ఫూల్ మఖనా పాయసం
“ఫూల్ మఖనా పాయసం” ఇది నాకు తెలిసి పంజాబీ రెసిపీ. కాని నేను ఓ బెంగాలి ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను. చాలా నచ్చేసింది. బెంగాలీలు కూడా చాలా ఎక్కువగా చేస్తారు.బెంగాలీలు ఎన్నో రకాలుగా మఖనా పాయసం చేస్తారు. అంటే మఖనాని పొడి చేసి ఇంకా కొన్ని ఫ్లేవర్స్ తో కలిపి.ఇదే మాఖనా తో మఖనా చాట్, మఖనా ఫ్రైస్ ఇంకా కారమేల్ మఖనా ఇలా చాలా ఉన్నాయ్.మాఖనా అంటే తామర పువ్వు గింజల పేలాలు. ఇవి తక్కువ కేలరీస్ తో ఎన్నో పోషకాలతో ఉంటాయ్. ఇవి మాంచి టైం పాస్ స్నాక్ కూడా. పెనం మీద 4-5 నిమిషాలు డ్రై రోస్ట్ చేసి పైన ఉప్పు కారం వేసి కూడా తినొచ్చు, చాలా బాగుంటాయ్. ఇంకా బూంది మిక్షర్ లో కూడా పిడికెడు వేపుకుని వేసుకోవచ్చు.ఈ పాయసం ఎంతో రుచిగా సువాసన తో ఉంటుంది. సందర్భం ఏదైనా పర్ఫెక్ట్ ఈ పాయసం.ఈ పాయసం చల్లగా ఫ్రిజ్ లో పెట్టి తినడం కంటే వేడిగా లేదా చల్లారాక తినొచ్చు. ఫ్రిజ్ లో పెడితే మఖనాలు గట్టిగా అయిపోతాయ్!ఈ పాయసానికి పాలు చిక్కగా ఉండాలి అంటే సగం పైన మరిగి ఉండాలి లేదంటే అంత రుచిగా అనిపించదు.
Tips
రోజ్ వాటర్ అంటే కేర్ బ్యూటీ కి వాడే రోజ్ వాటర్. లేనట్లైతే యాలకలపోడే వేసుకోండి
Ingredients
- 50 gms ఫూల్ మఖనా
- 1 లీటర్ పాలు
- ½ cup పంచదార
- 2-3 tbsp జీడిపప్పు (30 నిమిషాలు నానబెట్టినవి)
- ¼ tbsp రోజ్ వాటర్
- ½ tbsp యాలకలపొడి
- 1 tbsp నెయ్యి
Instructions
- అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు పంచదార వేసి కలుపుతూ సగం అయ్యేదాకా మరిగించాలి
- మరో పాన్ లో tbsp నెయ్యి కరిగించి అందులో మఖనాలు వేసి 3-4 నిమిషాలు కలుపుతూ లో-ఫ్లేం మీద వేపితే లోపలి దాక వేగి పచ్చి వాసన పోతుంది
- వేపిన వెంటనే తీసి చల్లని నీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉంచండి
- మాఖన నీళ్ళలోంచి తీసి సగానికి ఇగిరిన పాలల్లో వేసి మరిగించండి, అంచుల వెంట ఏర్పడే మీగడని తీసి పాలల్లో వేస్తూ ఉండాలి, అప్పుడే రుచి పాయసానికి
- మరుగుతున్న పాలల్లో నానబెట్టిన జీడిపప్పు, రోజ్ వాటర్, యాలకపొడి వేసి కలపండి
- తరువాత మఖనా మెత్తబడే దాక ఉడికించి దిమ్పెసుకోండి
Video
ఫూల్ మఖనా పాయసం
Ingredients
- 50 gms ఫూల్ మఖనా
- 1 లీటర్ పాలు
- ½ cup పంచదార
- 2-3 tbsp జీడిపప్పు 30 నిమిషాలు నానబెట్టినవి