“బూందీ కుర్మా” ఇంట్లో కూరగాయలే లేనప్పుడు లేదా ఏదైనా వెరైటీ తిందాం అనిపించినప్పుడు ఈ కూర చేసుకోండి, చాలా నచ్చుతుంది మీకు మీకు ఫ్యామిలీకి . ఇంట్లో అందరు ఇష్టపడతారు కూడా. ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది..

కావలసినవి:

బూంది కోసం

 • సెనగపిండి- ½ కప్
 • బియ్యం పిండి- 2 tbsps
 • నీళ్ళు తగినన్ని
 • నూనె బూంది వేపడానికి

కుర్మా కోసం

 • నూనె- ¼ కప్
 • ఉల్లిపాయ పేస్టు- ½ కప్
 • పచ్చిమిర్చి చీలికలు- 4
 • అల్లం వెల్లూలి పేస్టు- 1 tsp
 • కరివేపాకు- 1 రెబ్బ
 • కొత్తిమీర తరుగు- 2 tbsps
 • జీడిపప్పు- ౩ tbsps(30 నిమిషాలు నానబెట్టినది)
 • కర్బూజా గింజలు/గసగసాలు- 2 tsps( 30 నిమిషాలు నానబెట్టినది)
 • సాల్ట్
 • కారం- 1 tbsp
 • పసుపు- ½ tsp
 • గరం మసాలా- 3/4 tsp
 • వేయించిన జీలకర్ర పొడి- 3/4 చెంచా

విధానం:

Directions

0/0 steps made
 1. సెనగపిండి లో బియ్యం పిండి వేసి బాగా కలిపి నీళ్ళు పోసుకుంటూ గరిట జారుగా పిండి కలిపి ఉంచుకోండి.
 2. ఇప్పుడు లోతుగా ఉన్న మూకుడు లో నూనె ని సలసలా మరగనివ్వండి, నూనె మరుగుతుండగా అప్పుడు హై-ఫ్లేం మీద మాత్రమే బూంది గరిట మీద పిండి పోసుకొండి నిదానంగా.
 3. బూంది ని హై ఫ్లేం మీద ఎర్రగా కరకరలాడేట్టు వేపుకుని తీసి ఓ బోల్ లో వేసుకోండి.
 4. ఇప్పుడు కుర్మా కోసం నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి వేపుకోండి.
 5. ఆ తరువాత అల్లం వెల్లూలి పేస్టు వేసి వేపుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఉల్లిపాయల్లోంచి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి.
 6. పచ్చి వాసనపోయాక జీడిపప్పు పేస్టు వేసి బాగా కలుపుతూ లైట్-గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇది వేగి రంగు మారడానికి కనీసం 8-10 నిమిషాలు పడుతుంది.
 7. జీడిపప్పు పేస్టు వేసి బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ పేస్టు ఎంత బాగా వేగితే అంత రుచి కుర్మా కి.
 8. రంగు మారక అప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి బాగా వేపుకోండి
 9. ఇప్పుడు ముప్పావు లీటర్ నీళ్ళు పోసి బాగా కలుపుకుని కుర్మా చిక్కబడనివ్వండి.
 10. కుర్మా ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది
 11. కుర్మా చిక్కబడుతుండగా అప్పుడు జీలకర్ర పొడి, గరం మసాలా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి కాస్త నీరు నీరుగా ఉండగానే దిమ్పెసుకోండి. చల్లరేపాటికి ఇంకా చిక్కబడుతుంది కూర.
 12. కుర్మా సర్వ్ చేసుకునే 5 నిమిషాల ముందు బూంది వేసి కలిపి సర్వ్ చేసుకోండి. ఇదో ప్రతీ ఒక్కరికి నచ్చి తీరుతుంది.

టిప్స్:

 • కొనుక్కొచ్చిన బూంది కూడా వాడుకోవచ్చు. కాని, ఉప్పు- కారాలు చూసుకుని వేసుకోండి. పల్లీలు ఈ కూరకి బాగుండవు.
 • బూంది లోతు మూకుడు లో సలసలకాగే నూనె లో వేపితే రౌండ్ షేప్ తో పాటు కరకరలాడుతూ వస్తాయ్.
 • కర్భూజా గింజలకి బదులు గసాలు వాడుకోవచ్చు, అదీ లేదంటే 3 tbsps పచ్చి కొబ్బరి వేసుకోండి.