మిల్క్ పౌడర్ లడ్డు ఇది చాలా రుచిగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. నోట్లో పెట్టుకోగానే ఐస్ క్రీం లా కరిగిపోతుంది. చేయడం కూడా చాలా తేలిక. జస్ట్ 3 నిమిషాల లో తయారైపోతుంది. అందరికి నచ్చితీరుతుంది.

కావలసినవి:

  • పాల పిండి- 250 gms
  • నెయ్యి- 75 gms
  • జీడిపప్పు- ¼ కప్

విధానం:

Directions

0/0 steps made
  1. నెయ్యి ని కరిగించి అందులో జీడిపప్పు పలుకులు వేసి జస్ట్ 30 సెకన్లు సేపు వేపుకుని దిమ్పెసుకోండి
  2. ఇప్పుడు పాలపిండి లో వేడి వేడిగా ఉన్న నెయ్యి, జీడిపప్పు వేసి పాల పిండి ని బాగా పిండుతూ కలుపుకోండి.
  3. ఈ కొలతకి ఈ నెయ్యి సరిపోతుంది, సరిపోకపోతే tbsp నెయ్యి వేసి బాగా కలుపుకుని గట్టిగా పిండుతూ లడ్డు చుట్టుకొండి.
  4. లడ్డులు తయారయ్యాక గాలికి గంట పాటు ఆరనిచ్చి ఆ తరువాత డబ్బా లో పెట్టుకుంటే కనీసం వారం పాటు నిలవుంటాయ్

టిప్స్:

  • నెయ్యి సరిపోకపోతే కొంచెం వేసుకోండి, ఒకవేళ పిండి మరీ ముద్దగా అయితే పాల పిండి వేసుకోవచ్చు
  • పాల పిండి తియ్యగా ఉంటుంది, కాబట్టి ఈ లడ్డు కి పంచదార అవసరం లేదు