“మాంగో కోకోనట్ డిలైట్” మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే సమ్మర్ డ్రింక్. మా ఇంట్లో దాదాపుగా సమ్మర్ అంతా తాగుతూనే ఉంటాము. ఇది పిల్లలుకూడా చాలా ఇష్టంగా తాగుతారు.ఇందులో నేను వాడిన పదార్ధాలన్నీ అందరికి అందుబాటులో ఉండేవే! నేను ఈ డ్రింక్ ముంబాయ్ తాజ్ హోటల్ లో భుఫే లో తాగాను. చాలా నచ్చేసింది, వెంటనే చెఫ్ ని అడిగి తెలుసుకున్నాను.

అయితే నేను తాగిన డ్రింక్ లో మాత్రం వాళ్ళు మాంగో ఎమల్షన్ వాడారు. అంటే ఎస్సెన్స్ ఇంకా కలర్ కలిపి ఉంటుంది. మనం ఎంత కమ్మని సువాసనతో ఉండే మామిడి పండు వాడినా జ్యూస్ లో మామిడి ఫ్లేవర్, ఎర్రటి మామిడి రంగు రెండూ అంత బాగా రావు. అందుకే హోటల్స్ లో 2-3 బొట్లు ఎమల్షన్ వేస్తారు.

నేను ఈ రెసిపీ లో ఎమల్షన్ కాని ఎస్సెన్స్ కాని వాడలేదు, ఇష్టమున్న వాళ్ళు  మాంగో ఎమల్షన్ వేసుకోండి చాలా మంచి  కలర్ ఫ్లేవర్ వస్తుంది జ్యూస్ కి. ఎసెన్స్ వేసుకుంటే ఫ్లేవర్ ఇస్తుంది కాని ఎర్రటి రంగు రాదు. ఎసెన్స్, ఎమల్షన్ రెండూ online లో దొరుకుతాయ్.

ఈ రెసిపీ లో నేను పంచదార 2 tbsps స్పూన్స్ వాడను ఈ పంచదార మామిడిపండు తీపి మీద ఆధారపడి ఉంటుంది. మీకు నచ్చితే పంచదారకి బదులు పూర్తిగా తేనే కూడా వాడుకోవచ్చు.

ఇంకా నేను చల్లని ఫ్రిజ్ లో ఉంచిన మామిడి పండ్లు వాడను దేని వల్ల జ్యూస్ లో ప్రేత్యేకంగా నీళ్ళు ఐస్ వేసి పలుచన చేయక్కర్లేదు, అలాగే పాలు కూడా కాచి చల్లార్చి ఫ్రిజ్ లో ఉంచినవి వాడను దీని వల్ల కూడా జ్యూస్ లో ప్రత్యేకంగా నీళ్ళు అవసరం పడదు. ఒక్కో సరి జ్యూస్ మరీ చిక్కగా అనిపిస్తే చల్లని నీళ్ళు పోసి అడ్జస్ట్ చేసుకోండి.

కావలసినవి:

  • తియ్యటి మామిడి పండ్ల ముక్కలు- 2 కప్స్
  • చల్లని పాలు- 1 కప్
  • లేత కొబ్బరి బొండం లోని కొబ్బరి – 1/2 కప్
  • పంచదార/తేనే- 2-4 tbsps
  • సబ్జా – 1/4 కప్(30 నిమిషాలు నానబెట్టినది)

విధానం:

Directions

0/0 steps made
  1. అన్నీ జ్యుసర్ జార్ లో వేసి హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోండి, సర్వ్ చేసే ముందు సబ్జా గింజలు పైన వేసుకుని సర్వ్ చేసుకోండి

టిప్స్:

  • పాలు, మామిడి ముక్కలు చల్లనివి వాడుకుంటే ప్రేత్యేకంగా ఐస్ వేయనక్కర్లేదు
  • ఒకవేళ మరీ చిక్కగా అనిపిస్తే కాసిని చల్లని నీళ్ళు పోసుకోండి
  • మాంగో ఎస్సెన్స్ వాడితే చాలా బాగుంటుంది ఫ్లేవర్