రోజు తినే ఇడ్లి కి ఇదో ట్విస్ట్!!! పిల్లలు కూడా ఏ పెచీలేకుండా చాలా ఎంజాయ్ చేస్తారు! పిల్లల లంచ్ బాక్సులకి చాలా పర్ఫెక్ట్. దీనికి ఏ చట్నీ అవసరం లేదు. ఇది మీరు సాయంత్రాలు స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ అందరికి నచ్చి తీరుతుంది.

కావలసినవి:

 • బటన్ ఇడ్లి- 25
 • నెయ్యి- 2 tbsps
 • ఆవాలు- ½ tsp
 • జీలకర్ర- ½ tsp
 • పచ్చిమిర్చి తరుగు- 1 tsp
 • అల్లం తరుగు- ½ tsp
 • సాల్ట్
 • మిరియాల పొడి- ½ tsp
 • కొత్తిమీర- 1 tbsps
 • నిమ్మ రసం- 1 tsp

విధానం:

Directions

0/0 steps made
 1. నెయ్యి కరిగించి ఆవాలు చిటపటమనిపించి ఆ తరువాత జీలకర్ర పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి కలుపుకొండి
 2. ఇప్పుడు ఇడ్లీలు వేసి 2 నిమిషాలు టాస్ చేసి పైన కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి చల్లి ౩ నిమిషాలు పాటు ఇడ్లీలు కాస్త క్రిస్పీగా అయ్యేలాగ ఫ్రై చేసుకోండి
 3. దింపే ముందు కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి తోస్స్ చేసుకుని దిమ్పెసుకోండి

టిప్స్:

 • దీనికి మీరు నార్మల్ ఇడ్లి కూడా ముక్కలుగా కట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు