రవ్వ ఉండ్రాళ్ళు/రవ్వ కుడుములు ఇలా వివిధ రకాలుగా పిలుస్తారు. ఎలా పిలిచినా ఇది బియ్యం రవ్వ తో చేస్తారు! చేయడం చాలా తేలిక. పండుగ వేళ సులువుగా అయిపోయే రుచిగల ఆరోగ్యకరమైన ప్రసాదం! ఇది ఒక్కోరు ఒక్కో తీరు లో చేస్తారు, కొందరు రావాలో నీళ్ళు పోసి వండి మళ్ళీ ఆవిరి మీద ఉడికిస్తారు, నేను దీన్ని మరింత సులువుగా చేస్తున్న. ఇది పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది!

కావలసినవి:

 • బియ్యం రవ్వ- 1 కప్
 • నీళ్ళు- ౩ కప్స్
 • పచ్చి సెనగపప్పు- 1 tbsp
 • జీలకర్ర- 1 tsp
 • ఉప్పు
 • నెయ్యి- 2 tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. బియ్యం రవ్వ ని లో- ఫ్లేం మీద మంచి రంగు సువాసన వచ్చే వరకు వేపి దింపి పక్కనుంచుకోండి
 2. ఇప్పుడు ౩ కప్స్ నీళ్ళు పోసి అందులో 1 tbsp పచ్చి సెనగపప్పు, జీలకర్ర, ఉప్పు 1 tbsp నెయ్యి వేసి నీళ్ళని తెర్ల కాగానివ్వండి.
 3. నీళ్ళు తెర్లుతున్నప్పుడు రవ్వ పోసి బాగా కలిపి మూత పెట్టి లో-ఫ్లేం మీద పూర్తిగా మెత్తగా ఉడికించుకోండి
 4. రవ్వ మెత్తగా ఉడికాక అప్పుడు స్టవ్ ఆపేసి రవ్వనంత గట్టిగా వత్తుతూ ఓ ముద్దగా చేసి మూత పెట్టి 15నిమిషాలు వదిలేయండి
 5. 15 నిమషాల తరువాత 1 tbsp నెయ్యి వేసి రవ్వ ని గట్టిగా పిండుతూ కలిపి చేతికి నెయ్యి రాసుకుని ఉండ్రాళ్ళుగా చేసుకోండి.

టిప్స్:

 • అడుగు మందంగా ఉన్న పాత్ర వాడకపోతే అడుగు పట్టేస్తుంది
 • ఇందులో అల్లం, కరివేపాకు తరుగు వేయరు, నచ్చితే మీరు వేసుకోవచ్చు