రవ్వ పరోటా
“రవ్వ పరోటా” దూదిలా మెత్తగా, వెన్నలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయ్! బొంబాయి రవ్వతో ఎప్పుడూ ఉప్మానే కాదండి పొద్దున్నే టిఫిన్ కి లేదా పిల్లల లంచ్ బాక్స్ కి ఇది చేసి పంపొచ్చు. చాలా ఇష్టంగా తింటారు! ఇవి గంటల తరువాత కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇవి ఏదైనా కుర్మా, లేదా రోటి పచ్చళ్ళతో చాలా రుచిగా ఉంటుంది.
Tips
పిండి ఎక్కువ సేపు వత్తుకోకపోతే పరాటాలు విరిగిపోతాయి, గట్టిగా వస్తాయి అప్పడాల్లా
అలాగే పెనం వేడెక్కకుండా కాల్చినా అప్పడాల్లానే వస్తాయి

Ingredients
- 1 cup బొంబాయి రవ్వ/ఉప్మా రవ్వ-
- 1.¾ నీళ్ళు
- ½ cup మైదా/గోధుమ పిండి-
- ఉప్పు
- నెయ్యి పరాటాలు కాల్చడానికి
Instructions
- రవ్వని మిక్సీ లో వేసి ఓ నిమిషం పాటు గ్రైండ్ చేసి తీసుకోండి. (సహజంగా బజార్ లో దొరికే రవ్వ అంత సన్నగా ఉండదు అందుకే ఇలా చేయాలి)
- నీళ్ళలో ఉప్పేసి తెర్ల కాగానివ్వండి
- నీళ్ళు మసిలాక అప్పుడు రవ్వ కొద్దిగా వేస్తూ గరిటతో కలుపుతూ మీడియం ఫ్లేం మీద గట్టి ముద్ద అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి.
- గట్టి ముద్దయ్యాక ఓ ప్లేట్ లోకి తీసుకుని ఓ నిమషం చల్లార్చాలి
- ఆ తరువాత కొద్దిగా మైదా చల్లుకుని వేడి మీదే బాగా ఎక్కువ సేపు నీళ్ళు చల్లకుండా పిండి ముద్దని వత్తుకోవాలి(రవ్వ లో ఉన్న నీరు సరిపోతుంది)
- వేడి పట్టలేకపోతే తడి గుడ్డ కప్పి గుడ్డ తో సహా వత్తుకోవచ్చు, లేదా సిలికాన్ మ్యాట్ అని ఆన్లయిన్ లో దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు
- పిండి ముద్ద లో ఎక్కడా పగుళ్ళు లేకుండా ఎక్కువసేపు వత్తుకోవాలి కొద్దికొద్దిగా మైదా చల్లుకుంటూ. (మైదా నాకు తీసుకున్న ½ కప్ పిండి కి ఇంకా 2 tsps మిగిలింది, మీరు రవ్వ ని వండుకునే దాన్ని బట్టి మైదా అవసరం అవుతుంది. కానీ ఎంత తక్కువ మైదా వాడితే అంతే బాగుంటుంది)
- ఇప్పుడు పొడి మైదా చల్లి పిండి ముద్ద ని ఉంచి అప్పడాల కర్రతో నిదానంగా అంచులు పల్చగా వత్తుకోవాలి
- పెనం బాగా వేడెక్కాక పరాట వేసి రెండు వైపులా కాస్త కాల్చి ఆ తరువాత ½ చెంచా చొప్పున రెండు వైపులా పూసి ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.
Video