బోన్లెస్ చికెన్ దం బిర్యానీ

google ads

బోన్లెస్ చికెన్ దం బిర్యానీ

Author Vismai Food
BONELESS-CHICKEN-DUM-BIRYANI
“బోన్లెస్ చికెన్ దం బిర్యానీ” ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్! నాకు కూడా చాలా ఇష్టం. చిన్నతనం నుండి చాలా ఇష్టంగా తినేవాడిని.ఇది హైదరాబాదీ దం బిర్యానీ కి మల్లె ధం చేస్తారు అంతే.
కానీ దీని వాడే మసాలాల ఘాటు, కారం చాలా ఎక్కువ. పైగా ఇందులో చికెన్ ఫ్రై చేసి ధం చేస్తారు. హైదరాబాదీ చికెన్ ధం బిర్యానీ లో పచ్చి చికెన్ ని మసాలాలతో నానబెట్టి దాన్ని ధం చేస్తారు.
ఆ దం మీద చికెన్ మగ్గిపోతుంది. ఈ బిర్యానీ కి చికెన్ కి మసాలాలు పట్టించి ఫ్రై చేసి ఆ ఫ్రైతో ధం చేస్తారు.ఈ బిర్యానీ రెసిపీ కాస్త జాగ్రత్తగా ఫాలో అయితే బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసేయొచ్చు.
ఈ రెసిపీలో చికెన్ ఉడకలేదు అనే సమస్య ఉండదు. సరైన కొలతలో రైస్ కి నీళ్ళు పోసుకుంటే చాలు. పర్ఫెక్ట్ బిర్యానీ తయారు.చికెన్ వండటానికి ముందు 1 tbsp ఉప్పు వేసిన నీళ్ళలో కడిగిన చికెన్ వేసి గంట పైన నానబెట్టాలి, అప్పుడు చికెన్ సాఫ్ట్ అవుతుంది.
లేదంటే రబ్బర్ లా ఉంటుంది. ఇంకా చికెన్ కోటింగ్ కి చాలా మంది కార్న్ ఫ్లోర్/మైదా కి బదులు ఏమి వాడుకోవచ్చు అని అడుతుంటారు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా బియ్యం పిండి వాడుకోవచ్చు.
కానీ బియ్యం పిండి కోటింగ్ డ్రైగా అవుతుంది, ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది చికెన్. మైదా ఇష్టం లేకపోయినా బియ్యం పిండి అయితే వాడుకోవచ్చు.
సాధారణంగా అందరూ నన్ను అడిగే ప్రశ్న ఏ బిర్యానీ రైస్ మంచిది? నేను బ్రాండ్ కంటే, సంవత్సరం కంటే పాత బాస్మతి బియ్యం వాడుకుంటే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది బిర్యానీ అంటాను! ఇంకా బాస్మతి బియ్యం ఎప్పుడూ ఎసరు మరుగుతుండగా వేయాలి అప్పుడు మెత్తబడదు బియ్యం.
బిర్యానీ రైస్ 60% ఉడికించాలి ధం చేయడానికి, కాని 60% ఎలా తెలుసుకోవాలి అని అడుగుతుంటారు, అన్నం ఉడుకుతుండగా ఓ మెతుకు నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. సగం పైన ఉడికుండాలి, ఇంకా కాస్త పలుకు ఉండాలి అది 60% ఉడకడం అంటే.
బిర్యానీ ఎసరు లో ఉప్పు ఎక్కువగా వేసుకోవాలి లేదంటే బియ్యానికి ఉప్పు పట్టదు, తరువాత ఉప్పు వేయలేము.ఈ బిర్యానీ లో నేను మసాలాలు కాస్త ఎక్కువగా వాడాను కావాలంటే మీకు తగినట్లుగా తగ్గించుకోవచ్చు.
ఈ బిర్యానీ తో చల్లని రైతా చాలా బాగుంటుంది.

Tips

బెస్ట్ బాస్మతి బియ్యం ఎప్పుడూ మాంచి రుచినిస్తుంది.

Ingredients

చికెన్ ఫ్రై కోసం:

 • ½ కిలో బోన్లెస్ చికెన్ (గంట ఉప్పు వేసిన నానబెట్టినది)
 • ఉప్పు- కొద్దిగా
 • 1 tbsp కారం
 • 1 tbsp ధనియాల పొడి
 • 1 tbsp వేయించిన జీలకర్ర పొడి
 • చిటికెడు పసుపు
 • 1 tbsp మైదా
 • 1 tbsp కార్న్ ఫ్లోర్-
 • 1 tbsp నిమ్మరసం
 • ½ tbsp అల్లం వెల్లూలి ముద్ద
 • 2 tbsp నీళ్ళు
 • నూనె వేపుకోడానికి

చికెన్ గ్రేవీ కోసం:

 • 2 tbsp నూనె
 • 1 tbsp నెయ్యి
 • ½ tbsp జీలకర్ర
 • 2 పచ్చిమిర్చి- చీలికలు
 • 3 వెల్లూలి సన్నని తరుగు
 • 2 కరివేపాకు
 • 2 tbsp ఉల్లిపాయ తరుగు-
 • 2 tbsp టమాటో తరుగు-
 • కొత్తిమీర (పుదీనా తరుగు- 2 tbsps)
 • 1 tbsp నిమ్మరసం
 • 1.5 tbsp కారం
 • 1 tbsp ధనియాల పొడి
 • 1 tbsp జీలకర్ర పొడి
 • ½ tbsp గరం మసాలా
 • ½ tbsp అల్లం వెల్లూలి ముద్ద-
 • ½ cup పెరుగు
 • 75 ml నీళ్ళు

బిర్యానీ కోసం:

 • 1.5 cup బాస్మతీ బియ్యం (275gms)
 • 2.5 లీటర్లు నీళ్ళు
 • 3 అనసపువ్వు
 • 3 మరాటి మొగ్గ
 • 1 జాపత్రి-
 • 1 ఇంచ్ దాల్చిన చెక్క
 • 5 లవంగాలు
 • 5 యాలకలు
 • 1 tbsp షాహీ జీరా
 • ½ tbsp అల్లం వెల్లూలి పేస్టు
 • 2 tbsp ఉప్పు
 • పుదీనా
 • 1 tbsp నెయ్యి
 • 2 tbsp నూనె
 • ½ cup నీళ్ళు (150 ml)
 • 2 tbsp వేయించిన ఉల్లిపాయ (ఆప్షనల్)
 • యాలకల పొడి- చిటికెడు (ఆప్షనల్)
 • ¼ cup కొత్తిమీర తరుగు

Instructions

 • గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ కి మసాలాలు అన్నీ బాగా పట్టించండి
 • బాగా వేడెక్కిన నూనె మంట తగ్గించి చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద మాత్రమే ఎర్రగా, క్రిస్పీగా వేపుకుని తెసుకోండి (ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది)
 • పాన్ లో నూనె నెయ్యి వేసి వేడి చేసుకోవాలి
 • తరువాత జీలకర్ర, వెల్లూలి తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసి హై ఫ్లేం మీద వేపుకోవాలి
 • పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ తరుగు, కరివేపాకు తరుగు వేసి వేపుకోవాలి
 • తరువాత టమాటో తరుగు వేసి మెత్తబదేదాక వేపుకోవాలి. లేదా టమాటో కేట్చప్ కూడా 1 tsp వేసుకోవచ్చు
 • ఇప్పుడు అల్లం వెల్లూలి ముద్దా, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేపుకోవాలి
 • ఆ తరువాత మంట పూర్తిగా తగ్గించి చిలికిన పెరుగు వేసి బాగా కలుపుతూ వేపుకోవాలి లేదంటే తరకలుగా మిగిలిపోతుంది
 • పెరుగు మసాలాల్లో బాగా కలిసాక, ఫ్రై చేసిన చికెన్ వేసి హై ఫ్లేం మీద బాగా పట్టించండి
 • తరువాత కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి హై ఫ్లేం మీద గ్రేవీలోంచి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేయాలి
 • నూనె పైకి తేలాక, కొత్తిమీరా, పుదినా తరుగు, కరివేపాకు ఓ రెబ్బ వేసి కలిపి స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండి దింపేసుకోవాలి

బిర్యానీ కోసం:

 • నీళ్ళు మరిగించి ఉన్న మసాలా దినుసులన్నీ ఇంకా ఉప్పు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి హై-ఫ్లేం మీద నీళ్ళని తెర్ల కాగనివ్వాలి
 • నీళ్ళు తెర్లుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి హై ఫ్లేం మీద 60% ఉడకనివ్వాలి. (60% అంటే సగం పైన ఉడికుండాలి ఇంకా కాస్త పలుకుండాలి మెతుకు)
 • కచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో 60% ఉడికిన రైస్ వడకట్టి ఓ పొరగా వేసుకోండి.
 • బియ్యాన్ని హై-ఫ్లేం మీద మరో 3 నిముషాలు ఉడికిస్తే 70% అవుతుంది, దాన్ని 60% ఉడికిన రైస్ మీద వేసుకోండి
 • ఆ పైన ఫ్రై చేసిన చికెన్ వేసుకోండి. నాకు చికెన్ గ్రేవీ డ్రై అవ్వడం వల్ల 50 ml ఎసరు నీళ్ళు పోసి కలిపి వేసుకున్నాను (చికెన్ కి గ్రేవీ ఉంటె బిర్యానీ రుచిగా ఉంటుంది)
 • 2 నిమిషాలు ఉడికిస్తే 80% ఉడికిపోతుంది ఆ రైస్ పల్చని పొరలా వేసుకోండి
 • నెయ్యి లో నూనె వేసి కలిపి బిర్యానీ పైన గిన్నె అంచుల వెంట వేసుకోండి
 • అలాగే ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి(ఆప్షనల్)
 • బియ్యం ఉడకగా ఉన్న ఎసరు నీళ్ళు 125 ml అంటే 1/2 కప్ గిన్నె అంచుల వెంట పోసుకోండి
 • పైన 1/4 tsp యాలకలపొడి చల్లుకోండి ఫ్లేవర్ బాగుంటుంది (ఇది ఆప్షనల్)
 • బిర్యానీని టిష్యూ నాప్కిన్స్, అరటాకు, విస్తరాకు తో ధం చేసుకోండి. లేదా మైదా పిండి తో గిన్నె అంచులని సీల్ చేసి కూడా ధం చేసుకోవచ్చు
 • టిష్యూ నాప్కిన్స్ వాడితే నీళ్ళు చిలకరించి 15 నిమిషాలు ధం చేసుకోవాలి. 8 నిమిషాలు హై ఫ్లేం మీద, 7 నిమిషాలు లో ఫ్లేం మీద తరువాత 15 నిమిషాలు స్టవ్ ఆపేసి ఉంచాలి
 • మొత్తానికి 30 నిమషాల తరువాత తీసి అడుగు నుండి అట్లకాడతో తీసి సర్వ్ చేసుకోండి

Video

బోన్లెస్ చికెన్ దం బిర్యానీ

Author Vismai Food

Ingredients

చికెన్ ఫ్రై కోసం:

 • ½ కిలో బోన్లెస్ చికెన్ గంట ఉప్పు వేసిన నానబెట్టినది
 • ఉప్పు- కొద్దిగా
 • 1 tbsp కారం
 • 1 tbsp ధనియాల పొడి
 • 1 tbsp వేయించిన జీలకర్ర పొడి
 • చిటికెడు పసుపు
 • 1 tbsp మైదా
 • 1 tbsp కార్న్ ఫ్లోర్-
 • 1 tbsp నిమ్మరసం
 • ½ tbsp అల్లం వెల్లూలి ముద్ద
 • 2 tbsp నీళ్ళు
 • నూనె వేపుకోడానికి

చికెన్ గ్రేవీ కోసం:

 • 2 tbsp నూనె
 • 1 tbsp నెయ్యి
 • ½ tbsp జీలకర్ర
 • 2 పచ్చిమిర్చి- చీలికలు
 • 3 వెల్లూలి సన్నని తరుగు
 • 2 కరివేపాకు
 • 2 tbsp ఉల్లిపాయ తరుగు-
 • 2 tbsp టమాటో తరుగు-
 • కొత్తిమీర పుదీనా తరుగు- 2 tbsps
 • 1 tbsp నిమ్మరసం
 • 1.5 tbsp కారం
 • 1 tbsp ధనియాల పొడి
 • 1 tbsp జీలకర్ర పొడి
 • ½ tbsp గరం మసాలా
 • ½ tbsp అల్లం వెల్లూలి ముద్ద-
 • ½ cup పెరుగు
 • 75 ml నీళ్ళు

బిర్యానీ కోసం:

 • 1.5 cup బాస్మతీ బియ్యం 275gms
 • 2.5 లీటర్లు నీళ్ళు
 • 3 అనసపువ్వు
 • 3 మరాటి మొగ్గ
 • 1 జాపత్రి-
 • 1 ఇంచ్ దాల్చిన చెక్క
 • 5 లవంగాలు
 • 5 యాలకలు
 • 1 tbsp షాహీ జీరా
 • ½ tbsp అల్లం వెల్లూలి పేస్టు
 • 2 tbsp ఉప్పు
 • పుదీనా
 • 1 tbsp నెయ్యి
 • 2 tbsp నూనె
 • ½ cup నీళ్ళు 150 ml
 • 2 tbsp వేయించిన ఉల్లిపాయ ఆప్షనల్
 • యాలకల పొడి- చిటికెడు ఆప్షనల్
 • ¼ cup కొత్తిమీర తరుగు

Instructions

 • గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ కి మసాలాలు అన్నీ బాగా పట్టించండి
 • బాగా వేడెక్కిన నూనె మంట తగ్గించి చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద మాత్రమే ఎర్రగా, క్రిస్పీగా వేపుకుని తెసుకోండి (ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది)
 • పాన్ లో నూనె నెయ్యి వేసి వేడి చేసుకోవాలి
 • తరువాత జీలకర్ర, వెల్లూలి తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసి హై ఫ్లేం మీద వేపుకోవాలి
 • పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ తరుగు, కరివేపాకు తరుగు వేసి వేపుకోవాలి
 • తరువాత టమాటో తరుగు వేసి మెత్తబదేదాక వేపుకోవాలి. లేదా టమాటో కేట్చప్ కూడా 1 tsp వేసుకోవచ్చు
 • ఇప్పుడు అల్లం వెల్లూలి ముద్దా, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేపుకోవాలి
 • ఆ తరువాత మంట పూర్తిగా తగ్గించి చిలికిన పెరుగు వేసి బాగా కలుపుతూ వేపుకోవాలి లేదంటే తరకలుగా మిగిలిపోతుంది
 • పెరుగు మసాలాల్లో బాగా కలిసాక, ఫ్రై చేసిన చికెన్ వేసి హై ఫ్లేం మీద బాగా పట్టించండి
 • తరువాత కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి హై ఫ్లేం మీద గ్రేవీలోంచి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేయాలి
 • నూనె పైకి తేలాక, కొత్తిమీరా, పుదినా తరుగు, కరివేపాకు ఓ రెబ్బ వేసి కలిపి స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండి దింపేసుకోవాలి

బిర్యానీ కోసం:

 • నీళ్ళు మరిగించి ఉన్న మసాలా దినుసులన్నీ ఇంకా ఉప్పు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి హై-ఫ్లేం మీద నీళ్ళని తెర్ల కాగనివ్వాలి
 • నీళ్ళు తెర్లుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి హై ఫ్లేం మీద 60% ఉడకనివ్వాలి. (60% అంటే సగం పైన ఉడికుండాలి ఇంకా కాస్త పలుకుండాలి మెతుకు)
 • కచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో 60% ఉడికిన రైస్ వడకట్టి ఓ పొరగా వేసుకోండి.
 • బియ్యాన్ని హై-ఫ్లేం మీద మరో 3 నిముషాలు ఉడికిస్తే 70% అవుతుంది, దాన్ని 60% ఉడికిన రైస్ మీద వేసుకోండి
 • ఆ పైన ఫ్రై చేసిన చికెన్ వేసుకోండి. నాకు చికెన్ గ్రేవీ డ్రై అవ్వడం వల్ల 50 ml ఎసరు నీళ్ళు పోసి కలిపి వేసుకున్నాను (చికెన్ కి గ్రేవీ ఉంటె బిర్యానీ రుచిగా ఉంటుంది)
 • 2 నిమిషాలు ఉడికిస్తే 80% ఉడికిపోతుంది ఆ రైస్ పల్చని పొరలా వేసుకోండి
 • నెయ్యి లో నూనె వేసి కలిపి బిర్యానీ పైన గిన్నె అంచుల వెంట వేసుకోండి
 • అలాగే ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి(ఆప్షనల్)
 • బియ్యం ఉడకగా ఉన్న ఎసరు నీళ్ళు 125 ml అంటే 1/2 కప్ గిన్నె అంచుల వెంట పోసుకోండి
 • పైన 1/4 tsp యాలకలపొడి చల్లుకోండి ఫ్లేవర్ బాగుంటుంది (ఇది ఆప్షనల్)
 • బిర్యానీని టిష్యూ నాప్కిన్స్, అరటాకు, విస్తరాకు తో ధం చేసుకోండి. లేదా మైదా పిండి తో గిన్నె అంచులని సీల్ చేసి కూడా ధం చేసుకోవచ్చు
 • టిష్యూ నాప్కిన్స్ వాడితే నీళ్ళు చిలకరించి 15 నిమిషాలు ధం చేసుకోవాలి. 8 నిమిషాలు హై ఫ్లేం మీద, 7 నిమిషాలు లో ఫ్లేం మీద తరువాత 15 నిమిషాలు స్టవ్ ఆపేసి ఉంచాలి
 • మొత్తానికి 30 నిమషాల తరువాత తీసి అడుగు నుండి అట్లకాడతో తీసి సర్వ్ చేసుకోండి

Tips

బెస్ట్ బాస్మతి బియ్యం ఎప్పుడూ మాంచి రుచినిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top