హైదరాబాద్ ప్రేత్యేకమైన వంటకం మటన్ కా దాల్చా. చాలా రుచిగా ఉంటుంది. నిజాం వంటకాలు తెలుగు వారి వంటకాలతో జత కలిసి అవిర్భావించిందే ఈ మటన్ కా దాల్చా. ప్రేత్యేకించి ముస్లిం పెళ్ళిళ్ళలో బిర్యానీ తో పాటు ఇచ్చే దాల్చా ఇంకా బాగుంటుంది రుచి. దానికి కొన్ని విధానాలు ఉన్నాయ్. అవి పాటిస్తే కచ్చితంగా అదే రుచి గ్యారంటీ. ఇది ముస్లింల పెళ్ళిళ్ళతో పాటు రంజాన్ మాసం లో ప్రేత్యేకించి చేస్తారు. ఇది వేడి వేడి అన్నం లోకి, బాగారన్నం లోకి, చపాతీ, రోటి, పరాట ఇలా ఎందులోకైన చాలా రుచిగా ఉంటుంది.

కావలసినవి:

 • లేత మటన్- 300 gms
 • కందిపప్పు- 1/2 కప్( 1 గంట ననబెట్టినది)
 • సెనగపప్పు- 1/2 కప్ ( 1 గంట నానా బెట్టినది)
 • సొరకాయ ముక్కలు – 1 పెద్ద కప్
 • నూనె 1/2 కప్
 • ఉల్లిపాయ- 1 పెద్దది
 • పచ్చి మిర్చి- 6-7
 • కరివేపాకు- రెండు రెబ్బలు
 • అల్లం వెల్లూలి పేస్టు- 1 tsp
 • కారం – 2 tsps
 • వేయించిన జీలకర్ర పొడి- 1 tsp
 • పసుపు- 1/2 tsp
 • బిర్యానీ ఆకు- 1
 • లవంగాలు- 5
 • దాల్చిన చెక్క- 1 ఇంచ్
 • యలకలు- 2
 • చింతపండు- 50gms
 • నీళ్ళు- 1.750ml

విధానం:

Directions

0/0 steps made
 1. కుక్కర్ లో పావు కప్ నూనె వేడి చేసి అందులో చెక్కా, లవంగా, బిరియాని ఆకు, యాలకలు వేసి వేయించి ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోండి, ఎర్రగా వేపుకుంటే రుచి.
 2. ఇప్పుడు అల్లం వెల్లూలి ముద్దా వేసి పచ్చి వాసన పోయే దాక వేపుకోండి
 3. ఇప్పుడు ఉప్పు నీటి లో నానా బెట్టిన లేత మటన్ వేసి హై ఫ్లేం మీద 3-4 నిమిషాలు ఫ్రీ చేసుకోండి
 4. ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి
 5. ఇప్పుడు 750ml నీళ్ళు పోసుకుని బాగా కలుపుకుని లో-ఫ్లేం మీద 5-6 విసిల్స్ రానివ్వండి. విసిల్స్ లెక్క కంటే కూడా మటన్ మెత్తగా ఉడకాలి అని గుర్తుకుంచుకోండి
 6. మటన్ మెత్తగా ఉడికాక నానబెట్టుకున్న కందిపప్పు, సెనగపప్పు వేసి అర లీటర్ నీళ్ళు పోసుకుని కుక్కర్ మూతపెట్టి మీడియం-ఫ్లేం మీద 3 విసిల్స్ రానివ్వండి
 7. ఆవిరి పోయాక బాగా కలుపుకోండి, పప్పుగుత్తితో ఎనపకండి ఎనిపితే చిదురవుతుంది మటన్
 8. ఇప్పుడు మరో పాత్రా లో 1/4 కప్ నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి
 9. ఇప్పుడు లేత సొరకాయ ముక్కలు వేసి 3-4 నిమిషాలు మగ్గనివ్వండి, ఆ తరువాత పచ్చిమిర్చి చీలికలు, రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని కలుపుకుని, సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి
 10. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుని 2-3 నిమిషాలు బాగా ఉడికి పొంగురానివ్వండి
 11. పొంగొచ్చాక మాత్రమే ఉడికించి ఉంచుకున్న పప్పు వేసి, 100 ml నీళ్ళు పోసి 10-15 నిమిషాల పాటు లో ఫ్లేం మీద మరగనివ్వండి
 12. మరుగుతున్నప్పుడు పైన ఓ తేట ఏర్పడుతుంది దాన్ని తీసెయ్యండి. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.
 13. ఇదే కొలతలతో చేస్తే ఎప్పుడు చేసినా మంచి రుచికరమైన దాల్చా చేస్తారు

టిప్స్:

 • పైన ఇచ్చిన కొలతలు అన్నీ రెసిపీ మొత్తానికి కలిపి ఇచ్చాను. నూనే, కారం, నీళ్ళు ఇలాంటివి తయారీ విధానం లో చెప్పిన విధంగా వాడుకోండి
 • మటన్ లేతది అయితేనే దాల్చాకి మంచి రుచి, అప్పుడే మటన్ మెత్తగా ఉడుకుతుంది
 • పప్పులు కచ్చితంగా గంటకు పైగా ననబెదితేనే మెత్తగా ఉడుకుతుంది
 • పప్పు ఉడికాక ఎనిపితే మటన్ కూడా చిదురవుతుంది, నానబెట్టిన పప్పు వండితే మెత్తగా వెన్నలా ఉడికిపోతుంది పప్పు
 • పప్పు ని విడిగా ఉడికించి మటన్ లో కలిపితే అంత రుచి రాదు దాల్చకి