బెండకాయ 65 ఇది పెళ్ళిళ్ళ స్పెషల్. బెండకయంటే ఇష్టం లేనిది ఎవరికి అందులోనూ ఇలా క్రిస్పీగా చేసిస్తే ఒక్కరే కూరంతా లాగించేస్తారు! ఇది వేడి వేడి నెయ్యన్నం తో ఇంకా సాంబారన్నం, చారన్నం లోకి భలేగా ఉంటుంది. పిల్లలు ఇది చేసిన రోజున ఏ వంకలు పెట్టకుండా తినేస్తారు అంత బాగుంటుంది.

కావలసినవి:

  • బెండకాయలు- 500 gms
  • కరివేపాకు- 2 రెబ్బలు
  • వేరు సెనగపప్పు- ¼ కప్
  • బియ్యం పిండి- ¼ కప్
  • సెనగపిండి- ¼ కప్
  • గరం మసాలా- ½ tsp
  • పచ్చి కొబ్బరి- 2 tbsps
  • సాల్ట్
  • జీలకర్ర- 1 tsp
  • కారం- 1 tsp
  • వెల్లులి- 6
  • అల్లం – 1 ఇంచ్
  • పచ్చిమిర్చి- 5
  • నూనె- వేయించడానికి

విధానం:

Directions

0/0 steps made
  1. మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లూలి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి
  2. ఇప్పుడు లేత బెండకాయ ముక్కల్లో బియ్యం పిండి, సెనగపిండి, ఉప్ప, కారం, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసి ముందు ముక్కలకి బాగా పట్టించండి
  3. ఇప్పుడు 2 tbsps నీళ్ళు పోసి బెండకాయలకి బాగా పట్టించండి, పిండి బాగా గట్టిగా ఉండాలి.
  4. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో పల్లెలు వేపుకుని పక్కనుంచుకోండి, తరువాత కరివేపాకు వేపి పక్కనుంచుకోండి
  5. ఇప్పుడు బెండకాయ ముక్కలని వేసి కేవలం మీడియం ఫ్లేం మీద మాత్రమే ఎర్రగా వేపుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్ రాగానే హై ఫ్లేం మీద వేపుకోండి క్రిస్పీ గా వేగుతాయ్.
  6. ఇప్పుడు వేపుకున్న బెండకాయ ముక్కల్లో వేడి గా ఉన్నప్పుడే గరం మసాలా, వేరు సెనగపప్పు, కరివేపాకు, పచ్చి కొబ్బరి వేసి బాగా కలుపుకొండి.

టిప్స్:

  • బెండకాయలు లేతవి వాడితే ఫ్రై చాలా బాగుంటుంది. నూనె లో ముక్కలు వేసాక మీడియం ఫ్లేం మీద వేపుకోండి