మటన్ వేపుడు అన్ని ప్రాతాలలో చేస్తారు కాని రాయలసీమ ప్రాంతం లో చేసే మటన్ ఫ్రై చాలా స్పసీగా ఘాటుగా కారం అంటే ఇష్టపడే వారికి నచ్చేలా ఉంటుంది. ఈ వంతం ప్రేత్యేకించి కర్నూల్, చిత్తూర్ జిల్లాల్లో చాలా ఎక్కువగా చేస్తుంటారు! ఇది కనీసం 2-౩ రోజులు నిలవుంటుంది కూడా. ఇది పప్పుచారు లేదా చారు తో చాలా రుచిగా ఉంటుంది.

కావలసినవి:

  • మటన్- ½ కిలో
  • అల్లం వెల్లులి పేస్టు- 1 tbsp
  • ధనియాల పొడి- 1 tbsp
  • కారం- 2 tbsps
  • ఉప్పు
  • నూనె- 3 tbsps
  • పసుపు- 1 tsp

వేపుడుకోసం:

  • నూనె- ½ కప్
  • అల్లం వెల్లులి పేస్టు- 1 tsp
  • కరివేపాకు- 2 రెబ్బలు
  • ఎండు మిర్చి-4
  • పచ్చిమిర్చి- 3
  • గరం మసాలా- 1 tsp
  • కొత్తిమీర- 2 tbsps
  • కరివేపాకు- 1 tbsp

విధానం:

Directions

0/0 steps made
  1. మటన్ లో ఉంచుకున్న మసాలాలు అన్నీ కలిపి రాత్రంతా ఫ్రిడ్జ్ లో ఉంచేయండి, కుదరనట్లైతే కనీసం 3 గంటలు నాననివ్వండి
  2. మరుసటి రోజు కుక్కర్ లో మటన్ ముక్కలు వేసి అందులో 300 ml నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద 4 విసిల్స్ రానివ్వండి, 3 గంటలు నానినట్లితే 6-7 విసిల్స్ రానివ్వండి
  3. మటన్ మెత్తగా ఉడికాక అడుగు మందంగా ఉన్న మూకుడు లో నూనె వేడి చేసి అందులో కరివేపాకు వేసి వేపుకొండి, ఆ తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేపుకోండి
  4. ఇప్పుడు అల్లం వెల్లులి ముద్ద వేసి వేపి, మెత్తగా ఉడికిన్చుకున్న మటన్ నీళ్ళతో సహా వేసి బాగా కలిపి మీడియం ఫ్లేం మీద కలుపుతూ ముక్కలని వేగనివ్వండి
  5. ముక్కలు 15 నిమిషాలకి వేగి నీరు ఇగిరిపోయి నూనె పైకి తేలుతుంది, అప్పుడు మరో సారి బాగా కలిపి గరం మసాలా వేసి ముక్కలు dryగా అయ్యేదాకా వేపుకోండి.
  6. దింపే ముందు కొత్తిమీర కరివేపాకు వేసి వేపి దిమ్పెసుకోండి

టిప్స్:

  • మటన్ మసాలాలతో ఎంత ఎక్కువ సేపు నానితే అంత బాగుంటుంది వేపుడు
  • ఇది బాగా వేపితే కనీసం 2 రోజులు నిలవుంటుంది కూడా