మేథీ మటర్ పులావ్/మెంతి కూర బాటానీ పులావ్

google ads

మేథీ మటర్ పులావ్/మెంతి కూర బాటానీ పులావ్

Author Vismai Food
Vismaifood-Website-Recipe-Thumbnail-29-1
పులావ్ లు ఎన్నో ఎన్నో…అన్నీ వేటికవే ప్రేత్యేకం! అన్నీ స్పెషల్ రోజుల్లో ఇంకా స్పెషల్ గా అనిపిస్తాయ్. అంటే పులావ్ అంటే ఎంతలా ప్రాణం పెట్టేస్తామో అర్ధం చేసుకోవచ్చు.
నేను ఎన్నో రకాలా పులావ్ లు చేశా, వాటిని ఓ సారి చుడండి. “వేటికవే ప్రేత్యేకం”. నేను ప్రేత్యేకించి “వేటికవే ప్రేత్యేకం” అని ఎందుకన్నానంటే…సాధారణంగా పులావ్ అనగానే నచ్చిన కాయకూరలు, లేదా మాంసం వేసి వండి గరం మసాలా వేసి దిమ్పెస్తారు.
నాకు అలా అస్సలు నచ్చదు. ఏ పులావ్ చేసినా ప్రేత్యేకంగా ఉండాలి. అది రుచి, రూపం, రంగూ, సువాసన ఇలా అన్నింటిలో ప్రేత్యేకంగా ఉండాలి అనుకుంటా, అలా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటా.
అలా నాకు ఎంతో ప్రేత్యేకంగా అనిపించిన రెసిపీ ఈ “మేథీ మాటర్ పులావ్”. ఇది నాకు తెలిసి గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల స్పెషల్. నేను మాత్రం మొదటగా రాజస్తాన్ జోద్పూర్ లో తిన్నాను. చాలా నచ్చేసింది.
తరువాత గుజరాత్ లో కూడా తిన్నాను. గుజరాత్ లో తిన్న పులావ్ పూర్తిగా నెయ్యి వేసే చేసారు. నాకు జోధ్పూర్ స్టైల్ నచ్చింది. అదే మీకు ప్రెసెంట్ చేస్తున్నాను.ఈ పులావ్ ఈ మధ్య స్ట్రీట్ ఫుడ్ గా బండ్ల మీద కూడా దొరుకుతుంది అంటే అర్ధం చేసుకోవచ్చు, దీని పాపులారిటీ.
చాలా సులభంగా చేసేసుకోవచ్చు. సహజంగా అల్లం- వెల్లూలి వేసే చేసే కూరలు, పులావ్లు రోజూ, లేదా లంచ్ బాక్సుల రెసిపీస్ అని చెప్పడం నాకు ఇష్టముండదు. కానీ ఈ పులావ్ లంచ్ బాక్సులకీ తీసుకుని వెళ్ళొచ్చు
.ఇందులో నేనూ వెల్లూలి వాడను, కానీ చాలా కొద్దిగా. అదీ ఇష్టం లేని వారి వదిలేయోచ్చు. ఈ పులావ్ కి కమ్మటి పెరుగు చాలా రుచిగా ఉంటుంది.సహజంగా మెంతి కూర చేదు అని తినరు చాలా మంది. కానీ ఈ పులావ్ లో మెంతి ఆకు ఎంతో రుచినిస్తుంది.
ఎలా చేస్తే రుచి పెరుగుతుంది, ఎక్కడ అందరూ పొరపాట్లు చేస్తారు లాంటి వివరాలన్నీ కింద టిప్స్ లో ఉన్నాయ్ చుడండి.ఈ పులావ్ నేను బాస్మతీ బియ్యంతో చేశా. మీకు నచ్చితే సోనా మాసూరి బియ్యం తో కూడా చేసుకోవచ్చు.
దాని కొలతలు కూడా కింద టిప్స్ లో ఉంటాయ్ చుడండి.ఈ పులావ్ నేను విడిగా అడుగు మందం గా ఉన్న గిన్నె లో వండాను. మీరు కావాలంటే కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు. దానికి నీటి కొలతలు కూడా కింద టిప్స్ లో ఉన్నాయ్ చుడండి.నేను ఫ్రోజెన్ బటానీ వాడాను.
అవి తాజావి, కాబట్టి త్వరగా ఉడికిపోతాయ్. మీరు ఎండు బటానీ వాడాలనుకుంటే రాత్రంతా నానబెట్టినవి వాడుకోండి. లేదా విడిగా కుక్కర్ లో ఉడికించి వాడుకోండి.

Tips

మెంతి ఆకు బాగా వేగితే చెడు విరుగుతుంది. లేదా పసరు వాసనతో తినలేరు.
బియ్యం సోనామసూరి /బాస్మతి ఏదైనా కడిగి గంట నానబెట్టండి.
గిన్నెలో పులావ్ చేస్తుంటే కప్ బియానికి 2 కప్స్ వేడి నీళ్ళు పోసుకోండి.
కుక్కర్ లో పులావ్ కి. కప్ బియ్యానికి 1.1/4 కప్స్ వేడి నీళ్ళు పోసుకుని 1 విసిల్ హై-ఫ్లేం మీద ఉడికించి, స్టవ్ ఆపేసి 15 నిమిషాల తరువాత సర్వ్ చేసుకోండి.
సోనా మసూరీ కి కుక్కర్ లో అయితే కప్ బియ్యానికి 2 కప్స్ వేడి నీళ్ళు పోసుకోండి. 2 విసిల్స్ హై-ఫ్లేం మీద కుక్ చేసుకోండి.
సోనా మసూరీ గిన్నె లో వండితే 2 కప్స్ వేడి నీళ్ళు కప్ బియ్యానికి.
నచ్చితే గుజరాత్ వారిలా నెయ్యితో కూడా చేసుకోవచ్చు.

Ingredients

 • 1.5 cup బాస్మతి బియ్యం
 • 1 cup మెంతి ఆకు
 • ½ cup తాజా బటానీ
 • 3 tbsp నూనె
 • 1 tbsp వెల్లూలి తరుగు
 • 1 tbsp అల్లం తరుగు
 • 4 పచ్చిమిర్చి చీలికలు
 • ½ tbsp పసుపు
 • 3 యాలకలు
 • 3 లవంగాలు
 • 1 బిరియానీ ఆకు
 • 1 tbsp జీలకర్ర
 • ఉప్పు- రుచికి సరిపడా
 • 2 cup వేడి నీళ్ళు (విడిగా వండుకుంటే, కుక్కర్ లో అయితే పైన టిప్స్ లో చూడగలరు)

Instructions

 • నూనె వేడి చేసి అందులో జీలకర్ర, అల్లం- వెల్లూలి తరుగు, బిరియానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోండి.
 • మెంతి ఆకు తరుగు పసుపు వేసి ఆకు లోని పసరు వాసన పోయి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి, మీడియం ఫ్లేం మీద.
 • గంట నానబెట్టిన బియ్యం వేసి బియ్యం లోని చెమ్మ పోయే దాకా మెతుకు విరగకుండా, అడుగు నుండి కలుపుతూ బియ్యాన్ని వేపండి.
 • బియ్యం పొడి పొడిగా వేగాక, బటానీ వేసి ఓ నిమిషం వేపుకోండి.
 • వేడి నీళ్ళు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 12-15 నిమిషాలు లేదా అన్నం పూర్తిగా ఉడికేంత వరకు వండుకోవాలి.
 • అన్నం ఉడికాక దింపి 15 నిమిషాలు వేదిలేసి ఆ తరువాత అడుగు నుండి కలుపుకోవాలి.

Video

మేథీ మటర్ పులావ్/మెంతి కూర బాటానీ పులావ్

Author Vismai Food

Ingredients

 • 1.5 cup బాస్మతి బియ్యం
 • 1 cup మెంతి ఆకు
 • ½ cup తాజా బటానీ
 • 3 tbsp నూనె
 • 1 tbsp వెల్లూలి తరుగు
 • 1 tbsp అల్లం తరుగు
 • 4 పచ్చిమిర్చి చీలికలు
 • ½ tbsp పసుపు
 • 3 యాలకలు
 • 3 లవంగాలు
 • 1 బిరియానీ ఆకు
 • 1 tbsp జీలకర్ర
 • ఉప్పు- రుచికి సరిపడా
 • 2 cup వేడి నీళ్ళు విడిగా వండుకుంటే, కుక్కర్ లో అయితే పైన టిప్స్ లో చూడగలరు

Instructions

 • నూనె వేడి చేసి అందులో జీలకర్ర, అల్లం- వెల్లూలి తరుగు, బిరియానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోండి.
 • మెంతి ఆకు తరుగు పసుపు వేసి ఆకు లోని పసరు వాసన పోయి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి, మీడియం ఫ్లేం మీద.
 • గంట నానబెట్టిన బియ్యం వేసి బియ్యం లోని చెమ్మ పోయే దాకా మెతుకు విరగకుండా, అడుగు నుండి కలుపుతూ బియ్యాన్ని వేపండి.
 • బియ్యం పొడి పొడిగా వేగాక, బటానీ వేసి ఓ నిమిషం వేపుకోండి.
 • వేడి నీళ్ళు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 12-15 నిమిషాలు లేదా అన్నం పూర్తిగా ఉడికేంత వరకు వండుకోవాలి.
 • అన్నం ఉడికాక దింపి 15 నిమిషాలు వేదిలేసి ఆ తరువాత అడుగు నుండి కలుపుకోవాలి.

Tips

మెంతి ఆకు బాగా వేగితే చెడు విరుగుతుంది. లేదా పసరు వాసనతో తినలేరు.
బియ్యం సోనామసూరి /బాస్మతి ఏదైనా కడిగి గంట నానబెట్టండి.
గిన్నెలో పులావ్ చేస్తుంటే కప్ బియానికి 2 కప్స్ వేడి నీళ్ళు పోసుకోండి.
కుక్కర్ లో పులావ్ కి. కప్ బియ్యానికి 1.1/4 కప్స్ వేడి నీళ్ళు పోసుకుని 1 విసిల్ హై-ఫ్లేం మీద ఉడికించి, స్టవ్ ఆపేసి 15 నిమిషాల తరువాత సర్వ్ చేసుకోండి.
సోనా మసూరీ కి కుక్కర్ లో అయితే కప్ బియ్యానికి 2 కప్స్ వేడి నీళ్ళు పోసుకోండి. 2 విసిల్స్ హై-ఫ్లేం మీద కుక్ చేసుకోండి.
సోనా మసూరీ గిన్నె లో వండితే 2 కప్స్ వేడి నీళ్ళు కప్ బియ్యానికి.
నచ్చితే గుజరాత్ వారిలా నెయ్యితో కూడా చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top