పులిహోర అనగానే ఏదో తెలియని అనుబంధం ముడిపడి ఉంటుంది ప్రతీ ఒక్కరికి. పులిహోర ప్రతీ ఊరికి ప్రాంతానికి, చేతికి, ఇంటికి రుచి మారుతూనే ఉంటుంది. ఏది ఎలా చేసినా రుచిగానే ఉంటుంది. మన రాష్ట్రాల్లోనే పులిహోరలోనే ఎన్నో రకాలున్నాయి, మెంతి పులిహోరా, ఆవ పులిహోర, గోంగూర పులిహోరా ఇలా ఎన్నో.
సహజంగా ఇళ్ళలో చేసే పులిహోరకి ఆలయాల్లో ఇచ్చే పులిహోరకి కచ్చితంగా రుచి లో తేడా ఉంటుంది. ఆలయాల్లో ఇచ్చ్చే పులిహోరలో తెలియని రుచి దాగుంటుంది. పెట్టేది పిడికెడు ప్రసాదమే అయినా ఎంతో రుచి. అలాంటి కమ్మటి అమృతం లాంటి ప్రసాదం పులిహోర కి ఈ రెసిపీ లో చెప్పేవి పక్కా కొలతలు. ఎప్పుడు చేసినా చాలా కమ్మటి పులిహోర వస్తుంది. ఈ రెసిపీ మేము ఆలయాల్లో నైవేద్యాలు చేసే వారి నుండి తెలుసుకుని చేస్తున్నాం!

కావలసినవి:

 • బియ్యం – 250 gms
 • నూనె- ¼ కప్
 • కరివేపాకు- 2 రెబ్బలు
 • పచ్చిమిర్చి- ౩ రెబ్బలు
 • పసుపు- 1 tsp
 • ఉప్పు
 • చింతపండు- 50 gms

మొదటి తలిమ్పుకి:

 • నూనె- 2 tsps
 • ఆవాలు- 1 tsp
 • మెంతులు- 1 tsp
 • కరివేపాకు- 1 రెబ్బ
 • ఇంగువ- ½ tsp

రెండో తాలిమ్పుకి:

 • నూనె- ¼ కప్
 • ఆవాలు- 1 tsp
 • వేరు సెనగపప్పు- ¼ కప్
 • సెనగపప్పు- 1 tbsp
 • మినపప్పు- 1 tbsp
 • ఎండు మిర్చి- 5
 • కరివేపాకు- 1 రెబ్బ

ఆవాల ముద్దకి:

 • ఆవాలు- 2 tsps
 • ఎండు మిర్చి- 1
 • అల్లం- 1 ఇంచ్
 • ఉప్పు – కొద్దిగా

విధానం:

Directions

0/0 steps made
 1. చినతపందుని వేడి నీటి లో నానా బెట్టి 250ml చింతపండు పులుసు తీయండి
 2. బియ్యాన్ని కడిగి కప్ కి రెండు కప్పుల నీళ్ళు పోసి మూడు విసిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి
 3. ఆవిరి పోయాక వేడి మీదే పసుపు, నూనె, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు ఉప్పు వేసి నిదానంగా పట్టించి చల్లారనివ్వండి.
 4. ఇప్పుడు ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, అల్లం వేసి మెత్తగా పేస్టు చేసుకోండి
 5. ఇప్పుడు 2 tsps నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు వేసి మెంతులు ఎర్రగా వేపుకోండి, తరువాత కరివేపాకు వేసి వేపుకోండి
 6. ఇప్పుడు చింతపండు పులుసు పోసి అందులో బెల్లం తరుగు వేసి పులుసు చిక్కటి గుజ్జుగా అయ్యేదాకా ఉడికించుకోండి
 7. చిక్కటి పేస్టు అయ్యాక ఆవాల పేస్టు వేసి ఓ ఉడుకు రానివ్వండి, ఓ ఉడుకు వచ్చాకా స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన అన్నాన్ని మాత్రమే వేసి బాగా పట్టించండి
 8. ఇప్పుడు రెండో తాలిమ్పుకి ¼ కప్ నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటమనిపించి వేరుసేనగాపప్పులు వేసి ఎర్రగా వేపి తరువాత సెనగపప్పు మినప్పు వేసి ఎర్రగా వేపుకోండి.
 9. ఇప్పుడు ఎండు మిర్చి కరివేపాకు రెబ్బలు వేసి వేపుకుని పులిహోరలో వేసి కలుపుకోండి అంతే ప్రసాదం పులిహోరా తయార్

టిప్స్:

 • బియ్యం కప్ కి 2 కప్స్ నీలు బియ్యం పాత బియ్యం అయితే కప్ కి 21/4 కప్స్ నీళ్ళు పోసుకోండి
 • వేడి మీద అన్నాన్ని కలిపితే చిదురవుతుంది
 • ఈ పులిహోరకి గానుగ నూనె అందులోను వేరుసెనగ నూనె వాడితే గొప్ప రుచిగా ఉంటుందిఈ పులిహోరకి గానుగ నూనె అందులోను వేరుసెనగ నూనె వాడితే గొప్ప రుచిగా ఉంటుంది
 • ఈ పులిహోరా కాస్త ఘాటుగా ఉంటుంది వద్దనుకుంటే ఆవాలు తగ్గించుకోండి