మిక్స్డ్ ఫ్రూట్ హల్వా

google ads

మిక్స్డ్ ఫ్రూట్ హల్వా

Author Vismai Food
Cuisine Indian
mixed fruit halwa
హల్వాలు చాలా రాకలున్నాయ్, కానీ కమ్మని ఫ్రూటీ ఫ్లేవర్ తో ఉండే బెస్ట్ హల్వా “మిక్స్డ్ ఫ్రూట్ హల్వా”. ఇది రకరకాలైన తాజా ఫ్రూట్స్ తో ఉండే హల్వా! ఎప్పుడూ తినే స్వీట్స్ కాకుండా ఏదైనా కొత్తగా తినాలనుకుంటే ఇది ట్రై చేయండి.
తక్కువ టైం లో అయిపోతుంది, బెస్ట్ గా ఉంటుంది టేస్ట్.ఈ హల్వా సాధారణంగా చేసుకునే గోధుమ పాలు, కార్న్ ఫ్లోర్ వేసి చేసే హల్వా కాదు. ఇది రుచి, రూపం అన్నీ భిన్నమే! ఇందులో నేను బొప్పాయ్, దానిమ్మ, ఆపిల్ ఇలాంటి ఫ్రూట్స్ వాడి చేసాను.
ఇంకా డ్రై ఫ్రూట్స్ తో.ఈ హల్వా లో కొద్దిగా బొంబాయ్ రవ్వ వాడాను. సాధారణంగా రవ్వని ఉడికించడానికి నీళ్ళు పోయాలి ఇందులో బొప్పాయ్ పేస్టు తోనే మగ్గిపోతుంది నెయ్యి లో వేగిన రవ్వ
. నీళ్ళ అవసరం లేదు.హల్వా అంటేనే ఫ్లేవర్ కోసం యాలకలపొడి లేదా మరింకేదైనా వేస్తాం, కానీ దీనికి యాలకల పొడి వేయకూడదు. వేస్తే తాజా పండ్లకి ఉండే కమ్మని వాసన పోతుంది.
హల్వా చేసేప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు:
అందరికి ఇంకేమైనా పండ్లు వాడుకోవచ్చా? అనే ఆలోచన ఐడియాలు బోలేడోస్తాయ్. నిజమే… వాడుకోవచ్చు. కానీ, వాడుతున్న ప్రతీ పండుతో రుచి మారిపోతుంటుంది, దాన్ని బాలన్స్ చేయడం అవసరం. కొన్ని పండ్లు మరో పండు కాంబినేషన్ రుచిగా ఉండదు.
నేను బేస్ గా తియ్యని పండిన బొప్పాయి పేస్టు వాడను. దీని వల్ల ఎర్రటి రంగు రుచి ఉంటుందని. మీరు కావాలంటే మామిడి, అరటిపండు, కర్బూజా, ఆపిల్, సపోటా ఇలా ఏదైనా గుజ్జుతో ఉండే పండు వాడుకోవచ్చు. లేదా పండు ని గుజ్జుగా చేసి కూడా వాడుకోవచ్చు.
ఏ పండు వేసిన దానితో మరో పండు రుచి పెంచేదిగా ఉండడం అవసరం. పండ్లు ఎక్కువగా వేసినా ఏ పండు రుచి, సువాసన సరిగా తెలియకపోగా గొప్ప రుచిగా అనిపించదు కూడా.
హల్వాకి నిమ్మ జాతి పండు మాత్రం వాడకండి. వాడాలంటే సరైన మోతాదు అవసరం.
పంచదార కచ్చితమైన కొలత చెప్పడం కష్టం. పండ్ల తీపిని బట్టి పంచదార అడ్జస్ట్ చేసుకోవాలి.
దానిమ్మ గింజలు పొయ్యి మీద నుండి దింపి వేసుకోవాలి, లేదంటే దానిమ్మ గింజలకుండే ఆ క్రంచ్ మిస్ అవుతుంది, వేడి మీద మగ్గితే.
ఆపిల్ పండు ముక్కలు కూడా హల్వా లో వేసి 2-3 నిమిషాలు మగ్గించి దింపేయాలి, లేదంటే బొప్పాయ్ లో కలిపి పోయి ఏ పండు రుచి నోటికి అందదు, తెలియదు. ఆపిల్ ముక్కలు చిన్నవిగా ఉండేలా చూసుకోండి.
పైనాపిల్ వాడుకోదలిస్తే నెయ్యిలో రవ్వ తో పాటు పైనాపిల్ సన్నని ముక్కలు వేసి కలిపి వేపుకోవాలి. నచ్చితే ఆఖరున 2-3 బొట్లు పైనాపిల్ ఎసెన్స్ 3-4 బొట్లు అయినా వేసుకోవచ్చు. పైనాపిల్ ముక్కలు వేయకుండా.
ఈ రెసిపీని నేను ఎన్నో సార్లు మా కిచెన్ లో ట్రై చేసి ఫ్లేవర్స్ ని బాలెన్స్ చేస్తూ సెట్ చేసిన రెసిపీ. సో, దీని రుచి విషయంలో నేను కచ్చితమైన గారంటీ ఇవ్వగలను.
మరింకేదైనా పండ్లు వాడుకోదలిస్తే దాని రుచిని బాలన్స్ చేయడం తో పాటు, కాంబినేషన్స్ కూడా దృష్టిలో ఉంచుకుని వేసుకోవాలి.

Ingredients

కావలసినవి:

 • ¾ cup పండిన బొప్పాయ్ పేస్టు
 • 1 cup తియ్యని ఆపిల్ ముక్కలు
 • 2 tbsp దానిమ్మ గింజలు
 • ¼ cup జీడిపప్పు
 • ¼ cup కిస్మిస్
 • ¼ cup బొంబాయ్ రవ్వ
 • 4 tbsp నెయ్యి

Instructions

 • 2 tbsps నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు కిస్మిస్స్ వేసి ఎర్రగా వేపి పక్కలు తీసుకోండి.
  Mixed fruit halwa 1
 • అదే మూకుడు లో మరో 2 tbsps నెయ్యి వేసి కరిగించి అందులు రవ్వ వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా వేపుకోవాలి. రవ్వ ఎర్రగా వేగితే జీడిపప్పు వేగిన సువాసన వస్తుంది.
  Mixed fruit halwa 2
 • రవ్వ వేగాక పండిన బొప్పాయ్ పేస్టు వేసి నెయ్యి పైకి తేలేదాకా మీడియం ఫ్లేం మీద మగ్గనివ్వాలి.
  Mixed fruit halwa 3
 • నెయ్యి పైకి తేలాక పంచదార వేసి కరిగించాలి.
  Mixed fruit halwa 4
 • పంచదార కరిగాక అందులో ఆపిల్ ముక్కలు వేసి 2-3 నిమిషాలు మగ్గనిచ్చి దిమ్పెసుకోవాలి.
  Mixed fruit halwa 5
 • ఇప్పుడు దానిమ్మ గింజలు, జీడిపప్పు, కిస్మిస్స్ వేసి కలిపి వేడిగా చల్లగా ఎలా అయినా సర్వ్ చేసుకోండి.
  Mixed fruit halwa 6
 • నచ్చితే పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవచ్చు.

Video

మిక్స్డ్ ఫ్రూట్ హల్వా

Cuisine Indian
Author Vismai Food

Ingredients

కావలసినవి:

 • ¾ cup పండిన బొప్పాయ్ పేస్టు
 • 1 cup తియ్యని ఆపిల్ ముక్కలు
 • 2 tbsp దానిమ్మ గింజలు
 • ¼ cup జీడిపప్పు
 • ¼ cup కిస్మిస్
 • ¼ cup బొంబాయ్ రవ్వ
 • 4 tbsp నెయ్యి

Instructions

 • 2 tbsps నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు కిస్మిస్స్ వేసి ఎర్రగా వేపి పక్కలు తీసుకోండి.
  Mixed fruit halwa 1
 • అదే మూకుడు లో మరో 2 tbsps నెయ్యి వేసి కరిగించి అందులు రవ్వ వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా వేపుకోవాలి. రవ్వ ఎర్రగా వేగితే జీడిపప్పు వేగిన సువాసన వస్తుంది.
  Mixed fruit halwa 2
 • రవ్వ వేగాక పండిన బొప్పాయ్ పేస్టు వేసి నెయ్యి పైకి తేలేదాకా మీడియం ఫ్లేం మీద మగ్గనివ్వాలి.
  Mixed fruit halwa 3
 • నెయ్యి పైకి తేలాక పంచదార వేసి కరిగించాలి.
  Mixed fruit halwa 4
 • పంచదార కరిగాక అందులో ఆపిల్ ముక్కలు వేసి 2-3 నిమిషాలు మగ్గనిచ్చి దిమ్పెసుకోవాలి.
  Mixed fruit halwa 5
 • ఇప్పుడు దానిమ్మ గింజలు, జీడిపప్పు, కిస్మిస్స్ వేసి కలిపి వేడిగా చల్లగా ఎలా అయినా సర్వ్ చేసుకోండి.
  Mixed fruit halwa 6
 • నచ్చితే పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top