మెంతి చెక్కలు అని మనం, ఉత్తర  భారత దేశం లో “మేథీ మట్రీ” అంటారు. మనం చేసుకునే చెక్కల ఆకారం లో ఉన్నా వీటి రుచి చాలా భిన్నం గా ఉంటుంది. మన చెక్కల మాదిరి గట్టిగా అప్పడాల్లా ఉండవు. చాలా గుల్లగా ఉంటాయి.
ఇవి గుజరాత్ మధ్య ప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా చేస్తారు. ఇవి “టీ” తో పాటు తింటుంటారు. ఇవి నేను హైదరాబాద్ దాదూస్ స్వీట్ హౌస్ లో మొదటగా తిన్నాను, అప్పుడు దీని గురుంచి ఆరా తీసి నేర్చుకుని మీకు పోస్ట్ చేస్తున్నా.
ఇవి సహజంగా మైదా వాడి చేస్తారు, మీకు కావాలంటే బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు.

కావలసినవి:

 • మైదా/బియ్యం పిండి- 1 కప్
 • నలిపిన వాము- 1/4 tsp
 • వేయించిన జీలకర్ర పొడి- 1/2 tsp
 • జీలకర్ర- 1/2 tsp
 • ఉప్పు
 • కారం- 1/2 tsp
 • ధనియాల పొడి- 1/2 tsp
 • కసూరి మేథి ఆకు- 1 tsp
 • వేడి నెయ్యి- 2 tbsps
 • నూనె వేపుకోడానికి

విధానం:

Directions

0/0 steps made
 1. మైదా పిండి లో సిద్ధం చేసుకున్న సామానంతా వేసి కసూరి మేథి నలిపి వేసుకోవాలి, అలాగే వేడి నెయ్యి వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు చికరించుకుంటూ గట్టిగా పిండి కలుపుకోవాలి
 2. ఆఖరున మరో 1 tsp నూనె వేసి కలిపి చిన్న గోలీ సైజు పిండి ముద్దలుగా చేసుకోండి
 3. పోలీథీన్ షీట్ మీద పిండి ముద్దని పెట్టి నూనె రాసిన ప్లేట్ తో నొక్కితే పల్చగా చెక్కల్లా అవుతాయి ఇలాగే అన్నీ చేసుకోండి
 4. నూనెని బాగా మరిగించి మంట తగ్గించి మాట్రీలు వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా కరకరలాడేట్టు వేపుకోవాలి, ఎర్రగా వేగాక జల్లెడలో వేసుకోండి
 5. పూర్తిగా చల్లారాక డబ్బాలో ఉంచుకుంటే వారం పాటు నిలవుంటాయ్

టిప్స్:

 • మైదా కి బదులు బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు
 • కసూరి మేథి వల్ల చాల మంచి ఫ్లేవర్ వస్తుంది, రుచిగానూ ఉంటుంది