“మెంతి పులిహోర” ఇది గోదావరి జిల్లాల్లో ఆలయాల్లో, ఇంకా వ్రతాలు పుజలప్పుడు ప్రేత్యేకంగా చేస్తుంటారు! పులిహోరలు అన్ని ఒకేలా చేస్తారు, కాని అందులో వేసే పదార్ధాలు, చేసే తీరుని బట్టి రుచిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ పులిహోర మాంచి సువాసన తో చాలా రుచిగా ఉంటుంది.

కావలసినవి:

 • బియ్యం- 1 కప్
 • చిక్కటి చింతపండు పులుసు- ½ కప్
 • నూనె- ½ కప్
 • వేరుసెనగపప్పు- ¼ కప్
 • ఆవాలు- 1 tsp
 • మినపప్పు- 1 tbsp
 • సెనగపప్పు- 1 tbsp
 • మెంతులు- 1 tbsp
 • ఎండు మిర్చి- 4
 • పచ్చి మిర్చి- 3
 • అల్లం తరుగు- 1 tbsp
 • కరివేపాకు- 1 tbsp
 • ఇంగువ- ¼ చెంచా
 • ఉప్పు
 • బెల్లం- 2 tbsps
 • నీళ్ళు- 2 కప్స్

విధానం:

Directions

0/0 steps made
 1. బియ్యాన్ని కడిగి 2 కప్స్ నీళ్ళు పోసి హై-ఫ్లేం మీద 3 విసిల్స్ రానిచ్చి, ఆ తరువాత పళ్ళెం వేసి అన్నాన్ని పూర్తిగా ఫ్యాన్ కింద చల్లారనివ్వండి
 2. ఇప్పుడు మెంతులులని లో-ఫ్లేం మీద మాంచి రంగొచ్చి ఎర్రగా వేగేదాక వేపుకోండి. ఆ తరువాత మెత్తని పొడి చేసుకోండి
 3. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఆవాలు, వేరుసెనగపప్పు వేసి ఆవాలు చిటపటలాడించి, ఆ తరువాత సెనగపప్పు మినపప్పు వేసి ఎర్రగా వేగనివ్వండి
 4. తాలింపు ఎర్రగా వేగాక అప్పుడు ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి,ఇంగువ, ఉప్పు వేసి ఎండుమిర్చి రంగు మారేదాకా వేపుకోండి
 5. ఇప్పుడు చింతపండు పులుసు పోసి అందులో బెల్లం, వేయించిన మెంతుల పొడి వేసి పులుసు ని బాగా కలిపి నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేం మీద ఉడకనివ్వండి
 6. నూనె పైకి తేలాక స్టవ్ ఆపేసి అప్పుడు పొడి పొడిగా ఉన్న అన్నాన్ని వేసి పులుసు బాగా పట్టించండి.
 7. దింపే ముందు నచ్చితే మరో రెబ్బ కరివేపాకు వేసుకోండి పైన.

టిప్స్:

 • ఈ పులిహోర కి రుచి, సువాసన అంత మెంతుల నుండే వస్తుంది, కాబట్టి మెంతులు ఎంత బాగా వేగితే అంత రుచోస్తుంది పులిహోర కి
 • అన్నాన్ని హై-ఫ్లేం మీద వండితే పలుకుగా ఉంటుంది లేదంటే మెత్తబడుతుంది, పులిహోర ముద్దవుతుంది
 • పులుసు నిదానంగా నూనె పైకి తేలేదాక ఉడకాలి అప్పుడే పులిహోర రుచి, ఇలా నూనె పైకి తేలిన పులుసుని ఫ్రిజ్లో ఉంచుకుంటే కనీసం 2 నెలల పైన నిలవుంటుంది.