బెండకాయ మజ్జిగ పులుసు

google ads

బెండకాయ మజ్జిగ పులుసు

Author Vismai Food
BENDAKAYA MAJJIGA PULUSU
తక్కువ టైం లో తృప్తినిచ్చే కమ్మటి రెసిపీ కావాలంటే నా స్టైల్ లో “బెండకాయ మజ్జిగ పులుసు” ట్రై చేయండి వెళ్ళు జుర్రుకుంటూ తినేస్తారు. మజ్జిగ పులుసులు ఎన్నో రకాలున్నాయ్, నేనూ చాలానే చేశాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి తిరగమూత వేసి చేసే మజ్జిగ చారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చేస్తారు. ఎప్పుడూ ఒకే తీరుగా కాక ఈ సారి బెండకాయ మజ్జిగ పులుసు చేయండి, ఆ పూట తృప్తిగా భోజనం చేస్తారు.బెండకాయ అంటే ఇష్టమున్నా, దానిలోని జిగురు కారణంగా ఎక్కువగా ఇష్టపడరు. ఈ రెసిపీ లోని టిప్స్ తో చేస్తే బెండకాయ జిగురులేకుండా ఎంతో రుచిగా ఉంటుంది.ఈ స్టైల్ బెండకాయ మజ్జిగ పులుసు నేను తమిళనాడులో ఓ పెళ్ళిలో తిన్నాను, ఆ రెసిపిని నా స్టైల్ లో కొంచెం మనకి నచ్చే తీరులో మార్పు చేశా.

Tips

మజ్జిగ చారు చేసే ముందు ఓ సారి కింద టిప్స్ ఫాలో అయి చేయండి:
బెండకాయలు కడిగి తుడిచి తడిలేని కత్తితో అంగుళం ముక్కలు కోసుకుంటే జిగురు తగ్గుతుంది
బెండకాయ ముక్కలు వేడి నూనె లో కాస్త ఉప్పు వేసి ఎక్కువగా కలపకుండా నూనె పట్టించి మూత పెట్టి హై-ఫ్లేం మీద వేపితే చక్కగా జిగురు వదులుతుంది.
పెరుగులో కొబ్బరి పేస్టు కొద్దిగా కలుపుకోవాలి, లేదంటే పెరుగు మజ్జిగలో పోసాక విరిగిపోతుంది
ఈ బెండకాయ మజ్జిగ చారుకి పుల్లని పెరుగు రుచిగా ఉంటుంది. పుల్లని పెరుగు లేని వారు ఆఖరున అర చెక్క నిమ్మరసం పిండుకోండి
మజ్జిగ చారులు కొబ్బరి నూనెతో తాలింపు ప్రేత్యేకమైన రుచినిస్తుంది. ఓ సారి కొబ్బరి నూనె తాలింపు వేసి చుడండి, తప్పక నచ్చుతుంది. నచ్చని వారు వేరుసెనగ నూనె లేదా రిఫైండ్ నూనె తో వేసుకోండి.

Ingredients

 • 200 gms బెండకాయ ముక్కలు
 • ½ లీటర్ చిలికిన పెరుగు
 • కొబ్బరి పేస్టు కోసం:
 • 2 tbsps పచ్చి సెనగపప్పు (గంట నానబెట్టినది)
 • 2 tsps బియ్యం (గంట నానబెట్టినది)
 • 1 tbsp ధనియాలు
 • ¼ కప్ పచ్చి కొబ్బరి ముక్కలు
 • 1 tsp జీలకర్ర
 • 2 పచ్చిమిర్చి ముక్కలు
 • మజ్జిగ పులుసు కోసం:
 • ¼ కప్ కొబ్బరి/రిఫైండ్ నూనె
 • 1 tsp ఆవాలు
 • 2 పచ్చి మిర్చి చీలికలు
 • 2 రెండు మిర్చి
 • 1 tbsp అల్లం తరుగు
 • 1 tsp జీలకర్ర
 • ½ tsp పసుపు
 • 2 రెబ్బల కరివేపాకు
 • 2 చిటికెళ్ళు ఇంగువా
 • రుచి సరిపడా రాళ్ళ ఉప్పు
 • 2 tbsps కొత్తిమీర తరుగు

Instructions

 • మిక్సీ లో పేస్టు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్ళతో పలుకులేని మెత్తని పేస్టు చేసుకోవాలి
 • మూకుడులో నూనె వేడి చేసి బెండకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి హై-ఫ్లేం మీద ఎర్రగా వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. బెండకాయలు వేగాక తీసి పక్కనుంచుకోండి
 • అదే మూకుడులో ఇంకాస్త నూనె వేడి చేసి అందులో ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోవాలి
 • అందులోనే అల్లం, పసుపు వేసి కరివేపాకు వేసి వేపుకుని ఇంగువ కూడా వేసి వేపుకోవాలి
 • అల్లం వేగాక మెత్తగా రుబ్బుకున్న సెనగపప్పు కొబ్బరి పేస్టు వేసి కొంత పక్కనుంచుకోవాలి
 • సెనగపప్పు ముద్ద వేపి కాసిని నీళ్ళు పోసి ఉడుకుపట్టేదాక మీడియం ఫ్లేం మీద ఉడకనివ్వాలి
 • చిలికిన పెరుగులో సెనగపప్పుముద్ద వేసి బాగా కలిపి మూకుడులో పోసి ½ లీటర్ నీళ్ళు ఉప్పు వేసి గడ్డలు లేకుండా కలుపుకుని సన్నని సెగ మీద ఓ ఉడుకు రానివ్వాలి
 • మజ్జిగ ఉడుకుపట్టాక వేపుకున్న బెండకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి దిమ్పెసుకోవాలి.

Video

బెండకాయ మజ్జిగ పులుసు

Author Vismai Food

Ingredients

 • 200 gms బెండకాయ ముక్కలు
 • ½ లీటర్ చిలికిన పెరుగు
 • కొబ్బరి పేస్టు కోసం:
 • 2 tbsps పచ్చి సెనగపప్పు గంట నానబెట్టినది
 • 2 tsps బియ్యం గంట నానబెట్టినది
 • 1 tbsp ధనియాలు
 • ¼ కప్ పచ్చి కొబ్బరి ముక్కలు
 • 1 tsp జీలకర్ర
 • 2 పచ్చిమిర్చి ముక్కలు
 • మజ్జిగ పులుసు కోసం:
 • ¼ కప్ కొబ్బరి/రిఫైండ్ నూనె
 • 1 tsp ఆవాలు
 • 2 పచ్చి మిర్చి చీలికలు
 • 2 రెండు మిర్చి
 • 1 tbsp అల్లం తరుగు
 • 1 tsp జీలకర్ర
 • ½ tsp పసుపు
 • 2 రెబ్బల కరివేపాకు
 • 2 చిటికెళ్ళు ఇంగువా
 • రుచి సరిపడా రాళ్ళ ఉప్పు
 • 2 tbsps కొత్తిమీర తరుగు

Instructions

 • మిక్సీ లో పేస్టు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్ళతో పలుకులేని మెత్తని పేస్టు చేసుకోవాలి
 • మూకుడులో నూనె వేడి చేసి బెండకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి హై-ఫ్లేం మీద ఎర్రగా వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. బెండకాయలు వేగాక తీసి పక్కనుంచుకోండి
 • అదే మూకుడులో ఇంకాస్త నూనె వేడి చేసి అందులో ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోవాలి
 • అందులోనే అల్లం, పసుపు వేసి కరివేపాకు వేసి వేపుకుని ఇంగువ కూడా వేసి వేపుకోవాలి
 • అల్లం వేగాక మెత్తగా రుబ్బుకున్న సెనగపప్పు కొబ్బరి పేస్టు వేసి కొంత పక్కనుంచుకోవాలి
 • సెనగపప్పు ముద్ద వేపి కాసిని నీళ్ళు పోసి ఉడుకుపట్టేదాక మీడియం ఫ్లేం మీద ఉడకనివ్వాలి
 • చిలికిన పెరుగులో సెనగపప్పుముద్ద వేసి బాగా కలిపి మూకుడులో పోసి ½ లీటర్ నీళ్ళు ఉప్పు వేసి గడ్డలు లేకుండా కలుపుకుని సన్నని సెగ మీద ఓ ఉడుకు రానివ్వాలి
 • మజ్జిగ ఉడుకుపట్టాక వేపుకున్న బెండకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి దిమ్పెసుకోవాలి.

Tips

మజ్జిగ చారు చేసే ముందు ఓ సారి కింద టిప్స్ ఫాలో అయి చేయండి:
బెండకాయలు కడిగి తుడిచి తడిలేని కత్తితో అంగుళం ముక్కలు కోసుకుంటే జిగురు తగ్గుతుంది
బెండకాయ ముక్కలు వేడి నూనె లో కాస్త ఉప్పు వేసి ఎక్కువగా కలపకుండా నూనె పట్టించి మూత పెట్టి హై-ఫ్లేం మీద వేపితే చక్కగా జిగురు వదులుతుంది.
పెరుగులో కొబ్బరి పేస్టు కొద్దిగా కలుపుకోవాలి, లేదంటే పెరుగు మజ్జిగలో పోసాక విరిగిపోతుంది
ఈ బెండకాయ మజ్జిగ చారుకి పుల్లని పెరుగు రుచిగా ఉంటుంది. పుల్లని పెరుగు లేని వారు ఆఖరున అర చెక్క నిమ్మరసం పిండుకోండి
మజ్జిగ చారులు కొబ్బరి నూనెతో తాలింపు ప్రేత్యేకమైన రుచినిస్తుంది. ఓ సారి కొబ్బరి నూనె తాలింపు వేసి చుడండి, తప్పక నచ్చుతుంది. నచ్చని వారు వేరుసెనగ నూనె లేదా రిఫైండ్ నూనె తో వేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top