“వడా పావ్” ఇది స్పైసీ ఇండియన్ బర్గర్ అనొచ్చు. ఇది ముంబాయి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. మహారాష్ట్రా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. గుజరాత్లో ఇలాంటిదే “దాబెలి” అనే రెసిపీ ఉంది. అది ఇంకా స్పైసీగా చాలా బాగుంటుంది. అది మరో సారి చెప్తా!

ఇది ముంబాయి లో ఎక్కడైన దొరికేస్తుంది. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, కాలేజ్ కాంటీన్ ఇలా అన్నీ చోట్లా. ఇంకా ముంబాయిలో కొన్ని ఫేమస్ వడా పావ్ జాయింట్స్ కూడా ఉన్నాయ్! ఈ వడా పావ్ ఒక్క ముంబాయి లోనే కాదు యావత్ మహారాష్ట్ర అంతటా ఎంతో ఫేమస్!
ఈ వడా పావ్  లోనే కొన్ని వందల వెరైటీలు పుట్టుకొచ్చాయ్, మన దోశా వరైటీల్లా !

ఈ వడా పావ్ ముఖ్యంగా ఆలూ బొండా ని పావ్ మధ్య లో పెట్టి సర్వ్ చేస్తారు!
ఇందులో గ్రీన్ చట్నీ(పుదీనా చట్నీ) స్వీట్ చట్నీ, ఇంకా టమాటో కేట్చప్ తో కూడా సర్వ్ చేస్తారు, అవేవి నేను ఇందులో వాడలేదు. నచ్చితే మీరు వేసుకోవచ్చు.

పావ్ ఎప్పుడూ తాజాగా ఉండేదే వాడుకోండి, లేదంటే పొడిపొడిగా అయిపోతుంది తినలేరు.

ఇవి కూడా ట్రై చేయండి:

పావ్ భాజీ
ఎగ్ పావ్ భాజీ
పంజాబీ ఆలూ సమోసా
పానీ పూరి
అరటికాయ బజ్జి
చల్ల పుణుకులు

కావలసినవి:

 • లదీ పావ్-4

ఆలూ బొండా కోసం:

 • 2 ఆలూ ఉడికించి పొట్టు తీసి మెదుపుకున్నది
 • ఉల్లిపాయ తరుగు- 2 tbsps
 • పచ్చిమిర్చి తరుగు- 1 tbsp
 • కొత్తిమీర తరుగు- 2 tsps
 • కరివేపాకు- 1 రెబ్బ
 • నిమ్మరసం- 1 tsp
 • ఆవాలు- 1/2 tsp
 • జీలకర్ర- 1/2 tsp
 • ధనియాల పొడి- 1/2 tsp
 • ఉప్పు
 • కారం- 1/2 tsp
 • గరం మసాలా- 1/2 tsp
 • పసుపు- చిటికెడు

వెల్లూలి కారం పొడి కోసం:

 • పొట్టు తీసుకున్న వెల్లూలి- 6
 • ఎండు మిర్చి-3
 • వేరుసెనగపప్పు- 1/3 కప్
 • ఎండు కొబ్బరి పొడి- 1/3 కప్
 • నువ్వులు- 1 tbsp
 • ఉప్పు-1/4 tsp

పైన కోటింగ్ కోసం:

 • సెనగపిండి-1/2 కప్
 • నీళ్ళు- తగినన్ని
 • కారం- 1/2 tsp
 • పసుపు- చిటికెడు
 • వడ వేపుకోడానికి- నూనె

విధానం:

Directions

0/0 steps made
 1. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పచ్చిమిర్చి వేసి హై-ఫ్లేం మీద ఆవాలు చిటచిటలాడించండి.
 2. తరువాత ఉల్లిపాయలు వేసి మెత్తబడే దాక వేపుకోండి.
 3. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు ఉడికించిన మెదుపుకున్న ఆలూ వేసి బాగా మసాలా పట్టించి, ఆలూ ముద్దగా అయ్యేదాకా వేపుకోవాలి..
 4. గట్టి ముద్దగా అయ్యాక, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కలిపి దింపి చల్లార్చండి.
 5. పూర్తిగా చల్లారాక, చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. (ఒకవేళ పిండి ముద్దలు లూస్ గా అనిపిస్తే ఫ్రిజ్ లో 30 నిమిషాలు ఉంచండి).

వెల్లూలి కారం పొడి కోసం:

Directions

0/0 steps made
 1. పాన్ లో వేరు సెనగపప్పు వేసి లో-ఫ్లేం మీద కలుపుతూ వేపి దింపి పూర్తిగా చల్లార్చి పొట్టు తీసుకోండి.
 2. అదే పాన్ లో 1 tsp నూనె వేడి చేసి అందులో పొట్టు తీసుకున్న వెల్లూలి, ఎండుమిర్చి వేసి ఎర్రగా వేపి, ఎండుకొబ్బరి పొడి, నువ్వులు వేసి కొబ్బరి పొడి ఎర్రగా అయ్యేదాకా వేపుకుని దింపి చల్లార్చండి.
 3. మిక్సీ జార్ లో పొట్టు తీసిన వెల్లూలి, చల్లార్చిన కొబ్బరి పల్లీల మిశ్రమం వేసి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
 4. ఆఖరున ఉప్పు కలుపుకోవాలి.

పైన కోటింగ్ కోసం:

Directions

0/0 steps made
 1. సెనగపిండి లో పసుపు, కారం, నీళ్ళు వేసి బజ్జీల పిండి అంత చిక్కగా కలుపుకోవాలి.
 2. గట్టిపడిన ఆలూ ఉండలని పిండి లో ముంచి వేడి నూనె వేసి మీడియం-ఫ్లేం మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చే దాక, హై-ఫ్లేం మీద క్రిప్సీగా ఎర్రగా అయ్యేదాకా వేపుకుని తీసుకోండి.

సర్వ్ చేయడానికి:

Directions

0/0 steps made
 1. లదీ పావ్ ని మధ్య కి కోసి వెల్లూలి కారం 1 tsp పావ్ లో వేసి బొండాని కొద్దిగా ప్రెస్ చేసి పావ్ మధ్యలో ఉంచండి.
 2. నచ్చితే పావ్ లో గ్రీన్ చట్నీ/టమాటో సాస్/స్వీట్ చట్నీ వేసి ఆ తరువాత వెల్లూలి కారం కూడా వేసుకోవచ్చు.

టిప్స్:

 • ఇందులో స్టఫ్ఫ్ చేసే ఆలూ బొండా పై పిండి ఎప్పుడూ నీళ్ళతో కలుపుకున్నాక, వేలు ముంచి తీస్తే వెలికి ఏ మందాన పిండి అంటుకుంటే ఆ మందాన ఆలూకి అంటుకుంటుంది పై పిండి అని గుర్తుంచుకోండి.
 • ఆలూ ముద్ద ఒక్కో సారి జారవుతుంది అప్పుడు, పిండి ముద్దని ఫ్రిజ్ లో 30 నిమిషాలు ఉంచితే గట్టి పడుతుంది.
 • వేడి మీద పప్పులు గ్రైండ్ చేస్తే ముద్దవుతుంది.