KFC చికెన్ అంటే అందరికి ప్రాణమే! ఒక్కరే బకెట్ లాగించే వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. కాని అవి కొనాలంటే బోలెడు ఖర్చు, అలా కాక ఈ టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ kfc చికెన్ ఇంట్లోనే చేసెయ్యొచ్చు. చాలా క్రిస్పీగా జ్యూసీ గా చాలా బాగుంటాయి!

కావలసినవి:

  • చికెన్ వింగ్స్/డ్రం స్టిక్స్- 6 స్కిన్ తో
  • పెరుగు- ¼ కప్
  • కారం- 1 tbsp
  • ఉప్పు
  • మిరియాల పొడి- 1 tsp
  • అల్లం వెల్లూలి పేస్టు- 1 tbsp
  • బియ్యం పిండి- ½ కప్

సెకండ్ కోటింగ్ లోకి

  • మిక్స్డ్ హెర్బ్స్- 1 tbsp
  • కారం/ పాప్రికా- 1 tbsp
  • సాల్ట్
  • 2 ఎగ్స్ బాగా బీట్ చేసినది
  • మైదా- ½ కప్
  • కార్న్ పిండి- ¼ కప్
  • బ్రెడ్ పొడి- ½ కప్
  • ఓట్స్ పొడి- ¼ కప్

విధానం:

Directions

0/0 steps made
  1. 30 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టిన వింగ్స్ తీసుకుని అందులో అల్లం వెల్లూలి పేస్టు కారం, మిరియాల పొడి, సాల్ట్ పెరుగు వేసి బాగా పట్టించి కనీసం 4 గంటలు, కుదిరితే రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచేయండి. ఇలా ఫ్రిజ్ లో ఉంచితే చాలా జ్యూసీ గా ఉంటాయి చికెన్.
  2. 4 గంటల తరువాత బియ్యం పిండి తో బాగా కోటింగ్ ఇవ్వండి.
  3. ఇప్పుడు ఎగ్స్ ని బాగా బీట్ చేసుకుని పక్కనుంచుకోండి.
  4. ఇప్పుడు కార్న్ పిండి, మైదా, ఓట్స్ పొడి, బ్రెడ్ పొడి , కారం, హెర్బ్స్, సాల్ట్ వేసి బాగా కలుపుకోండి.
  5. ఇప్పుడు చికెన్ ని ఎగ్ లో ముంచి, ఆ తరువాత కలిపి ఉంచుకున్న పొడి పిండి తో బాగా కోటింగ్ ఇవ్వండి.
  6. ఇప్పుడు వేడి వేడి నూనె లో వేసి మీడియం-ఫ్లేం మీద మాంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి.
  7. మాంచి కలర్ వచ్చాక తీసి టమాటో కేట్చప్ తో సర్వ్ చేసుకోండి.

టిప్స్:

  • చికెన్ కచ్చితంగా స్కిన్ తో ఉండాలి అప్పుడే కోటింగ్ బాగా పడుతుంది.
  • చికెన్ ఉప్పు నీటిలో నానబెడితే ముక్క బాగా జ్యూసీ గా ఉంటుంది.
  • మసాలాలు బాగా పట్టించాక కచ్చితంగా కనీసం 4-5 గంటలు నానాలి.
  • ముక్కలు నూనెలో వేసాక మీడియం-ఫ్లేం మీదే ఫ్రై చేయాలి. లేదంటే పైన ఎరుపోస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది.