రాగి దలియా ఎంతో ఆరోగ్యకరమైన ఓ రెసిపీ. ఇది ఆరు నెలల పసిపాప నుండి 80 ఏళ్ళ వయసున్న వారు కూడా తినొచ్చు. పోషకాలతో నిండిన రుచికరమైన రెసిపీ. ఇది బరువు తగ్గాలనుకునే వారు, కాల్షియమ్ తక్కువున్న వారు, ఎదుగుతున్న పిల్లలు, బీ పీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా రోజూ తినొచ్చు. ఓ నెల పాటు తిని చుడండి ఎంత గుణం కనిపిస్తుందో మీలో. ఇది తిన్నాక అస్సలు మత్తుగా అనిపించదు.

కావలసినవి:

 • రాగి పిండి- 3 tbsps
 • వేరుసెనగపప్పు- 3 tbsps
 • సామ బియ్యం/కొర్ర బియ్యం- 3tbsps( రెండు గంటలు నానబెట్టినది)
 • కందిపప్పు- 3 tbsps
 • జీలకర్ర- 1/2 tsp
 • ధనియాలు – 1/2 tsp
 • కరివేపాకు- 1 రెబ్బ
 • వెల్లూలి- 4-5
 • పచ్చిమిర్చి తరుగు-1
 • తోటకూర- 1/2 కట్ట
 • నీళ్ళు- 400 ml
 • నెయ్యి- 1 tsp
 • సైంధవ లవణం- రుచికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. రాగిపిండి లో ఎక్కడా ఉండలు లేకుండా 100ml నీళ్ళు పోసుకుని బాగా కలిపి పక్కనుంచుకోండి.
 2. ఇప్పుడు బాండీ లో వేరుసెనగపప్పు, కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, వెల్లూలి ఒక్కొటిగా వేసుకుంటూ లో ఫ్లేం మీద వేపుకుని చల్లార్చుకోండి
 3. ఇప్పుడు మిక్సి జార్ లో వేసి కాస్త బరకగా పొడి చేసుకోండి
 4. ఇప్పుడు 300 ml నీళ్ళు మరిగించుకుని కాస్త జీలకర్ర, నానబెట్టి ఉంచుకున్న సామ బియ్యం, పచ్చిమిర్చి తరుగు, తోటకూర తరుగు వేసి మూత పెట్టి 3-4 నిమిషాలు లో ఫ్లేం మీద ఉడకనివ్వండి
 5. ఆ తరువాత రాగి పిండి మిశ్రమాన్ని కలిపి పోసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేం మీద కాస్త దగ్గర పడనివ్వండి
 6. దగ్గరపడ్డాక వేరుసెనగ కందిపొడి, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగ కలుపుకుని మూతపెట్టి 3-4నిమిషాలు లో ఫ్లేం లో మూత పెట్టి ఉడకనివ్వండి
 7. దింపే ముందు 1 tsp ఆవు నెయ్యి, 1/2 చెక్క నిమ్మ రసం వేసి కలుపుకుని వేడి వేడి గా సర్వ్ చేసుకోండి.
 8. ఇది అలా తినేసినా బాగుంటుంది లేదా పెరుగు చట్నీ తో ఇంకా బాగుంటుంది

టిప్స్:

 • రాగి పిండి కంటే కూడా మొలకెత్తిన రాగి పిండి ఉంటె మరీ మంచిది
 • సామ బియ్యానికి బదులు మీరు కొర్రలు, జొన్నలు లేక మరింకేదైనా ధాన్యాలు వాడుకోవచ్చు
 • సామ బియ్యం కచ్చితంగా 2-3 గంటలు నానా బెట్టాలి అప్పుడే మెత్తగా ఉడుకుతుంది
 • కందిపప్పుకి బదులు కందులు వాడుకోండి ఇంకా బావుంటుంది రుచి