రవ్వ అప్పాలు…ఇవి పండుగులకి ప్రసాదంగా ఇంకా ప్రేత్యేకించి ఆంజనేయునికి ప్రసాదం గా నివేదిస్తారు. ఇవి ప్రసాదంగానే కాదు ఎప్పుడైనా ఏదైనా తీపి తినలనిపించినా 10 నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. ఇంకా ఇవి 3 రోజులు పాటు నిలవుంటాయ్ కూడా. ఇవి చేయడం చాలా తేలిక, కాని పక్కా కొలతలు పాటిస్తేనే.

కావలసినవి:

 • బొంబాయ్ రవ్వ- 1 కప్
 • పంచదార- 1 కప్
 • నీళ్ళు- 1 కప్
 • యాలకలపొడి- 1 tsp
 • నూనె – వేపుకోడానికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. రవ్వలో పంచదార, యలకలపొడి వేసి బాగా కలుపుకుని పక్కనుంచుకోండి
 2. ఇప్పుడు నీళ్ళని మరగ కాచండి, నీళ్ళు మరుగుతున్నప్పుడు కలిపి ఉంచుకున్న రవ్వ పోస్తూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోండి
 3. తరువాత మూత పెట్టి మధ్య మధ్య లో కలుపుతూ పిండి ముద్దలా అయ్యేదాకా ఉడికించుకోండి, తరువాత దిమ్పెసుకుని చల్లర్చుకోండి
 4. పూర్తిగా చల్లారిన పిండి ముద్దని బాగా వత్తుకోండి
 5. తరువాత చేతికి నెయ్యి రాసి చిన్న చిన్న వడలు మాదిరి వత్తుకుని, కాసేపు గాలికి ఆరనివ్వండి బాగా గట్టి పడతాయ్
 6. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక మంట తగ్గించి అందులో అప్పాలు వేసి మీడియం –ఫ్లేం మీద 2 నిమిషాల పాటు వదిలేయండి
 7. తరువాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి, ఆ తరువాత హై –ఫ్లేం మీద క్రిస్పీ గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి.
 8. అపాలు బాగా పొంగాక చిల్లుల గరిట మీదికి తీసుకుని మరో గరిటతో నొక్కితే నూనేనంతా దిగిపోతుంది, తరువాత చల్లర్చుకోండి
 9. చల్లారక డబ్బాలో ఉంచుకుంటే 3 రోజులు నిలవుంటాయ్.

టిప్స్:

 • పర్ఫెక్ట్ కొలతంటే కప్ రవ్వకి కప్ పంచదార, కప్ నీళ్ళు.
 • నచ్చితే కాస్త ఎండుకొబ్బరి, జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు