటు ఉంచి తీసెయ్యండి.
  8. సర్వ్ చేసేప్పుడు పైన ఇంకొన్ని పాలు పోసి సర్వ్ చేయండి.
  9. మీరు ఈ పాలని ఫ్రిజ్ లో ౩-4 రోజులవరకు పెట్టుకుకోవచ్చు. ఎప్పుడన్నా పూరీలు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు.
  10. /li>

  టిప్స్:

  • గసగసాలు బియ్యం పిండి ఇలా మిగిలిన పదార్ధాలన్నీ ఒక్కొటిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటేనే మెత్తగా వెన్నలా గ్రైండ్ అవుతాయి.
  • ఇతర దేశాల్లో ఉన్న వారికి గసగసాలు అందుబాటు లో ఉండవు అలాంటి వారు గసాల కి బదులు బాదం వాడుకోండి.
  • పాలు కచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నె లోనే కాచుకోవాలి, లేదంటే జీడిపప్పు పేస్టు అడుగుకి చేరి త్వరగా అడుగంటిపోతుంది, పాలన్నీ మాడువాసన వస్తాయ్.
  • పాలు సాంబార్ కంటే కాస్త తక్కువ చిక్కదనం ఉండగానే దిమ్పేయండి.
  • పూరిలను వేపి తీయగానే పాలల్లో వేసి 30 సెకన్ల కంటే ఎక్కువగా ఉంచితే తరువాత తినేప్పుడు అస్సలు అనుకూలంగా ఉండవ్ చిదురైపోతాయీ.
  • పాలల్లోంచి తెసేప్పుడు కాస్త క్రిస్పి గా అనిపిస్తాయి కాని కొద్ది సేపటికి మెత్తబడిపోతాయ్.