బెల్లం అప్పాలు ఇవి ప్రేత్యేకించి ఆంజనేయునికి నివేదిస్తుంటారు! ఇంకా ఇవి ఎ పండుగకైనా చాలా సులభంగా చేసుకోవచ్చు. అలా కాకపోయినా పిండి వంట గా చేసి ఉంచుకోవచ్చు. ఇవి చాలా ఆరోగ్యం కూడా! పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పైగా ఇవి వారం పాటు నిలవుంటాయ్ కూడా..

కావలసినవి:

 • గోధుమ పిండి- ½ కప్
 • బియ్యం పిండి – ½ కప్
 • బెల్లం – కప్
 • నీళ్ళు – కప్
 • యాలకల పొడి- 1 tsp
 • నూనె వేపడానికి
 • నెయ్యి- 1 చెంచా

విధానం:

 1. గోధుమ పిండి, బియ్యం పిండి, యాలకలపొడి కలిపి పక్కనుంచుకోండి.
 2. ఇప్పుదు బెల్లం తరుగు లో నీళ్ళు పోసి ఓ పొంగు రానివ్వండి. పొంగొచ్చాక కలిపి ఉంచుకున్న పిండి కొద్ది కొద్దిగా పోస్తూ మొత్తం పోసి స్టవ్ ఆపెసేయ్యండి.
 3. స్టవ్ ఆపేసి పిండిని గడ్డలు లేకుండా కలిపి పూర్తిగా చల్లారనివ్వండి.
 4. పూర్తిగా చల్లారాక, చేతులకి నెయ్యి రాసుకుని చిన్న చిన్న వడల మాదిరి తట్టుకోండి.
 5. తట్టుకున్న వడలని గాలికి కాసేపు ఆరనివ్వండి.
 6. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనె లో వేసి మంట మీడియం-ఫ్లేం లోకి పెట్టి గరిట పెట్టకుండా ఓ నిమిషం అలా వదిలేయండి. ఆ తరువాత నిదానంగా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకుని తీసి పక్కనుంచుకోండి.
 7. ఇవి కాస్త కరకరలాడేట్టు వేపుకుంటే ఇంకా రుచిగా ఉంటాయ్. రోజులు గడుస్తున్న కొద్ది ఎలాగూ మెత్తబడతాయ్.