“బియ్యం రవ్వ ఇడ్లి” ఇది ఇన్స్టంట్ గా అంటే మరీ ఇన్స్టంట్ గా కాదుగాని గంటలో రెడీ. దీనికి మాములు ఇడ్లీల కులా ముందు రోజే ఎలాంటి ప్రీ-ప్రిపరేషన్ అవసరం లేదు. మామూలు ఇడ్లీల రుచి బియ్యం రవ్వ ఇడ్లీ రుచి లో చాలా తేడా ఉంటుంది. దీని రుచి దీనిదే దాని రుచి దానిదే.

ఏం టిఫిన్ చేయాలో అర్ధం కానప్పుడు చాలా హెల్ప్ అవుతుంది.

ఈ ఇడ్లీ లో వాడే పుల్లటి మజ్జిగ వల్ల చాలా బాగుంటుంది రుచి. దీనితో కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి , సాంబార్ చాలా బాగుంటుంది. (ఆ రెసిపీస్ కింద లింక్ ఉంది చుడండి)

ఈ ఇడ్లీలకి నేను బియ్యం రవ్వ వాడను చాలా మంది బియ్యం రవ్వకి బదులు ఇడ్లీ రవ్వ వాడుకోవచ్చా అని అడుగుతుంటారు. ఇడ్లీ రవ్వ కూడా బియ్యం నుండి వచ్చే రవ్వే అయినా, మరీ అంత సన్నని రవ్వ దీనికి పనికిరాదు. బియ్యం రవ్వే ఉండాలి.

ఈ పిండి లో నేను పల్చటి అటుకులు వాడను, అవే త్వరగా నానతాయ్. మందం అటుకులు నానావు. ఇంకా పుల్లటి మజ్జిగ రుచి చాలా బాగుంటుంది. లేని వారు 1 tbsp నిమ్మరసం వేసుకోవచ్చు మజ్జిగ లో.

ఇంకా ఇడ్లీలు వేసేప్పుడు అల్లం, పచ్చిమిర్చి ముద్ద 1 tsp వేసుకున్నా చాలా బాగుంటుంది, చట్నీ అవసరం లేకుండా సరిపోతుంది.

బియ్యం రవ్వ రెసిపీ:

బియ్యం రవ్వ చేసుకోవడం చాలా తేలిక. బియ్యంని కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు నీళ్ళు ఓంపేసి ఎండలో నీరు ఆవిరైపోయే దాకా ఆరబెట్టి. రవ్వ గా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా మరాడిస్తే సరిపోతుంది.

ఇవి కూడా ట్రై చేయండి:

అల్లం పచ్చడి
హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ
సాంబార్
పూరీ కూర/బొంబాయ్ చట్నీ
ఇన్స్టంట్ బెల్లం అట్లు

కావలసినవి:

 • బియ్యం రవ్వ- 1.5 కప్స్
 • పల్చటి అటుకులు- 1/2 కప్
 • పల్చని పుల్లటి మజ్జిగ- 1 లీటర్
 • వంట సోడా- 1/2 tsp
 • ఉప్పు

విధానం:

Directions

0/0 steps made
 1. పల్చటి అటుకుల్లో మజ్జిగ పోసి 20 నిమిషాలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి
 2. గ్రైండ్ చేసుకున్న అటుకుల్లో బియ్యం రవ్వ, వంట సోడా, ఉప్పు వేసి మజ్జిగ తోనే ఇడ్లీ పిండి జారుగా అంటే ఇడ్లీ పిండి చిక్కదనంలో కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి.
 3. 30 నిమిషాల తారువాత అవసరమైతే ఇంకాస్త మజ్జిగ పోసి పలుచన చేసి ఇడ్లీ ప్లేట్స్ కి నెయ్యి/నూనె రాసి పిండి వేసుకోండి.
 4. ఇడ్లి కుక్కర్ లో నీళ్ళు పోసి 5 నిమిషాలు హై ఫ్లేం మీద, 4 నిమిషాలు లో-ఫ్లేం మీద స్టీం చేసి 5 నిమిషాల వదిలేసి ఆ తరువాత మూత తీయండి. తరువాత తడి చేసిన చెంచాతో ఇడ్లీలు తీసుకోండి.
 5. ఇవి వేడిగా చాలా రుచిగా ఉంటాయ్.

టిప్స్:

 • ప్రెషర్ కుక్కర్ లో ఇడ్లీ స్టీం చేస్తే విసిల్ పెట్టకూడదు.