మామిడికాయ బొప్పాయ్ సాలడ్

google ads

మామిడికాయ బొప్పాయ్ సాలడ్

Author Vismai Food
mamidi-poppay-salad
ఈ సాలడ్ చాలా త్వరగా అంటే జస్ట్ 3-4 నిమిషాల్లో తయారైపోతుంది. అంటే 3-4 నిమిషాల్లో బోలెడంత ఆరోగ్యాన్నిచ్చే రెసిపీ రెడీ. ఇది నేను హైదరాబాద్ లోని పార్క్ హోటల్ లో టేస్ట్ చేసాను. చాలా నచ్చేసింది.
అది అక్కడికక్కడే తయారు చేసి సర్వ్ చేస్తున్న సలాడ్ అవ్వడం వల్ల నా ముందే చేసారు, అలా నాకు గుర్తుండి పోయింది ఈ సాలడ్.ఆరోగ్యంగా తినడం అంటే రుచి లేని చప్పటి ఫుడ్ తినడం అనే అపోహ ఉంటుంది.
కానీ చేసే తీరు, వేసే పదార్ధాలతో ఎంతో రుచిగా చేయొచ్చు, అనే మాటకి ఈ రెసిపీ ఓ ఉదాహరణ అంటాను నేను. చాలా రుచిగా ఉండడమే కాదు, పొట్టని శుభ్రపరుస్తుంది.ఇందులో వాడిన పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ముఖ్యం గా పాలిచ్చే తల్లులకి, హార్మోన్ల ఇబ్బంది ఉన్నవారు తరచూ పచ్చి బొప్పాయి కూర, పచ్చడి ఇలా సలాడ్లు తింటుంటే ఎంతో గుణం కనిపిస్తుంది.
పచ్చిబొప్పాయ్ వాడకం ఈ మధ్య కాస్త తగ్గింది, కాని వెనుకటికి మనం చాలా ఎక్కువగా తినేవాళ్ళం. దీనితో సొరకాయ, దోసకాయ మాదిరిగా పప్పు, పచ్చడి, ఇగురు ఇలా ఏదైనా చేసుకోవచ్చు.
ఈ సాలడ్ డైటింగ్ లో ఉన్న వారు రాత్రుళ్ళు భోజనం అంటే నా ఉద్దేశం వండిన ఆహారం మానేసి ఇలాంటి హేల్తీ సలాడ్స్ తింటే చాలా త్వరగా బరువుతగ్గుతారు, అది కూడా ఆరోగ్యంగా!

Tips

మామిడికాయ పులుపుని బట్టి బొప్పాయ్ అడ్జస్ట్ చేసుకోవాలి
పచ్చిమిర్చి సన్నని తరుగు ఉంటె చాలా బాగుంటుంది

Ingredients

 • 1 పచ్చి మామిడికాయ (టెన్నిస్ బంతి సైజు)
 • పచ్చి బొప్పాయ్- మామిడికాయకి రెండింతలు ఉండాలి
 • 1 మీడియం కారంగల పచ్చిమిర్చి (సన్నని తురుము)
 • 2 tbsp కేరట్ తురుము
 • 1 tbsp కొత్తిమీర
 • 1 పచ్చిమిర్చి (మీడియం కారం గలది- మధ్యకి చీరి సన్నగా తరిగినది)
 • ¼ tbsp నల్ల నువ్వులు
 • కారం-చిటికెడు

సలాడ్ డ్రస్సింగ్ కోసం:

 • ఉప్పు
 • 1 tbsp సలాడ్ ఆయిల్/ఆలివ్ ఆయిల్
 • 1 tbsp నిమ్మరసం
 • 1 tbsp పంచదార
 • ½ tbsp నల్ల మిరియాల పొడి-

Instructions

 • మామిడికాయ చెక్కు తీసి మీడియం సైజు గ్రేటర్ తో తురుముకోవాలి
 • అలాగే పచ్చి బొప్పాయ్ కూడా చెక్కు తీసి లోపలి గింజలు తీసేసి మీడియం సైజు వైపు తురుముకోవాలి, అలాగే చిన్న కేరట్ ముక్క.
 • ఇప్పుడు సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఉన్న పదార్ధాలన్నీ వేసి కరిగించి అందులో మామిడి, బొప్పాయ్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి తురుము వేసి డ్రెస్సింగ్ ని బాగా పట్టించండి
 • ఆ తరువాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చుట్టూ కేరట్ తురుము వేసి పైన నల్ల నువ్వులు చిటికెడు కారం చల్లి సర్వ్ చేసుకోండి

Video

మామిడికాయ బొప్పాయ్ సాలడ్

Author Vismai Food

Ingredients

 • 1 పచ్చి మామిడికాయ టెన్నిస్ బంతి సైజు
 • పచ్చి బొప్పాయ్- మామిడికాయకి రెండింతలు ఉండాలి
 • 1 మీడియం కారంగల పచ్చిమిర్చి సన్నని తురుము
 • 2 tbsp కేరట్ తురుము
 • 1 tbsp కొత్తిమీర
 • 1 పచ్చిమిర్చి మీడియం కారం గలది- మధ్యకి చీరి సన్నగా తరిగినది
 • ¼ tbsp నల్ల నువ్వులు
 • కారం-చిటికెడు

సలాడ్ డ్రస్సింగ్ కోసం:

 • ఉప్పు
 • 1 tbsp సలాడ్ ఆయిల్/ఆలివ్ ఆయిల్
 • 1 tbsp నిమ్మరసం
 • 1 tbsp పంచదార
 • ½ tbsp నల్ల మిరియాల పొడి-

Instructions

 • మామిడికాయ చెక్కు తీసి మీడియం సైజు గ్రేటర్ తో తురుముకోవాలి
 • అలాగే పచ్చి బొప్పాయ్ కూడా చెక్కు తీసి లోపలి గింజలు తీసేసి మీడియం సైజు వైపు తురుముకోవాలి, అలాగే చిన్న కేరట్ ముక్క.
 • ఇప్పుడు సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఉన్న పదార్ధాలన్నీ వేసి కరిగించి అందులో మామిడి, బొప్పాయ్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి తురుము వేసి డ్రెస్సింగ్ ని బాగా పట్టించండి
 • ఆ తరువాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చుట్టూ కేరట్ తురుము వేసి పైన నల్ల నువ్వులు చిటికెడు కారం చల్లి సర్వ్ చేసుకోండి

Tips

మామిడికాయ పులుపుని బట్టి బొప్పాయ్ అడ్జస్ట్ చేసుకోవాలి
పచ్చిమిర్చి సన్నని తరుగు ఉంటె చాలా బాగుంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top