బియ్యం పిండి…కారప్పూస/మురుకులు/జంతికలు/చక్రాలు ఇలా రకరకాల పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు! ఎవరు ఏ పేరుతో పిలిచినా ఎలాంటి మార్పులతో చేసినా బెస్ట్ టైం-పాస్ స్నాక్. చాలా హేల్తీ, చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే బెస్ట్ గా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

ఈ చక్రాల్లోనే ఎన్నో రాకాలున్నాయ్. కొందరు కొన్నేస్తే ఇంకొందరు ఇంకోటి వేస్తారు. ప్రాంతాన్ని బట్టి రుచి తీరు మారిపోతుంది. ఇంకా మిల్లెత్స్ తో కూడా చేస్తారు. అవన్నీ నేను త్వరలో చెప్తా.

ఈ బియ్యం పిండి చక్రాలు పర్ఫెక్ట్ గా రావడానికి చాల సింపుల్ కొలత అండి, ఎప్పుడు చేసినా పక్కాగా వస్తాయి. ఈ చక్రాలు తక్కువ నూనె లాగుతాయ్, ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి. కనీసం రెండు వారాలదాకా నిలవుంటాయ్ కూడా.

చక్రాల్లోనే చాలా మంది సెనగపప్పు, నువ్వులు, మినపప్పు, సగ్గుబియ్యం, సెనగపిండి వేసి చాలా రకాలుగా చేస్తారు. నేను చాలా సింపుల్ చక్రాలు చేస్తున్నా మినపప్పుతో. దీనికి కారం కాకుండా, వాము వాడితే తెల్లగా వస్తాయి చక్రాలు,  కారం వాడితే ఎర్రగా వస్తాయి

కావలసినవి:

 • బియ్యం – 250 gms
 • మినపప్పు – 50 gms
 • నూనె – 1 tbsp
 • ఉప్పు
 • వాము – 1 tbsp
 • నూనె – వేపుకోడానికి
 • నీళ్ళు – పిండి తడుపుకోడానికి

విధానం:

Directions

0/0 steps made
 1. బియ్యం, మినపప్పు కలిపి మెత్తగా మర ఆడించి జల్లించిన పిండి తీసుకోండి.(మిక్సీ లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ కచ్చితంగా జల్లించాలి)
 2. ఇదే కేజీ కి చేసుకొంటే కేజీ బియ్యానికి 200 gms మినపప్పు, కప్పుల్లో అయితే కప్ బియ్యానికి అదే కప్ తో 5వ వంతు మినపప్పు
 3. ఈ పిండిలో ఉప్పు నూనె, నలిపిన వాము వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్ గా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి
 4. చక్రాల గిద్ద లో నూనె రాసి పెద్ద రంధ్రాలున్న ప్లేట్ పెట్టి, పిండి ముద్ద పెట్టి తడి ఆకు లేదా నూనె రాసిన ప్లేట్ మీద చిన్న చిన్న చుట్టలుగా వేసుకోండి, ఆ తరువాత వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద మాత్రమే కరకరలాడేట్టు వేపుకోండి.
 5. చల్లారాక డబ్బా లో ఉంచుకోండి.

టిప్స్:

 • నూనె వేడెక్కకుండా వేసినా, హై ఫ్లేం మీద వేపినా మెత్తగా వస్తాయ్ చక్రాలు