“మలై కుల్ఫీ” ఇది పంజాబీ రెసిపీ, రెసిపీ వారిదైన యావత్ దేశంలో దేన్నీ ఇష్టపడని వారుంటారా అసలు! అవును మరి! అంత బాగుంటుంది దీని రుచి. ఇప్పుడు ఈ కుల్ఫీల్లోనే బోలెడన్ని ఫ్లేవర్స్ వచ్చాయి, ఎన్నొచ్చినా ఎవర్ గ్రీన్ మలై కుల్ఫీ ఎవర్ గ్రీనే. మలై కుల్ఫీ అందరు చేస్తారు, సులభమే… కాని కొన్ని పద్ధతులు, విధానాలు ఫాలో అయితేనే సరైన సూపర్ సాఫ్ట్ కుల్ఫీ వస్తుంది.

కావలసినవి:

 • చిక్కటి గేదె పాలు- 1 లీటర్
 • పంచదార- 50 gms
 • యలకల పొడి- ½ tsp
 • ఫ్రెష్ క్రీం- ¼ కప్
 • కుంకుమ పువ్వు- 1 చిటికెడు
 • పిస్తా పప్పులు- 6-7 సన్నగా తరుక్కునవి
 • బాదాం -4-5 సన్నగా తరుక్కున్నవి

విధానం:

Directions

0/0 steps made
 1. కచ్చితంగా అడుగు మందంగా ఉన్న మూకుడు లోనే ఈ రెసిపీ చక్కగా వస్తుంది.
 2. పాలని పోసుకుని అందులో పంచదార వేసి పంచదార కరిగి, మీడియం-ఫ్లేం మీద 2-3 పొంగులు రానివ్వండి .
 3. ఆ తరువాత పాలని లో ఫ్లేం మీద పావు లీటర్ అయ్యేదాకా మరగ కాచండి .
 4. ఈ పాలు మరుగుతున్నప్పుడు అంచుల వెంట ఏర్పడే మీగాదని తీస్తూ పాలల్లో వేస్తూ ఉండాలి, అప్పుడే ఈ కుల్ఫీ కి రుచి .
 5. ఈ పాలని ప్రతీ 30 సెకన్లకి ఓ సారి అడుగునుండి, పక్కలవెంట కలుపుతూనే ఉండాలి.
 6. అస్సలు హై-ఫ్లేం మీద పాలని మరిగించ కూడదు.
 7. పాలు పావు లీటర్ అయ్యాక కుంకుమ పువ్వు 2 tbsps నెలలలో నానబెట్టిన నీళ్ళు, కుంకుమ పువ్వు రెండూ వేసుకుని, పాలని మరో 5 నిమిషాల పాటు మరగనివ్వండి
 8. పాలు బాగా చిక్కగా అవుతాయి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి యాలకలపొడి, పిస్తా, జీడిపప్పు, ఫ్రెష్ క్రీం వేసి బాగా కలుపుకుని పూర్తిగా చల్లారనివ్వండి
 9. పూర్తిగా చల్లారక కుల్ఫీ మౌల్డ్స్ లో పోసి కనీసం 8 గంటలు, లేదా రాత్రంతా ఫ్రిజ్ లో మాక్సిమం టెంపరేచర్ మీద ఉంచండి
 10. 8 గంటల తరువాత తీసి ముందు నీళ్ళలో 15 సెకన్లు ఉంచి తరువాత 2 చేతుల మధ్య రోల్ చేస్తే చక్కగా మౌల్ద్ ని వీడి వస్తుంది.
 11. ఈ కుల్ఫీలు మీరు ఓ సారి చేసుకుని ఫ్రిజ్ లో కనీసం నెల పైన నిలవుంచుకోవచ్చు.

Tips:

 • చిక్కటి గేదె పాలు అయితేనే మీగడ ఎక్కువగా వస్తుంది, ఈ కుల్ఫీకి అదే రుచి
 • అడుగు మందంగా ఉన్న గిన్నె వాడకపోతే కచ్చితంగా పాలు అడుగంటుతాయ్, రెసిపీ అంతా పాడవుతుంది
 • పాలని ప్రతీ 30 సెకన్ల కి అడుగు నుండి బాగా కలుపుతూ ఉండాలి, అంచుల వెంట ఏర్పడే మీగడని తీస్తూ పాలల్లో వేస్తూ లో-ఫ్లేం మీద మరిగించాలి. అప్పుడే రుచి.
 • ఫ్రెష్ క్రీం వేస్తేనే కుల్ఫీకి రుచి, సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది కుల్ఫీ