మునక్కాయ పచ్చడి ఇది ఆంధ్రుల ప్రేత్యేకమైన పచ్చడి. వేడి వేడి నెయ్యన్నం లో లేదా పెరుగన్నం లో తింటుంటే ఆ రుచే వేరు. ఈ కొలతలతో చేస్తే కనీసం 6 నెలలు నిలవుంటుంది, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇదే ముక్కాయ తో బెల్లం వేసి, నిమ్మరసం పిండి, ఆవపిండి వేసి ఇలా చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయ్. అవన్నీ మీకు మరో సారి చెప్తా!

కావలసినవి:

 • ముక్కాయలు-4 (కడిగి తుడిచి, పీచు తీసిన ముక్కలు)
 • చింతపండు- చిన్న నిమ్మకాయంత
 • కారం- 50 gms
 • ఉప్పు- 35 gms
 • మెంతులు- 1 tbsp
 • ఆవాలు- 1 tbsp
 • పసుపు- ½ tsp
 • వేరు సెనగ నూనె- 200 gms

విధానం:

Directions

0/0 steps made
 1. మెంతులు, ఆవాలు వేసి లో-ఫ్లేం మీద ఎర్రగా మాంచి కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోండి. ఇవి సరిగా రోస్ట్ అవ్వడానికి కనీసం 10 నిమిషాల టైం పడుతుంది,
 2. ఎర్రగా వేగాక దింపి చల్లార్చుకోండి.
 3. ఇప్పుడు నూనె బాగా వేడి చేసి అందులో మునక్కాడ ముక్కలు వేసి ఓ నిమిషం వేపి స్టవ్ ఆపేసి నూనె లోనే ముక్కలు మగ్గనివ్వండి. మధ్య మధ్య లో మునక్కాడాలని పైకి కిందికి కలుపుకోండి.
 4. ఈ లోపు చల్లార్చుకున్న ఆవాలు, మెంతులు, చింతపండు వేసి మెత్తని పౌడర్ చేసుకోండి.
 5. నూనె గోరువెచ్చగా అయ్యాకా అప్పుడు కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి వేసి కలిపి 3-4 గంటల పాటు ఓ క్లాత్ కప్పి వదిలేయండి, ఆపాటికి వేడి పూర్తిగా చల్లారిపోతుంది. అప్పుడు జాడీ లో పెట్టి 2 రోజుల తరువాత ఎంజాయ్ చేయండి.

టిప్స్:

 • మునక్కాడలు కడిగి తుడిచి, ఆరిన తరువాత ముక్కలు కోసుకోండి
 • మెంతులు లో-ఫ్లేం లోనే ఎర్రగా వేపుకుంటేనే రుచి
 • నూనె లో వేసి నిమిషం కంటే ముక్కలు వేపకండి, మిగిలిన వేడికి ముక్క మగ్గిపోతుంది
 • వేరు సెనగ నూనె మాంచి సువాసన ఈ పచ్చడికి