బెండకాయ మసాలా కారం పొడి ఇది పొడి పొడిలాడుతూ అన్నం లో చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మామూలు బెండకాయ వేపుడుకి కాస్త భిన్నంగా ఉంటుంది ఈ వేపుడు. కొన్ని టిప్స్ పాటిస్తే కూర పొడి పొడిగా జిగురు లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో ఉల్లి వెల్లులి లేదు కాబట్టి ఉపవాసలప్పుడు, పండుగలప్పుడు కూడా చేసుకోవచ్చు!

కావలసినవి:

 • లేత బెండకాయ ముక్కలు- ½ కిలో
 • సెనగపిండి- ½ కప్
 • కారం- 1 tbsp
 • ఉప్పు
 • ధనియాల పొడి- 1 tsp
 • గరం మసాలా- ½ tsp
 • సోంపు పొడి- ½ tsp
 • వాము- 1 tsp
 • నూనె- ¼ కప్

విధానం:

Directions

0/0 steps made
 1. సెనగపిండి ని మూకుడు లో వేసి లో-ఫ్లేం మీద మాంచి సువాసన వచ్చేదాకా ఎర్రగా వేపుకోవాలి, ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది. ఎర్రగా వేగి మాంచి సువాసన వచ్చాక దింపి పక్కనుంచుకోండి.
 2. ఇప్పుడు నూనె వేడి అందులో వాము వేసి వేగనివ్వండి, ఆ తరువాత అంగుళం సైజు తరుక్కున్న బెండకాయ ముక్కలు వేసి అందులోనే ఉప్పు, పసుపు వేసి బాగా టాస్ చేసుకోండి.
 3. బెండకాయ ని ఎక్కువాగా గరిటెతో కలిపితే జిగురోస్తుంది.
 4. మధ్య మధ్యలో బెండకాయ ముక్కలని బాగా పైకి కిందికి టాస్ చేసుకోండి. ఇవి మూత పెట్టి ముక్క మగ్గి రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి.
 5. ఇప్పుడు సెనగపిండి లో కారం, ధనియాల పొడి, గరం మసాలా, సోంపు పొడి వేసి బాగా కలిపి వేగిన బెండకాయ ముక్కల్లో కలుపుకోండి.
 6. ఈ పొడి బాగా పట్టించి 4-5 నిమిషాలు మీడియం-ఫ్లేం మీద ఎర్రగా వేగనివ్వండి.
 7. ఎర్రగా వేగాక దిమ్పెసుకోండి.

టిప్స్:

 • బెండకాయలు లేతవి ఉండేలా చూసుకోండి, బెండకాయ ముక్కలు నూనె లో వేసాక కాస్త రంగు మారేంత వరకు ఎక్కువగా గరిటెతో కలపకండి.