బూందీ లడ్డూ

google ads

బూందీ లడ్డూ

Author Vismai Food
boondi-laddu
“బూందీ లడ్డూ” ఇదంటే యావత్ ప్రపంచానికి ఇష్టమే!!! గుళ్ళలో, ప్రతీ పండుగకి, స్పెషల్ రోజుల్లో అన్నింటికీ ఈ లడ్డూ మనం తింటూనే ఉంటాం. కానీ ప్రాంతాన్ని బట్టి లడ్డూ కి వేసే పదార్ధాల కొలతల్లో చేసే తీరులో మార్పులున్నాయ్,
దాని తోనే రుచిలో చాలా మార్పు వస్తుంది.నేను చెప్పబోయే లడ్డూ చాలా రుచిగా, రోజులు గడిచాక కూడా పాకం గట్టిపడకుండా, సాఫ్ట్ గా ఉంటుంది. దానికి కొన్ని కచ్చితమైన కొలతలు, విధానాలు ఉన్నాయ్.
అవి పాటిస్తే లడ్డూ ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది. నేను ఈ లడ్డూలో ఎలాంటి కృత్రిమ రంగులు వాడటంలేదు!!ఇందులో ప్రతీ స్టెప్ లో నేను చెప్పే టిప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి
గమనిక: (నేను వీడియో లో ఉన్న కొలతలకి డబుల్ చేశాను కొలతలు)

Tips

పిండి జారైతే boondi కి తోకలోస్తాయ్, చూడడానికి అంత బాగుండదు
పాకం 1:1 కి సరైన కొలత మీకు తీపి ఇష్టమైతే కొంచెం పెంచుకోవచ్చు
నచ్చితే చిటికెడు కలర్ పాకం లో వేసుకోవచ్చు
పాకంలో పటిక వేస్తే చల్లారాక పాకం గట్టిపడదు, లేదా నిమ్మరసం అయినా వేసుకోవచ్చు
పాకం సరైన తీగ పాకం రాకపోతే boondi చల్లారేపాటికి పాకం రవ్వగా అయిపోతుంది, పాకం మరీ ముదిరిపోతే లడ్డూ సాగుతుంది
బూందీ పాకం వేడి మీదే వేయాలి, అప్పుడే పాకాన్ని బాగా పీలుస్తుంది
ఒకవేళ పాకం లో పొరపాటు జరిగి పాకం గట్టిపడి లడ్డు కట్టడానికి రానట్లైతే 1 tbsp నీళ్ళు వేసి పొయ్యి మీద సిం లో ఉంచితే పాకం పల్చనవుతుంది అప్పుడు లడ్డూ కట్టుకోండి
అసలు పాకం సరిగా పడితే బూందీని మెదపక్కర్లేదు, పర్ఫెక్ట్ గా లడ్డూ వస్తుంది.
నచ్చితే చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవచ్చు నేను వేయలేదు

Ingredients

 • 2 cup జల్లించిన సెనగపిండి
 • 2 cup పంచదార
 • 1.¼ cup నీళ్ళు
 • 7-8 యాలకలు దంచినది
 • జీడిపప్పు- పిడికెడు
 • 2 tbsp ఎండు ద్రాక్ష
 • పాటిక- 2 చిటికెళ్ళు (నిమ్మరసం- 1 tsp)
 • నూనె boondi వేపుకోడానికి
 • 1 tbsp నెయ్యి
 • నీళ్ళు పిండి కలుపుకోడానికి

Instructions

 • జల్లించిన సెనగపిండి లో తగినన్ని నీళ్ళు కలిపి అట్ల పిండి కంటే ఓ పిసరు జారుగా కలుపుకుని ఉంచుకోండి. (పిండి జల్లించకపోతే నీళ్ళు పోసాక ఉండలు కడుతుంది)
 • పాకానికి పంచదారా, నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి, పాకం ఓ పొంగు రాగానే పటిక లేదా నిమ్మరసం వేసి ముదురు ఓ తీగ పాకం రానివ్వాలి
 • ముదురు ఓ తీగ పాకం అంటే పాకం లోంచి గరిట పైకి లేపి పాకాన్ని ఓంపేశాకా ఆఖరున కారే బొట్లు ఓ చిక్కటి తీగలా జారాలి, లేదా వేలితో పాకాన్ని నలిపి పైకి తీస్తే మధ్యకి తెగని ఓ చక్కని తీగ రావాలి.
 • ఆప్పుడు స్టవ్ ఆపేసి యాలకల పొడి వేసి కలిపి దింపి పక్కనుంచండి
 • ఇప్పడు అడుగు లోతున్న మూకుడులో నూనెని బాగా మరిగించి నూనె పైన చిల్లుల గరిట పెట్టి పిండి నిదానంగా పోసి అట్లు పోసినట్లు కలిపితే ముత్యాల్లా పిండి జారి వేగుతుంది
 • బూందీని పెద్ద మంట మీద మాత్రమే వేపాలి, బూందీని ఎర్రగా కరకరలాడేట్టు వేపకూడదు, కాస్త రంగు మారి మెత్తగా ఉన్నప్పుడే బూందీ తీసి వేడి పాకం లో వేసి బాగా పట్టించాలి
 • అదే నూనె లో కాసిని జీడిపప్పు ఎండుద్రాక్ష వేసి వేపి బూందీ లో వేసి 2-3 నిమిషాలు బాగా పాకాన్ని పట్టించి 10 నిమిషాలు వదిలేయండి, అప్పుడు పాకాన్ని బాగా పీల్చి బూందీ మెత్తబడుతుంది.
 • 10 నిమిషాల తరువాత పిడికెడు బూందీ ని మెత్తగా మెదిపి నెయ్యి వేసి బాగా కలుపుకుని చేతులకి నెయ్యి రాసుకుని boondi ని పిండుతూ లడ్డూ కట్టుకోవాలి
 • ఇలా కట్టుకున్న లడ్డూలు 5-6 గంటలు గాలికి ఆరనిచ్చి ఆ తరువాత డబ్బాలో పెట్టుకుంటే వారం పాటు నిలవుంటాయ్

Video

బూందీ లడ్డూ

Author Vismai Food

Ingredients

 • 2 cup జల్లించిన సెనగపిండి
 • 2 cup పంచదార
 • 1.¼ cup నీళ్ళు
 • 7-8 యాలకలు దంచినది
 • జీడిపప్పు- పిడికెడు
 • 2 tbsp ఎండు ద్రాక్ష
 • పాటిక- 2 చిటికెళ్ళు నిమ్మరసం- 1 tsp
 • నూనె boondi వేపుకోడానికి
 • 1 tbsp నెయ్యి
 • నీళ్ళు పిండి కలుపుకోడానికి

Instructions

 • జల్లించిన సెనగపిండి లో తగినన్ని నీళ్ళు కలిపి అట్ల పిండి కంటే ఓ పిసరు జారుగా కలుపుకుని ఉంచుకోండి. (పిండి జల్లించకపోతే నీళ్ళు పోసాక ఉండలు కడుతుంది)
 • పాకానికి పంచదారా, నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి, పాకం ఓ పొంగు రాగానే పటిక లేదా నిమ్మరసం వేసి ముదురు ఓ తీగ పాకం రానివ్వాలి
 • ముదురు ఓ తీగ పాకం అంటే పాకం లోంచి గరిట పైకి లేపి పాకాన్ని ఓంపేశాకా ఆఖరున కారే బొట్లు ఓ చిక్కటి తీగలా జారాలి, లేదా వేలితో పాకాన్ని నలిపి పైకి తీస్తే మధ్యకి తెగని ఓ చక్కని తీగ రావాలి.
 • ఆప్పుడు స్టవ్ ఆపేసి యాలకల పొడి వేసి కలిపి దింపి పక్కనుంచండి
 • ఇప్పడు అడుగు లోతున్న మూకుడులో నూనెని బాగా మరిగించి నూనె పైన చిల్లుల గరిట పెట్టి పిండి నిదానంగా పోసి అట్లు పోసినట్లు కలిపితే ముత్యాల్లా పిండి జారి వేగుతుంది
 • బూందీని పెద్ద మంట మీద మాత్రమే వేపాలి, బూందీని ఎర్రగా కరకరలాడేట్టు వేపకూడదు, కాస్త రంగు మారి మెత్తగా ఉన్నప్పుడే బూందీ తీసి వేడి పాకం లో వేసి బాగా పట్టించాలి
 • అదే నూనె లో కాసిని జీడిపప్పు ఎండుద్రాక్ష వేసి వేపి బూందీ లో వేసి 2-3 నిమిషాలు బాగా పాకాన్ని పట్టించి 10 నిమిషాలు వదిలేయండి, అప్పుడు పాకాన్ని బాగా పీల్చి బూందీ మెత్తబడుతుంది.
 • 10 నిమిషాల తరువాత పిడికెడు బూందీ ని మెత్తగా మెదిపి నెయ్యి వేసి బాగా కలుపుకుని చేతులకి నెయ్యి రాసుకుని boondi ని పిండుతూ లడ్డూ కట్టుకోవాలి
 • ఇలా కట్టుకున్న లడ్డూలు 5-6 గంటలు గాలికి ఆరనిచ్చి ఆ తరువాత డబ్బాలో పెట్టుకుంటే వారం పాటు నిలవుంటాయ్

Tips

పిండి జారైతే boondi కి తోకలోస్తాయ్, చూడడానికి అంత బాగుండదు
పాకం 1:1 కి సరైన కొలత మీకు తీపి ఇష్టమైతే కొంచెం పెంచుకోవచ్చు
నచ్చితే చిటికెడు కలర్ పాకం లో వేసుకోవచ్చు
పాకంలో పటిక వేస్తే చల్లారాక పాకం గట్టిపడదు, లేదా నిమ్మరసం అయినా వేసుకోవచ్చు
పాకం సరైన తీగ పాకం రాకపోతే boondi చల్లారేపాటికి పాకం రవ్వగా అయిపోతుంది, పాకం మరీ ముదిరిపోతే లడ్డూ సాగుతుంది
బూందీ పాకం వేడి మీదే వేయాలి, అప్పుడే పాకాన్ని బాగా పీలుస్తుంది
ఒకవేళ పాకం లో పొరపాటు జరిగి పాకం గట్టిపడి లడ్డు కట్టడానికి రానట్లైతే 1 tbsp నీళ్ళు వేసి పొయ్యి మీద సిం లో ఉంచితే పాకం పల్చనవుతుంది అప్పుడు లడ్డూ కట్టుకోండి
అసలు పాకం సరిగా పడితే బూందీని మెదపక్కర్లేదు, పర్ఫెక్ట్ గా లడ్డూ వస్తుంది.
నచ్చితే చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవచ్చు నేను వేయలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top