పొట్లకాయ పెరుగు పచ్చడి ఇది చేయడం చాలా తేలిక, కొత్తగా వంట చేసేవారు కూడా చాలా బాగా చేసేయొచ్చు. అన్నం లేదా రొట్టేల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

కావలసినవి:

 • లేత పొట్లకాయ ముక్కలు- 300 gms
 • కమ్మని పెరుగు- ½ లీటర్
 • చిన్న ఉల్లిపాయ ముక్కలు
 • పచ్చిమిర్చి- 4
 • అల్లం- 1 tsp
 • కరివేపాకు- ఓ రెబ్బ
 • ఎండు మిర్చి- 1
 • నూనె- 2 tbsps
 • మెంతులు- ¼ చెంచ
 • జీలకర్ర- 1 tsp
 • ఆవాలు- 1 tsp
 • సెనగపప్పు- 1 tsp
 • మినపప్పు- 1 tsp
 • ఉప్పు
 • పసుపు- ¼ చెంచా

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి ఎర్రగా వేగనివ్వండి ఆ తరువాత ఆవాలు వేసి చిటపటమనిపించండి
 2. ఇప్పుడు జీలకర్ర, సెనగపప్పు, మినపప్పు వేసి ఎర్రగా వేపుకోండి
 3. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపి, పొట్లకాయ ముక్కలు, పసుపు,సాల్ట్ వేసి ముక్కలు మెత్తబడే దాక మూత పెట్టి మీడియం-ఫ్ల్రేం మీద మగ్గనివ్వండి
 4. మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా పేస్టు చేసుకోండి
 5. ముక్కలు మెత్తబడ్డాక, అప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్టు వేసి ఓ నిమిషం వేపి దింపి చలార్చుకోండి.
 6. ఇప్పుడు కమ్మని పెరుగుని బాగా చిలికి అందులో చలారిన పొట్లకాయ కూర వేసి బాగా కలిపి, చిన్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోండి.
 7. ఇది అన్నం రొట్టేల్లోకి చాలా రుచిగా ఉంటుంది.