రెస్టారంట్ స్టైల్ కర్డ్ రైస్ కి మాములు కర్డ్ రైస్ కి తేడా ఉంది. రెస్టారంట్ స్టైల్ కర్డ్ రైస్ వెన్నలా నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది. కమ్మగా ఉంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. కొన్ని టిప్స్ ఫాలో అయితే తప్పక రెస్టారంట్ స్టైల్ రుచోస్తుంది.

కావలసినవి:

 • పెరుగు
 • రైస్-1/2కప్ (30 నిమిషాలు నానబెట్టినవి)
 • పాలు – 1/4 కప్
 • ఫ్రెష్ క్రీం- 1/4 కప్
 • తాంపులు-(ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినపప్పు)
 • కరివేపాకు- 2 రెబ్బలు
 • జీడిపప్పు- 10-15
 • అల్లం-1/2 అంగుళం
 • పచ్చిమిర్చి-1/2
 • నూనె- 3 tbsps
 • నీళ్ళు-1 లీటర్
 • సాల్ట్

విధానం:

Directions

0/0 steps made
 1. నానబెట్టుకున్న బియ్యాన్ని అడుగు మందంగా ఉన్న పాత్ర లో వేసి లీటర్ నీళ్ళు, పాలు పోసి మీడియం ఫ్లేం మీద అన్నం సంగటి అయ్యేదాకా మెత్తగా ఉదికించుకోండి.
 2. ఇంకా నీరు ఉండగానే అన్నాన్ని మెత్తగా పప్పు గుత్తి తో ఎనుపుకోండి
 3. తరువాత 1/2 అంగుళం అల్లం తరుగు, సగం పచ్చి మిర్చి తరగు, సాల్ట్ వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి
 4. ముద్దగా అయిన చల్లటి సంగటిలో పెరుగు, క్రీం వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకొండి
 5. నూనె వేడి చేసుకుని తాలింపులు, కరివేపాకు, జీడిపప్పు వేసి మంచి సువసనోచ్చేదాక ఫ్రీ చేసుకుని, నూనె ని వాడకట్టేయ్యండి.
 6. ఇప్పుడు కేవలం నూనెని వడకట్టిన తాలింపుని మాత్రమే పెరుగన్నంలో కలిపి, గంట పాటు ఫ్రిజ్ లో పెట్టెయ్యండి.
 7. చల్లగా దీని రుచి ఎంతో బావుంటుంది.

టిప్స్:

 • బియ్యాన్ని నానబెడితేనె అన్నం మెత్తగా ఉడుకుతుంది
 • పెరుగు కచ్చితంగా కమ్మగా ఉండాలి పుల్లటి పెరుగు పనికిరాదు
 • క్రీం వేస్తేనే రెస్టారంట్ స్టైల్ రుచోస్తుంది
 • తాలింపు ని నూనె తో సహా వేస్తే ఘాటైన వాసనొస్తుంది కర్డ్ రైస్ కాబట్టి నూనేని వడకట్టుకోండి.