“మూంగ్ దాల్ హల్వా” నార్త్ ఇండియా లో చాల ఫేమస్ స్వీట్. ప్రతీ పెళ్ళికి ప్రేత్యేకించి చేస్తుంటారు! వేసేవి నాలుగైదు పదార్ధాలు అంతే కాని వంటే తీరుని బట్టి చాలా గొప్పగా ఉంటుంది దీని రుచి. ఒక్క మాట చెప్పాలంటే మనసునింపే స్వీట్ ఇది! ఈ రెసిపీ నేను చెప్పే టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది!

కావలసినవి:

 • పెసరపప్పు- 250 gms
 • నెయ్యి- 250 gms
 • పంచదార- 250 gms
 • యలకలపొడి- 1 tsp
 • నీళ్ళు- 100 ml
 • బాదం పలుకులు- ౩ tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. పంచదార లో 100ml నీళ్ళు పోసి పంచదార కరిగి 2 పొంగులు రాగానే దిమ్పెసుకోండి.
 2. పెసరపప్పు ని కడిగి 2 గంటలు నానబెట్టి ఆ తరువాత ¼ కప్ నీళ్ళు పోసుకుంటూ మెత్తని పేస్టుగా చేసుకోండి.
 3. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న మూకుడు లో నెయ్యి కరిగించి పెసరపప్పు పేస్టు వేసి మీడియం-ఫ్లేం మీద పెసరపప్పుని బాగా వేపుకోవాలి.
 4. పెసరపప్పు వేపెప్పుడు గడ్డలు కడుతుంది కాని గడ్డలు చిదుముతూ, కలుపుతూనే ఉండాలి.
 5. 20-25 నిమిషాలకి రవ్వ గా మారి నెయ్యి పైకి తేలుతుంది, అప్పుడు పంచదార పాకం, యలకలపొడి, బాదాం పలుకులు వేసి హై-ఫ్లేం మీద హల్వా దగ్గరపడి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి.
 6. నెయ్యి పైకి తేలి మాంచి రంగోచ్చాక అప్పుడు దింపి సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • పెసరపప్పు ని మెత్తని పేస్టు గా చేసుకోండి.
 • నెయ్యి లో వేపెప్పుడు అడుగు మందంగా ఉన్న మూకుడు వాడకపోతే అడుగుపట్టేస్తుంది, అందుకే నాన్ స్టిక్ వాడుకోవడం మేలు.
 • పెసరపప్పు ముద్ద వేపెప్పుడు ఉండలు కడుతుంది కాని అవి మేడుపుతూ ఉండకపోతే అవి ఉండలు గానే మిగిలిపోతాయ్!
 • ఈ హల్వ ఎంతా బాగా కలుపుతూ ఉంటె అంత రుచోస్తుంది.
 • దీనికి కాస్త ఓపిక కావలి, అప్పుడే సరైన రుచి.