“పూర్ణాలు” ఇవి తెలుగు వారి ప్రేత్యేకమైన వంటకం. ఏ శుభాకరమైనా, పండుగైన ఇది ఉండాల్సిందే. అందరికి చాలా ఇష్టం. యావత్ ఆంధ్రా లో ఈ పుర్నాలు చేస్తారు, కాని గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువగా చేస్తారు, వారికి ఎన్నో రకాల పుర్నాలు కుడా ఉన్నాయ్. అవీ నేను మీకు త్వరలో చెప్తా. ఈ పూర్ణం బూరెలు మీకు చాలా పర్ఫెక్ట్ గా గంటలు గడుస్తున్నా కూడా క్రిస్పీగా ఉంటాయి. కొన్ని టిప్స్, కొలతలు పాటిస్తే మీకు పక్కాగా కరకరలాడే పుర్నాలు వస్తాయి!

కావలసినవి:

పూర్ణం పైన పిండి కి

 • మినపప్పు- ½ కప్( 4 గంటలు నానినది)
 • బియ్యం పిండి- 1 కప్
 • సాల్ట్

పూర్ణంకి

 • సెనగపప్పు- 1 కప్ ( 1 గంట నానినది)
 • బెల్లం – 1 కప్
 • యాలకల పొడి- 1 tsp
 • నెయ్యి- 1 tsp
 • నీళ్ళు- 1 tbsp
 • నూనె – వేపడానికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. బియ్యం పిండి లో నీళ్ళు కలిపి గట్టి ముద్దగా కలిపి 2 గంటలు నాననివ్వండి.
 2. మినపప్పు 4 గంటలు నానిన తరువాత మెత్తగా గట్టిగా రుబ్బుకోండి.
 3. 2 గంటల తరువాత మినపిండి లో నానిన బియ్యం పిండి కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసుకుంటూ పిండి ఇడ్లి పిండి జారు గా కలుపుకోండి.
 4. పూర్ణం కోసం సెనగపప్పు లో నీళ్ళు పోసి 4 -5 విసిల్స్ రానివ్వండి. పప్పు పట్టుకుంటే మెత్తగా ఉండాలి. అందాక ఉడకాలి.
 5. ఇప్పుడు పప్పు నీళ్లన్నీ ఓంపేసి మెత్తగా పప్పు గుత్తితో ఎనుపుకోండి.
 6. మరో మూకుడు లో tbsp నీళ్ళు పోసి బెల్లం తరుగు వేసి యలకలపొడి వేసి బెల్లం కరిగి ఓ పొంగు వచ్చేదాకా మరగనివ్వండి.
 7. బెల్లం ఓ పొంగు రాగానే సెనగపప్పు ముద్ద వేసి బాగా దగ్గరపడనివ్వండి.
 8. దింపే ముందు నెయ్యి వేసి దిమ్పెసుకోండి.
 9. ఇప్పుడు చాల్లారిన సెనగపిండిని చిన్న చిన్న లడ్డులు గా చేసి గాలికి ఆరనివ్వండి.
 10. ఇప్పుడు పిండి లో పూర్ణం ని వేసి పైకి లేపి కాస్త విదిలిస్తే పూర్ణం కి ఉన్న పిండి జారి పై పిండి పల్చాగా ఉంటుంది, అప్పుడు వేడి వేడి నూనె లో వేసి అలా ఓ నిమిషం వదిలేయండి.
 11. ఆ తరువాత గారిట తో తిప్పుకుంటూ మీడియం- ఫ్లేం మీద ఎర్రగా మాంచి కలర్ వచ్చేదాకా వేపుకోండి.
 12. ఇవి మూతపెట్టకుండా ఉంచితే 2-3 గంటలవరకు కరకరలాడుతూ ఉంటాయి.

టిప్స్:

 • పూర్ణం పిండి ఎంత గట్టిగా ఉంటె మీకు పుర్నాలు అంత పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయ్.
 • పూర్ణం పైన కోటింగ్ పిండి పల్చగా ఉందొ లేదో చూసుకోడానికి కలిపిన పిండి లో వేలు ముంచితే వెలికి ఎంత మందంగా పిండి ఉంటె పూర్ణం పైన పిండి కూడా అంత మందంగా ఉంటుంది అని అర్ధం చేసుకోండి. అలా అని మరీ పల్చగా కలిపితే పిండి నూనె లో వేయగానే పూర్ణం విడిపోయే అవకాసం ఉంది.