మామిడికాయ పప్పు

google ads

మామిడికాయ పప్పు

Author Vismai Food
MANGO-PAPPU-1280x800
“మామిడికాయ పప్పు” ఇది తెలుగు వారి ప్రేత్యేకమైన రెసిపీ. వేసవి కాలం లో దాదాపుగా అందరిళ్ళలో చేస్తూనే ఉంటారు.
చాలా మందికి తెలిసిన రెసిపీనే. కానీ ఈ రెసిపీ నా పద్ధతిలో చాలా సులభంగా అయిపోతుంది. చాలా మందిపప్పు తో పులుపు ఉడకదని మామిడిని విడిగా ఉడికించి పప్పులో కలుపుతారు, ఆ పద్ధతి లోనూ చేయొచ్చు,
కానీ ఈ పద్ధతి సులభంగా ఉంటుంది, కొన్ని కొలతలు మార్పు చేస్తే చాలు. పర్ఫెక్ట్ గా ఎంతో రుచిగా ఉంటుంది పప్పు. ఈ పప్పు వేడి అన్నం, రొట్టేల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

Tips

మామిడికాయ పులుపు ని బట్టి కారంగల మిరపకాయలు, ఉప్పు తో సరిచేసుకోవాలి
మామిడికాయ కందిపప్పు తో ఉప్పు వేసి ఉడికిస్తే పప్పు ఉడకదు.
ఈ పప్పు కి నీళ్ళు కప్ కి 2.5 కప్స్
ఈ పప్పుకి ఎండు కారం కంటే పచ్చిమిర్చి కారం చాలా రుచిగా ఉంటుంది
ఉల్లి, వెల్లూలి ఈ పప్పు కి వాడరు, కొందరు వాడతారు మీకు నచ్చితే తాలింపు తో పాటు వేపుకోవచ్చు

Ingredients

 • 1 పుల్లని పచ్చి మామిడి
 • ½ tbsp పసుపు
 • 1.5 cup నీళ్ళు

తాలింపు:

 • 2 tbsp నూనె-
 • 1 tbsp ఆవాలు
 • 1 tbsp మినపప్పు
 • 4 కారం పచ్చి మిరపకాయలు
 • 4 కారంఎండు మిర్చి
 • 2 చిటికేళ్ళు ఇంగువ-
 • కరివేపాకు- 1 రెబ్బ
 • ఉప్పు

Instructions

 • కంది పప్పుని మూకుడులో వేసి లో-ఫ్లేం మీద మాంచి సువాసన వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి, ఆ ఆతరువాత బాగా కడిగి ఉంచుకోవాలి
 • కుక్కర్ లో కందిపప్పు, పసుపు, చెక్కుతీసి రేకులుగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు, నీళ్ళు పోసి కేవలం మీడియం ఫ్లేం మీద 5-6 విసిల్స్ రానివ్వాలి
 • 6 విసిల్స్ తరువాత పప్పుగుత్తితో మెత్తగా ఎనుపుకోండి
 • తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు సామానంతా వేసి వేపుకుని పప్పు వేసి 2 నిమిషాలు ఉడికించి, ఆఖరున ఉప్పు వేసి కలిపి దిమ్పెసుకోవాలి

Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top